1, డిసెంబర్ 2022, గురువారం

పౌరహక్కుల బాల గో పాల్ కు బొగ్గు మనిషి పరిచయం -మునీర్

పౌరహక్కుల  బాల గో పాల్ కు బొగ్గు మనిషి  పరిచయం -మునీర్ 


**************************************************

ఆంధ్ర దేశం  లో పౌరహక్కుల ఉద్యమానికి ఒక తిరుగులేని చిరునామా బాలగోపాల్. అనారోగ్యము తో మరణించినప్పటికీ అతని సేవలను  సింగరేణి కార్మికులు ఎప్పటికి మర్చిపోలేరు . కోల్ బెల్ట్ లో అతనికి వెన్నుదన్నుగా నిలబడ్డ వారు ఎవరంటే మునీర్ పేరే ముందు వరుస లో ఉంటుంది . 

ఒక బలమైన పౌర హక్కుల ఉద్యమం సింగరేణి ప్రాంతం లో నిలదొక్కుకోవటానికి బాలగోపాల్ కృషి ఎంతో విలువైనది . అదే సమయం లో బాలగోపాల్ వ్యక్తిత్వం ,మనుషుల పట్ల ప్రేమ మునీర్ ని కదిలించింది . దాంతో అందరు భయపడడ్డా ,తనని భయపెట్టినా ..  అన్నింటికీ మునీర్ సిద్ధపడ్డాడు. 

ఎంతో సాదా సీదా ఉన్న బాలగోపాల్ ను చూసి నేను మొదట ఆశర్య పోయాను . అప్పటికే దేశ వ్యాప్తంగా ఆయన కున్న పేరుకు ,ఆయన వేష ధారణకు   అస్సలు సంభందం లేదు . ఒకరికి ఒకరు పరిచయాలు అయిన తర్వాత ఆయన సూటిగా తాను వచ్చిన పని ఏమిటో చెప్పుకొచ్చిండు . 

"కోల్ బెల్ట్  ప్రాంతం లో పోలీసులు కిడ్నాప్ చేసిన  పాల్గుణ,కుమార్,సమ్మయ్య మరియు రవి ల విషయమై పౌర హక్కుల సంఘం తరుపున విచారణ చేయటానికి వచ్చాను .  ఈ విచారణ లో మీరు మాకు సహకరిస్తారనే ఉద్దేశ్యం తో వచ్చాను .. మీరు కాదనుకుంటే స్పష్టంగా తెలియ చేయవచ్చు .. ఇందులో మొహమాటాలకు తావు లేదు . . 'అన్నాడు సూటిగా 

బాలగోపాల్ మాటల్లో నాన్చుడు వ్యవహారం ఉండదు .. ఏదైనా దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం .. 

నేను ఒక్క క్షణం తటపటాయించాను . కానీ అంతటి వ్యక్తి వచ్చి అణిచివేతకు , అన్యాయానికి గురయ్యే ప్రజల తరపున నేను ఉన్నాను అంటుంటే నేను నిలబడక పోవటం భావ్యం కాడనిపించింది . 

ఆయనే మళ్ళీ "మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మానుకోవచ్చు . ఇందులో బలవంతం ఏమి లేదు "

"ఆబ్బె !అటువంటిది ఎం లేదు సార్ .. మీరు మాకోసం వచ్చినప్పుడు మీకు సహకరించకపోవడం

అన్యాయం అవుతుంది "

అట్లా మొదలైన బాలగోపాల్  పరిచయం  అటు తరువాత ఈ ప్రాంతం లో చాలా ఎన్కౌంటర్ ల పై నిజనిర్ధారణ కు వచ్చినప్పుడు ఆయన నేరుగా మునీర్ ఇంటికే వచ్చేవాడు . ఆలా తరచుగా రావడం తో ఆ ఇంట్లో ఒకడుగా  కలిసిపోయాడు . 

సిర్పూర్ (టి ) ప్రాంతం లో ఒకసారి  ఎన్కౌంటర్ జరిగితే నిజనిర్ధారణ కు బాలగోపాల్ వచ్చాడు . 

మునీర్ తో  కలిసి  మందమర్రి నుంచి కాగజ్ నగర్ వరకు బస్సు లో వెళ్లారు . అక్కడి నుండి ఎన్కౌంటర్ స్థలం బె జ్జుర్ కి దూరం దాదాపు 15 కిలోమీటర్లు . ఆ మార్గం లో వాహనాల సౌకర్యం లేదు .అక్కడికి చేరుకోవాలంటే సైకిల్ ఒక్కటే దిక్కు . చివరికి సైకిల్ మీదే బాలగోపాల్ అక్కడికి వెళ్ళాడు . 

ఆ ఎన్కౌంటర్ లో చనిపోయింది కోల్బెర్ట్ ప్రాంతం లోప్రముఖ  ప్రజాగాయకుడుగా  పేరున్న 

సుధ (సుందిళ్ల ధర్మన్న )సొంత తమ్ముడు . ఆదిలాబాద్ రైతాంగ పోరాటం లో ఎదిగివచ్చిన అతన్ని ,ఇన్  ఫార్మర్ ఇచ్చిన సమాచారం తో పోలీసులు అతను ఉన్న ఇంటిని చుట్టుముట్టి ,లొంగ దీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎన్కౌంటర్ పేర కాల్చి చంపారు . 

నిజనిర్ధారణ లో బాలగోపాల్ ది ఒక విశిష్టమైన విచారణా పద్దతి .. చాలా సాదా సీదా గా ,సూటిగా ప్రజల స్థాయి కి వెళ్లి మాట్లాడుతాడు . ఎక్కడా అతి ఉండదు . ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మనసు విప్పి మాట్లాడవలిసిందే .. 

ఆయన మనుషుల్ని చాలా ప్రేమించేవాడు .. 

"ఇలా మనుషులందరినీ చంపుకుంటూ పోతే సమాజం ఏమి కావాలి ?

అందులో ప్రజలను రక్షించాల్సిన రాజ్యమే ఇట్లా అమానుషా లకు తెగబడితే ఎలా?

ఈ విధంగా మనుషులని పట్టుకొని చంపడం భారత్ రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం .. అనేవాడు 

నేరం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప ఎన్కౌంటర్ లు ప్రజాస్వామ్యం కాదు .  





 

30, నవంబర్ 2022, బుధవారం

నీటి అడుగు

నీటి అడుగు 

***********

 అలసి పోయి కొనఊపిరి నిలిచి పోయిన   

రాలిపోయిన ఎండుటాకుల్ని కుప్పచేసి 

ఈ  చలి  కాలం  మంట కాగవచ్చు వెచ్చంగా .. 

జ్ఞాపకాలు కొన్ని బూడిద లో చేరి 

ఇక బుద్దిగా  నిదురలోకి జారిపోతాయి 

***********

వెలుగు రేకులు పూర్తి గా విరబూయక ముందే  

సూర్య కిరణాలు తాకి కంటి వెలుగులయ్యే పచ్చని ఆకుల్ని 

నా ఆనందాశ్రువులతో ఒక్క సారి తడి చేయాలని  వుంటుంది 


నువ్వు  గాలై  వీచి, వీచి  కొమ్మలు ఊ యలలయ్యే  వేళకి 

కడిగిన ఆకుల చినుకులు నేల తాకితే .. 

ఆ పదను కే .. 

జ్ఞాపకాల గొడుగు పురి విప్పుకుంటుంది 

ఊరేగింపులా జీవితం నీటి అడుగులు వేస్తుంది 





 

28, నవంబర్ 2022, సోమవారం

ఒకానొక నువ్వు


ఒకానొక నువ్వు 


 తెరిచి పెట్టిన  గుండె తలుపు   కిటికీ 

బాండ బారిన సమాజానికి వెలుపల 


 కవిత్వానికి  అదే దొడ్డిదారి 

 కటకటాల కిటికీది  పోరుదారి 


ఇప్పుడు .  

వీధి గుమ్మం బార్లా తెరిచి వుంచాను 

నువ్వు..  నాలోకి .. 

నేను..  నీ లోకి 

గదిలోకే  అయినా 

జలపాతం లా దూకేందుకు వీలుగా  .. 


ఎండ దుప్పటి పరుచుకొని నిన్న 

నీకోసం చూసాను 

మనుసు దుమ్ము దులుపుకొని ఈ రోజు 

మళ్లీ  ఎదురు చూసా .. 

ఆశ కి చావు లేదు 

రేపటి ఘన స్వాగతం గురుంచి 

పగటి కలలు కంటూనే ఉన్నాను 


ఖచ్చితత్వాన్ని కాల గర్భం లో కలిపిన కాలాన్ని 

గోడ గడియారం లో  బంధించాను  

గంట గంటకు అది ఒకటే కొట్టుకోవడం నా గుండె లాగ.. 


తలుపంత కళ్ళేసుకుని అవే  ఎదురు చూపులు 

పాదాలు రెండు దీప స్థంభాలు .. 

చేతి వేళ్ళు ఎప్పుడో పది వింజామరలై  గాలిలో .. 










#muneer family

 

కుటుంబం x సమాజం 

పురుషులందు పుణ్య పురుషులు వేరయా .. 

పితృ స్వామిక సమాజం లోనూ మగవాళ్ళ మధ్య  సమానత్వం లేదు .. 

పాపపుణ్యాలను నమ్మని వారు  .. మనిషి చైతన్యాన్ని పరిగణ లోకి తీసుకునే వారు 

పైన చెప్పిన వేమన పద్య చరణాన్ని ..  మనుషులందు పోరాడే మనుషులు వేరయా .. అని మార్చుకోవచ్చు  .. 

పోరాడే మనుషుల్లోను  రూపం ,సారం .. సమస్య ఒకటి ఉంటుంది . 

పైకి కనిపించే రూపం లో మునీర్ ఒక పోస్టర్ బాయ్ .. ఉవ్వెత్తున లేచి పడే  సింగరేణి కార్మిక వర్గ చైతన్యానికి ఒక ప్రతీక . 

సారం లో మనలాంటి మామూలు మనిషే .. కానీ మన చుట్టూ ఆవరించి వున్న సామాజిక చట్రం లోనే  కుటుంబ బాధ్యతలను నిర్వరిస్తూ ,తన  చైతన్యం తాలూకు అభిప్రాయాలను ,ఆలోచనలను వదిలిపెట్టకుండా  తన మత అస్థిత్వాన్ని గౌరవిస్తూనే సామాజిక బాధ్యతల పట్ల ఒక ఎరుక కలిగి ఉండడం.. ఒక   గొప్ప విషయం .. అది మనకు మునీర్ లో కనిపిస్తుంది .  

చాలా మంది ఒక సామాజిక మార్పు కోసం నిలబడాల్సి వచ్చినపుడల్లా కుటుంబాన్ని ,సమాజాన్ని ఎదురెదురుగా నిలబెట్టి , కుటుంబాన్నే ఎంచుకొని ఒక రక్షణ లో ఇమిడి పోవడానికి సిద్దపడిపోతారు . 

ఇక్కడ మునీర్ ఆ మూస పోసిన విధానాలను బద్దలు కొడతాడు . 

నిజంగా  పోరాడే భావాలే మనలో ఉంటే ,దానికి ఏవి  అడ్డు నిలబడ లేవు . మన నిజాయితీ పట్ల నమ్మకం ఉన్న వారెవరు ,కుటుంబ సభ్యులు సైతం మనల్ని మన  ఆచరణ నుండి ఆపలేరు .ఈ విషయాన్ని మునీర్ అతి సునాయాసంగా చేసి చూపిస్తున్నాడు . అతడు ఒక సజీవ ఉదాహరణ .  

 గుండె తలుపు 


కిటికీ ..  చిట్టివి రెండు రెక్కలు దానికి 

ఎప్పటికప్పుడు మడిచి 

జేబులో పెట్టుకుని పోయే బుల్లి పిట్ట నాకు 


కిటికే .. లోకం గా బతికిన రోజులు 

ఇప్పుడు గురొస్తే ఇది చావు కన్నా హీనం 


కిటికీ రెక్కలు పూర్తిగా విరిచి కట్టి 

గాలికి  గుండె లో గుడి కట్టేవాణ్ణి 


 గడప దాటి వెళ్లే స్వేచ్ఛ లేని బాల్యం 

కిటికీని కంటికి రెప్పలా కుట్టేసుకున్నాను 


సగం కోసిన  కిటికీ రెక్కలు లు తెలుసు 

పై రెక్కలు మాత్రమే తెరిచి బురఖా తో లోకాన్ని చూడాలి 

 ఆమె .. అలా  చీకట్లో మగ్గిపోవాలి 


ఎంతో నయం నా జీవితం 

మగ పుట్టుక పుట్టినందుకు 

అవునూ .. అప్పట్లో కిటికే    

నిలువెత్తు నా గుండె తలుపు .. 







24, నవంబర్ 2022, గురువారం

A K 47జర్నలిస్ట్

 A K 47జర్నలిస్ట్ 

బొగ్గు పెల్ల కే  నోరుంటే  .. అది తప్పకుండా  మునీర్ గొంతుకే ! 

ప్రజల గొంతుకను నినదించేందుకే పత్రికా రంగాన్ని ఎంచుకున్నాను .. 

 తన జర్నలిస్టు  నేపధ్యం గురుంచి చెప్పాడు . అతని మాటల్లోనే .. 

"ఆ సమయం లో నేను అనేక విషయాలతో ఘర్షణ పడాల్సి వచ్చింది . నా జైలు జీవితం తర్వాత నా కంటూ ఒక కుటుంబం ఏర్పడింది. సింగరేణి  ఉద్యోగం ఉంది . అయినా మనసులో ఎదో ఒక అసంతృప్తి . 

ఇన్నేళ్ళుగా నేను ఏ పార్టీ (భారత కమ్యూనిస్ట్ పార్టీ ) లోనైతే తిరిగానో ,ఎవరితో కలిసి పని చేసానో .. వారి పట్ల ,వారి నడవడిక పట్ల  ఒక అసంతృప్తి . వాళ్ళ రాజీ  ధోరణి ,అవకాశవాద లంచగొండి విధానాలు నాకు అస్సలు నచ్చేవి కావు . 

సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయి ? మన నడవడిక ఎట్లా వుంది ?  ఇట్లా అయితే కార్మికవర్గానికి మనం ఏమి మేలు చేస్తాం ? - ఇలా ఘర్షణ పడేవాణ్ణి . 

కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం వుంది . కాని , ఆచరణే అందుకు భిన్నంగా ఉందనిపించేది . 

నా విమర్శలేవి అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు . పైగా నన్ను శత్రువులా చూడటం మొదలు పెట్టారు . మరోవైపు అప్పుడే మొగ్గ తొడుగుతున్న విప్లవోద్యమం   నన్నెంతగానో ఆకర్షించింది  . అదే సమయం లో విప్లవం పేరు మీద జరుగుతున్న దుందుడుకు చర్యలు నన్ను ఇబ్బంది పెట్టాయి  . 

ఇటువంటి సందిగ్ధ సందర్భం  లో   నన్ను నేను నిలబెట్టుకోవడానికి   నాలో ఒక అన్వేషణ మొదలైంది . 

అమ్మ ఎప్పుడూ చెబుతూ వుం డేది .. 

"బిడ్డా ! లోకం లో మంచివాళ్ళకే కష్టాలు ఎదురైతయి. కష్టాలు ఎదురైనవని మంచిని వదులుకుంటే మనిషి బ్రతికి వుండి సచ్చినట్టు లెక్క !" 


 పత్రికలు ;పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు -మహాకవి శ్రీ శ్రీ 

ఈ స్పృహ వుండింది తనకు . కాని , ఎదో ఒక మేరకు ప్రజల గొంతును వినిపించటానికి ఇంతకు మించిన మార్గం  కూడా లేదనుకున్నాడు . 

అప్పుడు  పత్రికల్లో సింగరేణి కాల్ బెల్ట్ వార్తలు 'సింగిల్ కాలమ్ "(single column )కే  పరిమితమయ్యేవి . 

వాటికి నడక నేర్పి పరుగు పెట్టించాలి . 

ఆ   సంకల్పం తో మొదట ' స్ట్రింగర్  '(stringer ) గా "ఈనాడు "దిన పత్రిక లో చేరాడు . కాని , అక్కడ సరిపడక "ఆంధ్రజ్యోతి " కి మారాడు . మధ్యలో కొన్నిరోజులు ఆ పత్రిక ఆగిపోయినా ఆ తర్వాత అందులోనే కొనసాగాడు . 

అవి .. విప్లవ కార్మికోద్యమం  మంచి ఊపు మీదున్న రోజులు . సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య )ఎర్రటి అక్షరాల గోడ పోస్టర్ చూస్తే చాలు కార్మికులు కదనరంగం లోకి దూకే వాళ్ళు . అప్పటి ఆదిలాబాద్ ,కరీంనగర్ (ఇప్పుడు మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలు )ప్రాంతాల లోనే కాదు కొత్తగూడెం వంటి  దూర  ప్రాంతాలకు కూడా సికాస కార్య కలాపాలు విస్తరించాయి .

 దాని వెంట ప్రభుత్వ అణిచివేత మొదలయ్యుంది . 

అప్పటికింకా తెలుగుదేశం పార్టీ అధికారం లోకి  రాలేదు .  1983 లో ఆ పార్టీ  అధినేత ఎన్ .టి రామారావు  " నక్సలైట్లే దేశభక్తులు " అని ప్రకటించి , ముఖ్య మంత్రి అయ్యాక  1985 ఏప్రిల్ నెలలో   కొండాపూర్ ఎన్కౌంటర్ తో తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు . ఆ తర్వాత పోలీసుల దమన కాండ పెరిగింది  .

 ఊడ్లకు ఊళ్లు తగలబెట్టడం ,కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేయడం ,విప్లవ కారులు కనిపిస్తే కాల్చివేయడం లాంటి యుద్దవాతావరణం లో తెలాంగాణ గ్రామాలు రక్తసిక్తం అయ్యాయి . 'భారతి' ,'పియర్ వికాస్' వంటి పేర్లతో నల్లదండు ప్రభుత్వ ముఠాలు పుట్టుకొచ్చాయి . 

ప్రత్యేక పోలీసు బలగాల వేట లో గ్రామాలు తల్లడిల్లాయి .చివరికి ప్రజాస్వామిక వాదులు  కూడా ఈ దాడులకు గురికాక  తప్ప లేదు . 

నిర్బంధ ప్రభావం బొగ్గుగనుల్లోకి విస్తరించింది . కాలరీ ప్రాంతం  మొత్తం  రక రకాల సాయుధ బలగాలతో నిండిపోయింది . 

ముఖాలకు నల్లటిగుడ్డలు కప్పుకుని కార్మిక వాడల్లో  ఊరేగింపు జరిపే ఇండో టిబెట్ సైనికుల పద ఘట్టనలతో    నల్ల నేల తల్లడిల్లింది. 

ఎప్పుడు , ఎవరిని ..ఏ అర్దరాత్రి   పట్టుకు పోతారో తెలియని పరిస్థితి . అరెస్టులు , చిత్రహింసలు కాలరీ ప్రాంతం లో నిత్య కృత్యం గా మారిపోయాయి . 

మిస్సింగ్ కేసులు 

లాటి అమెరికా దేశాలలో మాదిరిగా మనుషులని మాయం చేయడం . 

మునీర్ పనిచేసే మందమర్రి కే కే 5 ఇంక్లైన్ లో కార్మికుడు సమ్మయ్య ను ,అతనితో పాటు మరో ఇద్దరినీ ఎత్తుకుపోయి పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశారు . 

బాధితుని భార్య మునీర్ తో తన గోడు వెళ్లబోసుకుంది  . 

ఎన్కౌంటర్ గురుంచి వాస్తవాలు రాయటం .. అంటే  పెద్ద సాహసమే !

పోలీసుల 'అట్రాసిటీ'  గురించి ఏమి రాసినా  అప్పట్లో "కొరివి తో తల గోక్కున్నట్టే !"  


సమ్మయ్యను మాయం చేసిన కథనం  ఫోటో తో సహా తెల్లారి పత్రికలో వివరంగా వచ్చింది. 

తనకు పరిచయం ఉన్న కానిస్టేబుల్ మిత్రులు కొందరు "అన్న .. అతిగా పోతున్నవ్ .. మా సర్కిల్ చాలా కోపం మీద ఉన్నాడు . జాగ్రత్త !"అని హెచ్చరించేవారు . 

అప్పుడప్పుడు ఎన్కౌంటర్ విచారణకు బాలగోపాల్ వంటి పౌర హక్కుల నాయకులు వచ్చే వాళ్ళు . 

పౌర హక్కుల సంఘం కు సహకరించడం అంటే  కూడా అంతే !

"హక్కుల సంఘం వాళ్లంటే .. అన్నింటికీ తెగించిన వాళ్ళు .. మనం అట్లా కాదు కదా .. వాళ్ళు వస్తరు .. పోతరు .. తెల్ల వారిన తరువాత .. పోలీసు వేధింపులు .. ఎందుకొచ్చిన తంటా .. "అని ఇతర జర్నలిస్ట్ మిత్రులు  భయ పెట్టేవారు .  

అవేవి  లక్ష్య పెట్టేవాడు కాదు .. ఇంట్లో అమ్మ కానీ ,తన భార్య రిజ్వానా కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావని కూడా అడిగే వాళ్ళు కాదు . అయినా వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ ఎదో భయం తొంగి చూసేది . 

"పంధై  పదేళ్లు బ్రతకటం కంటే నందై నాలుగు ఏండ్లు బ్రతికినా చాలు " అని అమ్మ చెప్పే సామెత ను గుర్తు పెట్టుకొని , పౌర హక్కుల నాయకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లచేయడమే కాకుండా వారితో పాటు వెళ్లి  బాధిత కుటుంబాలను కలిసేవాడు . 

1987 ఆగష్టు 14, తెల్ల వారితే స్వాతంత్ర దినోత్సవం , కొత్తగూడెం ప్రాంతం లో సికాస నాయకులైన మోట శంకర్ ,షంషేర్ ఖాన్ ,రవీందర్ రెడ్డి , వీరయ్య లను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి  చంపారు . 

అలా సింగరేణిలో ఎన్కౌంటర్ ల పరంపర మొదలైంది .. 

ఎత్తుకు పోయి ,మాయం చెయ్యడం  లాంటి  దుర్మార్గాలకు  కూడా పోలీసులు తెగబడ్డారు .

సమ్మయ్య , పాల్గుణ ,సారయ్య మరియు  కుమార్ అనే సికాస కార్యకర్తలను మొదట మాయం చేసి అటు తర్వాత కాల్చి చంపి ,ఆ విషయాన్ని తొక్కి పెట్టారు .

 ఇటువంటి ప్రభుత్వ హత్యలు .. మిస్సింగ్ కేసులుగా నమోదు అయ్యేవి . 

మందమర్రి కి పది కిలోమీటర్ల దూరం లోని  బెల్లంపల్లి  కాలరీకి చెందిన కుమార్ ను అక్కడి నుండి మరో పది కిలోమీటర్ల దూరం లో  మాదారం కాలరీ లో ఉండే అతని అక్క ఇంటి నుంచి ఎత్తుకెళ్ళి ,మాయం చేశారు .

 ఈ కిడ్నాప్ కథనాన్ని మునీర్ ఆంధ్రజ్యోతి కి పంపించాడు .అయితే బెల్లం పల్లి వార్తను మందమర్రి డేట్ లైన్ లో పనిచేసే మునీర్ వ్రాయటం ;ఇద్దరి విలేకరుల మధ్య ఘర్షణకు దారి తీసింది .

అప్పట్లో పోలీసులకు భయపడి మిస్సింగ్ వార్తలు రాయటానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే వాళ్ళు కాదు . ఇది..  మునీర్ చొరవ !

ఈ మిస్సింగ్ వార్తా  కథనం కోల్ బెల్ట్ లో పెద్ద సంచలనం అయింది . 

కుమార్ అప్పటికే  'సిపిఐ ' అనుబంధకార్మిక సంఘం  'ఏఐటీయూసీ' లో చురుకైన కార్యకర్త కావడం తో విషయం  కాస్త 'సీరియస్'  అయింది . 

 కుమార్ ను  వెంటనే విడుదల చేయాలని , బెల్లంపల్లి  బావులు బందు పెట్టి సమ్మెకు దిగారు . ప్రభుత్వం  దిగి వచ్చి , విచారణకు ఆదేశించింది .

 మధుకర్ అనే  పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు . 

ఈ మొత్తం వ్యవహారానికి మునీర్ ని భాద్యుణ్ని చేస్తూ పోలీసులు బెదిరింపులకు పూనుకున్నారు . 

ఈ మిస్సింగ్ కేసు విచారణకు పౌరహక్కుల సంఘం తరుపున బాలగోపాల్  నేరుగా మునీర్ ఇంటికే  వచ్చారు .

పోలీసు పహారాల మధ్యే మునీర్ సహకారం తో బాలగోపాల్  కేసు  విచారణను విజయవంతంగా ముగించేవాడు . 

మిస్సింగ్ కేసు లపై ప్రజల ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం టి .లక్ష్మి నారాయణను   కమీషనర్ గా    నియమించింది . 

 మునీర్  'కోల్ బెల్ట్' లో    పన్నెండు మిస్సింగ్ కేసుల  కుటుంబాలను కలిసి , సాక్ష్యాలను నమోదు చేసి కమిషన్ ముందుకు తీసుకు పోయారు . 

ఈ కుటుంబాలను వెంటబెట్టుకుని అనేక మార్లు కమీషన్ ముందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది . ఇదంతా పోలీస్ అధికారులకు కోపకారణం అయ్యేది . మునీర్ ని రకరకాలుగా వేధించేవారు . 

అర్థరాత్రప్పుడు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనం తో వచ్చి ఇంటిని చుట్టుముట్టేవారు . సోదాలు చేసేవారు . నక్సలైట్లు వచ్చారని సమాచారం ఉందని దబాయించే వాళ్ళు . 

కొన్నిసార్లయితే "వాణ్ని ఎన్కౌంటర్ చేస్తాం .. అప్పుడు ఎవడు వచ్చి నిజనిర్ధారణ చేస్తాడో చూద్దాం .. అంటూ  పోలీస్ అధికారులు తమ కోపాన్ని బహిరంగం గానే వెళ్లగక్కేవాళ్ళు . 









22, నవంబర్ 2022, మంగళవారం

#muneer 4

 నదీ పరివాహక ప్రాంతం లోనే  మొదట మనిషి బ్రతికి బట్ట కట్టింది .. ఆ తర్వాత నీటి చెలిమల్ని కనిపెట్టి ఉంటారు . మెల్లిగా నీళ్లబావి తవ్వుకోవడం నేర్చుకొని ఉంటారు  .. 

పారిశ్రామిక విప్లవం బద్దలయ్యేంతవరకు మానవ నాగరికత నీళ్ల  బావి చుట్టే తిరిగింది . అంట రాని  తనం పురుడు పోసుకున్న మన దేశం లో కొన్ని కులాలకు మంచి నీళ్ల బావి నిషిద్ధమైంది 


ప్రపంచవ్యాప్తంగా ఈ నదీ తీరప్రాంతాలలోనే బొగ్గు నిల్వలు బయట పడ్డాయి . గనులు తవ్వారు. వాటిని వాడుక భాష లో బొగ్గుబావులే అనేవారు . ఆ తరవాత పెట్రోల్ బావులు వచ్చాయి .  ఎవరికి  వాళ్ళు  వారి  అవసరాన్ని బట్టి వాడుకొనేవి నీళ్లు . కాబట్టి మంచినీళ్ల బావులు ఊరు  వాడ కి లేదా  ..కొన్నిచోట్ల దొరలకి సంబంధినవి గా ఉండేవి . 

మన దేశం లో మంచి నీటి కోసం యుద్దాలు కూడా జరిగాయి . 

ఒక వైపు మంచి నీళ్ల బావుల కోసం ఇలాంటి పరిస్థితులు ఉండగా ,ఖండాలు దాటి వచ్చిన తెల్లవాడు బొగ్గు బాయలు తవ్వాడు . మంచి నీటి లాగ అది ప్రకృతి సంపదే .. కానీ దాని మీద అధికారం వాడిదయ్యింది . వాడి రాజ్యాధికారం వందల ఏండ్లు అపప్రతిహతం గా కొనసాగడానికి అది ఇంధనమైంది . ఇలా ప్రకృతి సంపదల మీద వారి ఏకఛత్రాధిపత్యం ఇవ్వాళ ప్రపంచ పర్యావరణాన్ని సంక్షోభం లో పడ  వేసింది. 

మానవాళి అభివృద్ధి పేరు చెప్పి వారి అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు విచ్చల విడిగా మిలటరీ అవసరాల కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఒక పరిశోధన లో వెల్లడైనది . 

ప్రజా అవసరాలకే అయితే ఇంత ఇబ్బడిముబ్బడిగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు తవ్వి ,మరింతగా కాలుష్యాన్ని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేదు . పెట్టుబడి దారుల లాభాపేక్షకు అంతం లేదు . ప్రపంచాన్ని మొత్తం భయం అంచున నిలబెడతారు . అభివృద్ధి యజ్ఞం లో ప్రజలను బలిపశువులను చేస్తారు .   

#muneer

 notes.. 

అనేక చెట్ల సమూహమే అడవి . తీరొక్క చెట్టు అడవి నిండా .. అదే ప్రకృతి .. భిన్నత్వం లో ఏకత్వం . 

మానవుడూ అంతే .. సమాజం ఒక ఆలంబన . 



#muneer

 #మునీర్ 

ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం .. నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం .. అంటాడు మహాకవి శ్రీ శ్రీ .. 

కానీ కార్మికోద్యమ చరిత్ర దానికి మినహాయుంపు .. క్రీ .శ . 871 లో కొద్దిరోజులే నిలిచినా పారిస్ కమ్యూన్ ,ఆ తర్వాత చికాగాలో   క్రీ .శ .1886 లో మేడే పోరాటం .. ఆ స్ఫూర్తి తో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కార్మిక వర్గ విప్లవాల చరిత్ర పెట్టుబడిని ఇప్పటికి భయపెడుతూనే వుంది . విశ్వవ్యాప్తం అయిన సోసిలిస్ట్ భావనలు మనిషిని బానిసత్వం నుంచి విముక్తం అయ్యేటందుకు ప్రేరేపించాయి . 

వలసల తో ,సాంమ్రాజ్యవాదం తో ప్రపంచాన్ని పంచుకు తిన్న పెట్టుబడి , సంకోషభాలలో మునిగి తేలుతూ ప్రపంచీకరణ ఫాసిస్ట్ విధానాలతో ఇప్పుడు ప్రజలు శత్రువు గా నిలబడింది . 

ఇవ్వాళ రెండే  రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిపోయింది . రాజ్యాధికారాన్ని గుప్పిట పెట్టుకున్న 

గుప్పెడు దోపిడీ వర్గాలు . ప్రపంచ మానవాళి కనీస అవసరాల కోసం ,సాధించుకొన్న హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గం . 

దోపిడీ గుట్టు విప్పి చెప్పిన మార్క్సిజం వెలుగులో కార్మికోద్యమ చరిత్ర కొత్త పుంతలు తొక్కింది .. 

మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులు ;లెనిన్ ,స్టాలిన్,మావో ల బాటలో అనేక విజయాలు సాధిస్తున్నారు 


21, నవంబర్ 2022, సోమవారం

 జీవితం చిన్నదే కదా !

 -----------------------------

 చీకటి వెలుగుల్ని తోసుకుంటూ 

తన చుట్టూ తనే భ్రమించే 

భూగోళం బుగ్గపై గిల్లి చూస్తాను 

నువ్వు .. నిజమా .. కల .. అని 


ఆ మాత్రం దానికే ఎక్కడో చిల్లు పడి 

జ్ఞాపకాల ప్రవాహం జారీ పడి .. 

చలికాలం నిద్ర ముసుగు తొలిగి పోతుంది 


కొండల్లో పాతుకు  పోయిన చెట్టు మొదలు 

జారిగిల పడ్డ ప్రయాస .. 

ఇంకా కండ్లు మూసుకొనే నీ చేతి లో చేయు వేసి నడుస్తూ వుంది 

వెతుకులాట విస్తీర్ణం ఎప్పుడూ కనుచూపు మేరలు దాటుతూనే ఉంటుంది 


పువ్వు లు పూసి మొక్కలు సిగ్గు పడుతుంటాయి 

బాటసారి పాదాల పగిలిపోని బొబ్బలు చూసి .. 


గొప్పలు కాక పోతే జీవితం ఏమంత గొప్పది 

గుప్పెడు గుండె లో ఇమిడిపోయే 

పిడికెడు ప్రేమకు బానిస .. 




 అపరిచితం 

----------------

 ఒక వేట నిరంతరాయం గా కొనసాగుతుంటుంది .. 

విషయాన్ని మాములుగా చెప్పాలనే మనసు రాయి చేసుకుంటాను 

అయితే .. 

ఆ రాయినే ఎవరో చేతిలోకి తీసుకొని నా ఆలోచనల తుట్టె మీదికి విసురుతారు 

అంతే .. 

నా భాష మారిపోతుంది 

పరిసరాలు రక్తం పులుముకుంటాయి 

నా భావాలు నన్నే ప్రశ్నలతో తూట్లు పొడుస్తుంటాయి 

నేను వేటాడబడుతుంటాను 

కాలు కింద పెట్టకుండా పరుగెడుతుంటాను 

దాక్కోడానికి చాటు కోసం వెదుక్కుంటాను 

అక్షరాలే నన్ను తమలో పొదువుకుంటాయి 

అలసిపోయి కొంత .. అలవాటుగా కొంత 

వాటి గుండెలపై ఒదిగిపోతాను 


.. ఇది అసలు విషయానికి గొంతు సవరింపు  మాత్రమే .. 

అలాగని విషయం పెద్దగా  ఏమీ ఉండదు .. 

ఇలా అటు ఇటుగా పదాలు తిరగేసి 

చివరికి పెదవి విరవటమే .. 

అబ్బే .. ఏమీ లేదండి .. 

కానీ విషయం చిన్నదే .. ఒక్క మాట పెట్టు !

వివరించే తాపత్రయం హడావిడి మాములుగా ఉండదు 

భరించాలి .. కవిత్వం అంటే అంతేనేమో !


... 

దినమంతా మిత్రుడి వెంట 

ఒక ప్రాణ సమానమైన రాజకీయ చర్చ చేస్తాను 

దాని చుట్టు అనేక విషయాలు వచ్చి చేరుతుంటాయి 

విచిత్రంగా  నువ్వు అక్కడా  

లీలగా కదలాడుతుంటావు 

అలసిపోయి నిద్రగది కి చేరుకుంటే 

తలుపు తోసుకుని మరీ నీ తలపే .. 

నీ స్మరణకు పరిపూర్ణమైనది ఒక్కటే .. 

దానికోసం వెతుక్కుంటాను 

కళ్ళుమూసుకొని గజల్ గీతాన్ని 

ఆవాహన చేస్తాను 

జగజిత్ సింగ్ తసల్లీ స్వరం .. 

ఈ ప్రపంచం లో .. 

నా జీవితానికి నేనే అపరిచితుడ్ని 

ఒక్క  .. నీకు తప్ప .. 







8, నవంబర్ 2022, మంగళవారం

 మునీర్ .. పేరు వల్ల కొంత తెలిసిపోతుంది..  ఇస్లాం మతం లో పుట్టి పెరిగాడు .. ఆ పేరు గాని ఆ మతం గాని అతన్ని ఈ తెలంగాణా పల్లె మందమర్రి  కాలరీస్ ప్రాంతం లో ఎదగడానికి పెద్దగా ఎలాంటి ఆటంకాలు కలిపించినట్టు లేదు . ఏదైనా వివక్ష ఎదుర్కొని ఉంటే ఆ విషయం అతనే విప్పి చెప్పాలి . 

ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాబట్టి వివక్ష కొట్టొచ్చినట్టు కనబడేది కాదు. 

భారత్ స్వాతంత్రోద్యమ చరిత్ర లో నే హిందూ ముస్లిం బీజాలు పడ్డాయి నిజం కాలం లో తెలంగాణా  లో రజాకార్ల అరాచాకాల వల్ల అలాంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో ప్రజల మధ్య స్నేహం మిగిలి ఉంది . కానీ సామాజిక పరిస్థులు అస్తిత్వాలని పక్కకు పెట్టే స్థాయికి ఎదగని కారణంగా అస్తిత్వాల వివక్ష కొనసాగేది . కుల వివక్ష కు పోటీగా కాక పోయినా ముస్లిం అనే అస్తిత్వం 

ప్రత్యేక కృషి వల్లే పైకి వచ్చే స్థితి.సాధారణ  సామాజిక ప్రవాహం లో కొట్టుకు వచ్చే అవకాశాలు తక్కువ. మరి అలాంటి గతం లోంచి ,మతం లోంచి ఎదురీది ఉన్న ఊరు కి పేరు తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు . 


పోస్టర్ బాయ్ .. 

***********

 ప్రపంచీకరణ యుగం లో యువతరం అంతా ఇష్టపడే విప్లవ ముఖ చిత్రం చేగువేరా ,, 

దేశభక్తి ముసుగు ని చించి ,దేశాల సరిహద్దులు చెరిపేసి విప్లవాలు నడిపిన చేగువేరా ఇంతగా అందరిని ఆకర్షించడం లో రాజకీయాలు ఏమి వున్నా మనిషి ఒక సత్యానికి దూరం గా బ్రతకలేడ నే విషయం ఇక్కడ వెల్లడవుతుంది . 

భారత విప్లవ ముఖ చిత్రం .. భగత్ సింగ్ 

కరెన్సీ నోట్ల మీద , కోర్టు గదుల్లోను గాంథి మహాత్ముడే ఉండొచ్చు .. స్వాతంత్రం తెచ్చాడని అతనికి ప్రతి ఏడు హారతులు పడుతూ ఉండొచ్చు .. కానీ నిఖార్సయిన విప్లవ కారుడిగా భగత్ సింగ్ పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది . 


తెలుగు నాట జార్జి రెడ్డి పేరు అలాగే గుర్తు చేసుకుంటాము 


వాళ్ళే మొత్తంగా సమాజం లో మార్పులకు కారకులు అని కాదు కానీ వాళ్ళు మన హృదయాల్లో ప్రతీకలుగా మిగిలిపోయారు . 

.. 

ఈ భూగోళం  మీద ఒక చెమట చుక్క .. ఒక నెత్తు టి బిందువు లాంటి మనం పుట్టిన ఊర్లు ఉంటాయి . ఆ ఊరు పేరు నిలబెట్టే మనుషులు ఉంటారు .. 

సింగరేణి బొగ్గు గని ప్రాంతమైన మందమర్రిలో మునీర్ అనే వ్యక్తి ఒక సమూహం .. ఒక ముఖ చిత్రం .. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే .. పోస్టర్ బాయ్ .. 

మా తరానికి 1980 దశకం లో .. ఆ పేరు ఒక్కటే చాలు .. 

 శోధన

నీ వల్లే సుసంపన్నమయ్యా

బహుశా నీ వల్లే... 

సమృద్దమయ్యా.. 


ఆ నీవెవ్వరో కనిపెట్టే ప్రయత్నమే

ఒక జీవితమై నలుదిక్కులా పరుచుకుంది 

ఒక వలపులా.. తియ్యని తలపు లా.

 ఏది నిట్టనిలువుగా చీలదు


ఏది నిట్ట నిలువుగా చీలదు

నువ్వో  వైపు.. 

నేనో వైపు .. 

నిరంతరం చలనంలో వుంటాం.. 

తిరిగి తిరిగి కలుస్తుంటాం.. 

సునామిలు చెలరేగినా  సముద్రము 

చీలిపోదు.. 

భూకంపాలు వచ్చినా భూగోళం

ముక్కలవదు

అవిశ్రాంత పోరాటం నిలబెట్టిన 

అపురూప జీవాలం... మనుషులం

మన ఐక్యత లో సమాజాలు నిలిచాయి 

నాగరికతలు రూపు దిద్దుకున్నాయి

ఘర్షణతో ముందుకే నడిచాయి 

అంతే  కాని. . 

మనిషెప్పడు  భయంతో చెదరిపోలేదు

స్వార్థ చింతన తో చీలిపోలేదు


7, నవంబర్ 2022, సోమవారం

 అభాగ్య జీవులు .. 

the wretched  of  the  earth . by frantz  fanon 


పాలక వర్గాన్ని ప్రాధమికంగా నిర్వచించేది ఫ్యాక్టరీలు ,ఎస్టేట్లు ,బ్యాంకు అకౌంట్స్ కాదు. పాలక జాతి అంటే మొట్ట మొదటిగా ,స్థానికుల కంటే భిన్నంగా ఉండే వేరే ప్రాంతం నుండి వచ్చిన బయటివాళ్ళు. ఇతరులు. 


వలస ప్రాంతాలలోని చర్చి తెల్లవాడి చర్చి . విదేశీయుల చర్చి . అక్కడి చర్చి పిలుపులు వలస ప్రజలని భగవంతుని మార్గానికి మల్లించేవి   కావు . తెల్లవాళ్ళ మార్గానికి ,యజమాని మార్గానికి ,ఆధిపత్యం చెలాయిన్చే వాళ్ళ మార్గానికి మల్లించేవి . 


మానికీయం తత్వం ... ఒక పురాతన ధార్మిక చింతన . సృష్టి లోని ప్రతీది పరస్పర విరుద్ధమైన రెండు శక్తులుగా విడిపోయి ఉంటుందని భావిస్తారు . మంచి -చేడు . తెలుపు- నలుపు . దేవుడు -దెయ్యం . ఒకటి ఉండి రెండోది లేకపోవడం అనేది ఉండదు ఇప్పుడు దీనిని డ్యూయలిజం లేదా ద్వైతం అంటున్నారు. 

వలస పాలకుడు రూపొందించిన ప్రపంచము లో వలస పాలితుడిని ఎప్పుడు నేరస్థుడిగానే పరిగణిస్తారు.  వలస పాలితుడు తన నేరాన్ని అంగీకరించడు. కానీ దాన్ని ఒక శాపం గా పరిగణిస్తాడు . 

ఏది ఆటంకంగా  ఉన్నదో అదే కొన్ని ఉద్వేగ పూరిత సమయాల్లో జరగవలిసిన కార్యాన్ని ఉధృతం  చేస్తుంది . 

మతం వల్ల  వలసపాలితుడు కూడా వలస పాలకుని ఉనికిని గమనించకుండా ఉండిపోతాడు . 

వలస ప్రపంచం లో ,వలస ప్రజల ఉద్వేగాలు ఎప్పుడు , పచ్చి పుండు సున్నానికి జంకినట్టు అతిసులభంగా గాయపడేలా ఉంటాయి 


వలస దేశాలలో కేవలం రైతాంగం మాత్రమే విప్లవాత్మకం గా ఉంటుందనేది చాలా స్పష్టం . వాళ్లకి పొందడానికె తప్ప పోగొట్టుకోవడానికి ఏమి లేదు . ఏ హక్కులు లేక దోపిడీకి గురవుతూ ,కడుపు మారుతున్న రైతు చాలా తొందరగానే హింస ద్వారానే ఫలితం ఉంటుందని గ్రహిస్తాడు . 

వలస దేశాల ఉన్నత వర్గం ,అంటే విముక్తి పొందిన బానిసలు ఒకసారి ఉద్యమ శీర్ష స్థానానికి వచ్చాక అనివార్యంగా బూటకపు ఉద్యమాలు నడుపుతారు 


వలస దేశపు వ్యక్తి భార్యకు దుస్తులు కొనే బదులు రేడియో కొనుక్కోవడం చూసి కొన్ని సార్లు కొందరు ఆశర్యపోతారు . కానీ అలా ఆశర్య పోనవసరం లేదు . వాళ్లొక ప్రళయాంతక వాతావరణం లో ఉన్నారు కాబట్టి అన్నీ అనుభవించాలని అనుకొంటారు . 


పని పరిస్థితులను చక్కదిద్దక పోతే సామ్రాజ్యవాద  శక్తులు జంతు స్థాయి కి కుదించిన ఈ ప్రపంచాన్ని మళ్ళి  మానవీకరణ చేయటం కష్టం . 

 

పేజీ నెంబర్ 99;

రాజకీయ చైతన్యం కలిగిన కార్మిక సంఘ్ నాయకుడంటే ,స్థానిక వివాదమే తనకు ,యాజమాన్యానికి మధ్య కీలకమైన ఘర్షణ కాదని గుర్తించగలిగిన వ్యక్తి .. 


పెట్టుబడి దారి దేశాలలో కార్మికులకు పోయేదేమీ లేదు . అన్నీ సాధించుకోవచ్చు .. వలస దేశాలలో మాత్రం కార్మిక వర్గం ప్రతిదానిని పోగొట్టుకోగలదు . 

పేజీ నెంబర్ 127;

కొన్ని రాయితీలు నిజానికి సంకెళ్లు అని తెలియచెప్పే చారిత్రిక సూత్రం గురుంచి ప్రజలు ,ప్రతి పొరాట  యోధుడు సచేతనంగా ఉండాలి . 

వలస ప్రజలు వలసాధికారుల నుంచి ఎక్కువలో ఎక్కువగా రాయితీలు అంగీకరించ వచ్చు  కానీ ,ఎప్పుడు రాజీకి మాత్రం అంగీకరించకూడదు .  

రైతాంగం విషయానికి వస్తే ,వాళ్ళు ఆచరణాత్మక అనుభవం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని ,ప్రజల పోరాటానికి నాయకత్వం వహించేందుకు సమర్ధులని నిరూపించుకుంటారు . 


పేజీ నెంబర్ 134;

తమకు ,దేశానికి ఎక్కువ లాభదాయకమైన ఫ్యాక్టరీస్ ను ఏర్పాటు చేయలేక ,ఈ పెట్టుబడిదారీవర్గం స్థానిక వృత్తులకు దేశభక్తి ముసుగు తొడుగుతుంది 

తన చారిత్రిక కర్తవ్యం ఒక మధ్యవర్తిగానే అని దేశీయ బూర్జువా వర్గం తెలుసుకుంటుంది . మనం గతం లోనే చూసినట్లు ,దాని పని దేశాన్ని మార్పు చేయటం కాదు నయావలస వాద ముసుగు వెనక తనను దాచిపెట్టుకోక తప్పని పరిస్థితి లో అది పెట్టుబడి దారి విధానానికి ఒక వాహక పట్టి (కన్వేయర్ బెల్ట్ ) గా మాత్రమే ఉపయోగ పడుతుంది . 

ఇప్పుడు మనం జాతీయవాదం నుండి ,జాతీయ ఉన్మాదానికి ,అంధ దేశ భక్తికి ,జాతి వివక్ష కి చేరుకున్నాం . 

పేజీ నెంబర్ 170 ;

యువత క్రీడా ప్రాంగణాలు వైపు కాక పొలాల వైపు ,పాఠశాలల వైపు చూడాలి . 

వృత్తి క్రీడాకారులను తయారు చేయడం పై కాక ఆటలు కూడా ఆడే చైతన్యమైన వ్యక్తులను తయారు చేయడం ముఖ్యం .. 

మన దేశం లో ఏమి జరుగుతుందో నని నిరంతరం అర్థం చేసుకోవడమే మన అతి పెద్ద కర్తవ్యం . 

రాజకీయ శిక్షణ అంటే మెదడుకు ద్వారాలు తెరవటం ,మెదడును జాగృతం చెయ్యడం ,దానిని ప్రపంచానికి పరిచయం చెయ్యడం .. సెజేయుర్ చెప్పినట్టు ;"మనుషుల అంతరాత్మలను కనుకొనటం .. 

ప్రజలను రాజకీయవంతం చేయటం అంటే దేశం మొత్తాన్ని పౌరులైన ప్రతి ఒక్కరికి చెందిన వాస్తవం గా మలచటమే .. దేశపు అనుభవాన్ని ప్రతి ఒక్కరి అనుభవంగా చేయటమే .. 

ఆలోచనా ప్రపంచం లో మనిషి .. ప్రపంచానికి మెదడు -సేకొటారి 

ఒక వంతెన కట్టడం లో కట్టేవారి చైతన్యం పెరగక పోతే అటువంటి వంతెన కట్టవద్దు . ప్రజలు నదిని ఈది దాటనివ్వండి లేదా పడవను ఉపయోగణించనివ్వండి . పెద్దపెద్ద యంత్రాలతో వంతెనను అక్కడ తెచ్చి పెట్టొద్దు వంతెన నిర్మాణం పౌరుల మెదడు లు ,కండరాలతో జరగాలి . 

పౌరుడు వంతెనను తప్పక తనదిగా చేసుకోవాలి అప్పుడే,అప్పుడు మాత్రమే ,అన్నిటిని సాధించగలం .. 

జాతీయవాదం ఒక రాజకీయ సిద్ధాంతమో ,ఒక కార్యక్రమమొ కాదు మనం మన దేశాన్ని నిజంగా తిరోగమనం ,నిష్క్రియా పరత్వాల నుండి లేదా కుప్పకూలిపోవడం నుండి కాపాడాలనుకుంటే వీలైనంత త్వరగా జాతీయ చైతన్యం నుండి సామాజిక రాజకీయ చైతన్యానికి  మరలాలి . 

పేజీ నెంబర్ .. 212; 

మానవాళి విముక్తి కోసం జరుగుతున్న నిజమైన పోరాటం పై ఈ రోజు సామ్రాజ్య వాదం యుద్ధం చేస్తోంది . అది అక్కడక్కడా వినాశనబీజాలు నాటుతుంది . వాటిని మన నేల నుండి ,మన మనుసుల నుండి నిర్దాక్షిణ్యంగా పీకి పారేయాలి . 

ప్రతి కూలమైన ,పాలించ వీలు కాని  .మౌలికంగా తిరగబడే "ప్రకృతి " వలస దేశాల్లోని అడవి ,దోమలు ,స్థానికులు ,రోగాలకు పర్యాయ పదమే . మచ్చిక కాని  ఈ ప్రకృతిని ఒక్క సారి నియంత్రణ లోకి తీసుకు రాగలిగితే  వలసవాదం విజయవంతం అయినట్టే ,, అడవుల గుండా రోడ్లు వేయటం ,మడ భూముల నుండి నీళ్లు తోడేయటం ,స్థానిక ప్రజల ఆర్ధిక ,రాజకీయ అస్థిత్వాన్ని గుర్తించ నిరాకరించటం - ఇవన్నీ ఒకటే . 


#############












 మందమర్రి - కళ్యాణిఖని 

ఒక ఊరు రెండు పేర్లు 


పారిశ్రామిక ప్రాంతాలలో ,అభివృద్ధి ప్రాజెక్టులలో ఊర్లు ,ప్రజలు విస్థాపితులు కావటం మామూలే .. 


 నన్ను వెంటాడిన హీరో .. మునీర్ 


ఒక మిత్రుడి నాన్న గారి జీవితకథ పుస్తకం పూర్తయ్యేసరికి నాలో నన్ను చూసుకొనే నా ఊరు మందమర్రి,నేను ఎరిగిన మనిషి మునీర్ గురుంచి కూడా రాయగలననే నమ్మకం కుదురుకుంది . అప్పుడే మనుసులో బుక్ పేరు కూడా పెట్టేసు కున్నాను . ఆ తర్వాత అతడికి ఆ విషయం కూడా చెప్పేసేనను దాచుకునే ఓపిక లేక .. అతను నవ్వేసి ఊరుకున్నాడు . 

"మనదమర్రి ముఖ చిత్రం -మునీర్ "పుస్తకం పేరు . మిత్రుడు రామ్మూర్తి ఎప్పటిలాగే ముందు పడ్డాడు . అది ఒక ముందడుగు . అంతకు ముందు చాలా వెనకడుగులు పడ్డాయి . అందుకే దీన్ని ప్రస్తావించడం .. 

ఇక మునీర్ విషయం లోకి వద్దాం . 

ఇంతకీ నువ్వెవరి వయ్య ఇంత లావు మాట్లాడుతున్నావు ?

నా పేరు వెంకట్రావు . మా నాన్న పేరు సాహెబ్ .. మాది మందమర్రే . నేను ఇక్కడే చదువు కున్నాను. ప్రస్తుతం ఉద్యోగం హైదరాబాద్ లోనే . ఇక మిగిలిన విషయాలు మాటల మధ్యలో చెప్పుకొందాము . 

మునీర్ .. నన్నెప్పుడు అబ్బురపరుస్తూనే ఉండే వాడు . నేను అతన్ని ప్రైమరీ స్కూల్(కార్మెల్ స్కూల్) నుంచి ఎరుగుదును . నేను అతనికి తెలియదు . నాకు మూడు ఏండ్లు సీనియర్ . మునీర్ తమ్ముడు మొయినుద్దీన్ నా క్లాస్ మెట్ . 

మందమర్రి కాలరీస్ ప్రాంతం లో అప్పటికి రెండే పెద్ద స్కూల్స్ . ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ .. దీన్నీ ఒర్రెగడ్డ బడి అనేవారు . ఒర్రె అంటే చిన్న కాలువ .. దాన్ని దాటి వెళ్ళాలి బడికి . వర్షాకాలం వరదొస్తే బడికి సెలవే . 

ఊరిచివర దొరగారి  శ్రీకృష్ణ టాకీస్ .. 

ఇంకోటి .. కార్మెల్ స్కూల్ .. క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళది . కేరళ సిస్టర్స్ (Nuns ),లోకల్ టీచర్స్ కలిసి చదువు చెప్పేవారు . 7 వ తరగతి వరకే ఉండేది . 

సింగరేణి కంపెనీ వారిస్థలంలోనే ఉండేది ఈ స్కూల్ . వెనకే అరకి లో మీటర్ దూరంలో బొగ్గుగని ఉండేది . కల్యాణి ఖని 5 అని పిలిచేవారు .,బొగ్గురవాణాకి రైల్వే లైన్ కూడా ఉండేది . బొగ్గు కుప్పలా మధ్య ఈ స్కూల్ ఉండేది . స్కూల్ ముందు బొగ్గు లారీలు వెళ్లేందుకు తారు రోడ్డు ఉండేది 

మునీర్ ఏడవ  తరగతి లో ఉన్నప్పుడే అనుకుంట .. స్కూల్ ముందు ఉండే  ఆ తార్రో డ్డు మీద ఎవరితోనో గొడవ పడ్డాడు . కంపాస్ బాక్స్ లో ఉండే స్టీల్ డివైడర్ తో పొడుచుకున్నారు . అది నాకు మునీర్ తొలి జ్యాపకం . 

మనిషి బలిష్టంగా ఉండేవాడు .. మరీ అంత పొడుగు గాక పోయినా పొట్టి కూడా కాదు . ఆ గొడవల్లో రక్తాలు కారాయి .. కల బడ్డారు. గాయపడ్డారు . అలా గొడవల ద్వారా గుర్తుండిపోయిన మనిషి జీవితమంతా ఆయన మీద దాడులు , ఆయనకి దగ్గరగా తెలిసిన కార్మికనాయకుల హత్యలు ,చివరకు ఆయనే మందమర్రి భూస్వామి హత్యా కేసు లో ఇరుక్కొని జైలు జీవితం .. ఇలా ఒక ఆంగ్రీ హీరో సినిమా కథ లాంటి మలుపులు .. 

ఇంత జరిగాక ఎవరైనా సరే శేష జీవితం ప్రశాంతంగా గడిపేస్తారని అనుకుంటుంటారు .కానీ అలా ఏమి జరగక పోగా కంపెనీలో తన ఉద్యోగం చేసుకుంటూనే ,జర్నలిస్ట్ గా కొనసాగాడు .. ఆ తర్వాత తెలాంగాణ ఉదయమం లోను పెద్ద పాత్రే నిర్వహించాడు . 

తనను తాను ఎప్పుడు ఎదిగించుకుంటూ , సమకాలీన విషయాల పట్ల క్కూడా తెలివిడిగా ఉంటూ జీవితం లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్లే మునీర్ మన తరానికి, ముందుతరాలకు కూడా   ఒక రోల్ మోడల్ అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు..  



29, అక్టోబర్ 2022, శనివారం

 

నగరం మనసు పడిన  వేళ .. 



ఏ తీర్పు   మనసుని  కలిచి వేసిందో 

ఈ రాత్రి కప్పుకున్న దుప్పటే 

గుండెల మీద మండుతున్న కుంపటి  అయింది 

ఎంతసేపని మోస్తాం  దహించే నిప్పుని ?


విసిరిపడేసి .. చీకటి వాకిట్లోకి వచ్చి పడ్డాను 

ఎదురుగ్గా  నిద్ర సుఖం ఎరగని  నగరం 

తన్ను  తాను మరిచిపోయినా నన్ను   వెంటనే గుర్తు పట్టేస్తుంది 

తనని నిద్రబోనివ్వని "ఆలోచించే మెదడు" నేనే     కదా !

ఆ మాత్రం గౌరవానికి అర్హుడే మరి ..  అర్బన్ నక్సల్ .. 


ఇంకేంటి  మూర్తి .. తెచ్చుకో ఓ పెన్ను ,పేపరు 

నిదుర బోని నేను ,నిదుర  రాని  నువ్వు 

ఏముంటాయి లే   మనకి   మాటలు.. 

అన్నీ ఆశు కవిత్వాలేగా .. 

ఇక చంపు .. 

అయితే ముందు దోమల్ని .. 

నన్ను నిదురబోనివ్వని నీలాంటి నేస్తాల్ని .. 


నువ్వు ఏమి రాసినా ,ఎంత రాసినా 

నింద  మాత్రం నా మీద  మోపకు 

నిదురబోనివ్వని నగరమని టైటిల్ పెట్టకు 

జస్ట్ కిడ్డింగ్ .. ఎదో సరదాకి అన్నాను 


ఇప్పుడు జీవితం లోతుల్లోకి వెళదాం 

ఒక్కసారి మనం   తవ్వుకున్న గోతుల్లోకి వెళ్లి చూద్దాం 


ఈ రాత్రి నువ్వు రేపటి కలల్లో కి  కదా వెళ్ళాలి 

జవాబు దొరకని నిన్నటి ప్రశ్నలు కొన్ని 

ఇంకా నీ మెదడుని పీక్కు తింటూనే వున్నాయి

  


కాలం దగ్గర చాలా వాటికి చక్కటి మందు వుంది.. 

అయితే  దాన్నెలా తీసుకోవాలో  తెలిసిన 

కాల జ్ఞానివి  కావాలి  నువ్వు  .. 






 సలికాలం .. 


లే లేత ఆకు పచ్చ అందాల్ని 

అరచేతుల్లో మోసుకు వస్తున్నట్టు 

ఎండ .. ఎంత అద్భుతం గా వుందో !

ఇన్నాళ్లు ఇంత అందాన్ని 

ఎక్కడ దాచావే .. అని ముద్దుగా 

ఎండ చెవి మెలిపెడదామంటే 

అప్పటికే  ఎండ చురుక్కుమంటుంది 

 పోనీ .. నీడలో సేద తీరుదామంటే 

చల్లగాలి  అణుకువగా  ఎండ లోకి తోస్తుంది 

చలికాలం మొదట్లో ఇంతేనట  .. 




28, అక్టోబర్ 2022, శుక్రవారం

 నల్ల నేల మనిషి ..మునీర్ 


... 

నువ్వు పట్టుకున్న పుస్తకం పేజీలు మడతలు పడి నలిగిపోతే వెంటనే సరిచేస్తావు . చేతులు కాస్త ముఱికి  అయితే శుభ్రం చేసుకునేంతవరకు కాలు నిలువదు . 

అలాంటింది మొత్తంగా  శరీరమే మసితో నిండిపోయి ,చెమట ,నల్లని నీళ్లు కలిసిపోయి ధారలు  ధారలుగా ,తల నుండి పాదాల వరకు అట్టలు  కట్టినట్టు వుండే మనిషినెక్కడైనా చూసారా?

నానా దేశాల విభిన్నమైన మనుషులని చూపించే నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ కూడా ఇలాంటి కష్ట జీవుల గురుంచి ఎక్కువగా పట్టించుకోదు .

ఈ మనిషి శ్రమకు సంబంధించిన వాడు . నల్ల బంగారాన్ని వెలికి తీసే బొగ్గు గని కార్మికుడు . ఇప్పటికి స్త్రీకి బొగ్గు  గని లోకి   ప్రవేశము లేదు . 

ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసులు ఉన్నట్లే సింగరేణి బొగ్గు గనుల్లో ఈ నల్ల మనుషులు ఉంటారు . 

తల నిండా ,నోటి నిండా ,కళ్ళ చుట్టూ మసి పేరుకుపోయిన  శ్రమ జీవులు . అదొక శ్రమ సౌందర్యం . 

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు .. అని  కదా  మహాకవి శ్రీశ్రీ అన్నది . 

ఆ సౌందర్య పిపాసి ఇక్కడి బొగ్గుమనుషుల్ని కలిసాడు . మందమర్రి ,బెల్లం పల్లి  బొగ్గు గని ప్రాంతాలకు 1970 దశకం లో వచ్చాడు . అప్పటికే శ్రీశ్రీ ని అందిపుచ్చుకున్న నవతరం ఇక్కడ 

విప్లవ జ్వాలల భుగ భుగల్ని పుట్టిస్తుంది .. అక్కడ ..  ఆ వెలుగుల్లో మనకు ఈ  నల్ల నే ల మనిషి ..

 మునీరు కనిపిస్తాడు. 


ఏమిటి మరి ఈ బొగ్గు గొప్పతనం ?

తెల్లదొరలకు ,బాయిదొరలకు అది నల్లబంగారం . యంత్రాలను నడిపించగలిగే ఆధునిక

 ఇంధనం . 

దట్టమైన అడవిని నరికి ,కొన్ని వందల మీటర్ల లోతులో భూమిని తొలుచుకుంటూ సొరంగాలు తవ్వి ఈ బొగ్గును చేరుకున్నారు . 

ఈ బొగ్గు కథా కమామిషు అంతా మొదట ఆ తెల్లదొరలకే తెలుసు ..  

మన దేశ ఆదివాసీలు ,నిరుపేద రైతాంగం గనుల్లో  బానిసల్లా పనిచేశారు . 

ఇప్పటి నల్లదొరల రాజ్యం లోనూ శ్రమ దోపిడీ తగ్గలేదు . 

కార్మికులకు కష్టపడటం ఒక్కటే తెలుసు . 

తల్లి కడుపులోకి వెళ్లి నట్టు గని లోకి పోయి ,బొగ్గు పెళ్లలను పసిబిడ్డల్లా పైకి మోసుకొచ్చేవారు .   

  ఎందుకంటే అది .. తమ కష్టం .. తమ కన్నీళ్లు తుడిచి కడుపు నింపే పెద్దకొడుకు లాంటి బొగ్గు ..

ఈ బొగ్గే లేకపోతే .. అప్పుడు గ్రామాల్లో అల్లకల్లోలమైన జీవితాలు కళ్ళ ముందు  కదలాడేవి . భూస్వాముల అరాచకాలను తట్టుకోలేని  'శ్రామిక కులాలు' పొట్ట చేత పట్టుకొని " కాలేరు"(కాలరీస్ )బాట పట్టారు . 

బొగ్గు ది  బంగారం లాంటి మిల మిలా మెరిసే నలుపు రంగు .  బొగ్గు .. మంచి చమట వాసన వేస్తుంది . వందల వేల  ఏండ్లు భూమి లో మగ్గిపోయిన  అడవి  కదా బొగ్గు  అంటే  .. 

ఇక బొగ్గు రుచి గురుంచి ..   లాభాల రుచి మరిగిన   పెట్టుబడిదారుల  విస్తృతి లో దాన్ని మనం కనిపెట్టాలి  . 

బొగ్గు లానే భూమి లోతుల్లోంచి లభించే పెట్రోల్ వాసనకి మనలో కొందరం "అడిక్ట్" అయిపోతాం . 

బొగ్గు ఏమో ముతక  వాసన వేస్తుంది . . అంతే !

ఇంత దూరం లో వున్న మీకు ఆ విషయం తెలీదు .. అక్కడే వున్నవాళ్లకి పెద్దగా తేడా తెలియదు.  .. 

ఇది ఆదిలాబాద్ జిల్లా .. ఇప్పుడు మూడో నాలుగో ముక్కలుగా విడదీశారు .  అప్పట్లో ఇదే పెద్ద జిల్లా .. ఆదిలాబాద్ తలుపు ఒక వేపు మహారాష్ట్ర లోకి తెరుచుకుంటుంది . ఇంకో వేపు ఈ బొగ్గు గనులు ఉంటాయి . ఇప్పుడు ఈ ప్రాంతం మంచిర్యాల జిల్లా లోకి వస్తుంది . 

పాత ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఆదివాసీలదే .. గోండు దాదా కొమురం భీం వారసులదే .. 



26, అక్టోబర్ 2022, బుధవారం

 

Paradigms in the historical approach to labor studies on south Asia

 

 

Sabyasaachi bhattachaarya    

 

 

This presentation may be regarded as an attempt to bridge the gap between studies in the political economy of labor and the historically oriented studies of the past.

This discourse was first shaped in the early twentieth century in the hands of members of a very limited intelligentsia who assumed an adversarial role in relation to capital and colonial state power. Many of them happened to be activists and leaders in the organization and protest movements of the working classes.

In the colonial period was that capitalist relations were not sufficiently generalized.

In colonial south asia , right up to world world war II and perhaps even beyond that, pre capitalist and capitalist organization of economic life coexisted. The resultant stratification or class strcture is inchoate, in the process of being formed – and the working class constituted pre-eminently an example of this incomplete transition

This coexistence of different production regimes imparted a peculiar character to the class structure in colonial south Asia.

The intelligentsia i.e., the educated urban professionals, were surrogate leaders and spokesmen of the classes with a low degree of ‘class-ness’. The low investments in social overheads by the colonial state is well-known-and one of its consequences was a low level of literacy which blocked articulation of labor demands or rise of spokesperson from the rank of working classes.

Coolie: the story of labor and capital in india .. by Diwan chimanlal

The bias in this class of writing was contested by authors who spoke on behalf of the agencies of the state which were concerned with legislation and regulation vis-à-vis industry. In 1881 the first Indian factory act was passed (applicable to the few factories which existed in Bombay or Calcutta and limited to the objective of preventing employment of children below age 9.

The worldwide economic depression in the early half of the 1930 s catapulted studies in the condition and history of labour to public attention. the appointment of a royal commission on labor in India which published a multi – volume report in 1930-31.

The hegemony of European categories of thought often blocked the recognition of specificities of the south Asian economy and the persistence of pre- capitalist labor forms, especially in Marxist writings.

In the entire corpus pf writings on labor history the overwhelming emphasis has been on the industrial work force in the organized sector, excluding the vast greater numbers in the informal or unorganized sector.

The larger-than-life image of the industrial proletariat, as compared with rest of laboring poor, is due to an attribution of a "historical" role in a vision of things to come, an instrumentalist view of the vanguards effecting a social transformation through capture of state power, etc.

whether indeed the industrial worker had such a potential in underdeveloped colonial countries or whether, as Frantz Fanon believed, they were "in comparatively privileged position " compared to the rest of the laboring poor and the urban sub proletariat, is a relevant question in the light of historical experience.

sukomal sen providedaccounts of the growth of the trade union union movement,chronocles varying in historical depth `    1but uniformely limited to institutional history disarticulated from the deep structure of its socio economic context. Most of these tradeunion histories merited Hobsbawm'scritism of asimilar tradion in British labor historiography.It tended to identify class and movement,movement and organisation or leadership of organization,thus bypassing social realities.published about this time ,the only monograph of Cylonese labor history,Visakha KumariJayawardhane's  "The  Rise of the labour Movementin Cylon" constitutes an exception ;although the subject of study is mainly orrganized trade unionism,it is contexulaised in the social and economic trendsin sri lanka between 1880 and 1933 

1, సెప్టెంబర్ 2022, గురువారం

 global labour history .. state of the art. 

edited  by Jan Lucassen 

published  by peter  lang, oxford 



డిసెంబర్ 1996 ... న్యూ ఢిల్లీ లో భారత కార్మిక చరిత్ర కారుల  అసోసియేషన్ ఒకటి ఏర్పాటు ఐంది . అప్పటి నుండి 1998 ,2000,2002 లో మూడు సమావేశాలను నిర్వహించింది . 

ప్రపంచ కార్మికోద్యమ రచనలో రెండు ధోరణలు 

వేజ్ లేబర్  బలహీనంగా ఉన్న ఆఫ్రికా (సహారా దక్షిణ ప్రాంతం )లో  మరియు అరబిక్ దేశాలలో విస్తృత పరిశోధన జరగలేదు . ఇక్కడ చరిత్ర రచన సంక్షోభం లో ఉంది .. రాజకీయ నిర్బంధం ,ఇస్లామిక్ అన్వయింపు దీనికి కారణాలు . 

ఇక రెండోది .. సోషలిస్ట్ రాజ్యాలు .. మార్క్సిస్టు లెనినిస్ట్ దృక్పథం లోనే చరిత్ర రచన జరగాలి . 


Labour History served as a science of legitimation -Oskar Negt

Hungarian historian Emil Niederhauser has commented, "paradoxically only the movement was seen, and the economic and social conditions were ignored or treated only in outline . There was much heroic struggle and many victims, which were not in vain as they produced in the last resort the happy present.

With in this "real socialists " context different paths were possible .

a) the Polish -Hungarian variat ,in which important scintific innovation was permitted  before the communist collapse of 1989 -1990.

b)the russian approach ,with labour history enjoying an upsurge after 1956 which collapsed and was replaced by dogmatism within a decade 

c)the chinese road.. marked by a crisis inthe humanities and in the labour history ,caused by the transformation to capitalism "from above"


ఆకు పచ్చ అద్భుతం

 ఆకు పచ్చ అద్భుతం



అందం ..ఆకు  అయితే

అది ఖచ్చితంగా కొబ్బరి చెట్టే.. 


నాచుట్టూ ఆకు పచ్చని అందాలు

భక్తి పారవశ్యం తో

గుడి లాగా ముసురుకున్నాయి


ఆకాశానికి నాకు మధ్య

ఇక ఏమీ లేదు

దట్టమైన పచ్చని పొగమంచు


కొప్పున పూల దండ ముడిచినట్టు

చేతుల్లాంటి ఆకులు తొడుక్కుని

కంటి చూపు తో మాటలు కలిపే యాస



ఎవరైనా  సరే ..ఏదైనా సరే

ఆకాశాన్ని కమ్మేసే తన నీడ నుంచి

తప్పుకు పోవడం కష్టం 


చెట్లలో జిరాఫీ

కోనసీమ కొబ్బరి చెట్టు


ఒక్క గుత్తి  లోంచే  విచ్చుకునే

చిక్కనై విశాల ప్రపంచం


కొబ్బరి తోట వర్షం లో

 మనమంతా ఆకుపచ్చని గొడుగులం  


నిండైన వరద మట్టిలోంచి

తోడిపెట్టిన  తడియారని అందం


తనివితీరని గుండె తన్లాటకి

కోనసీమ కొబ్బరాకు చందనం

తెరిపి

  తెరిపి


ఇప్పుడిప్పుడే వాన ..'కొట్టి

వెళ్లినట్టుంది

అప్పుడప్పుడు నువ్వు మందలించినట్టు


గట్టిగాపక్షుల కోలాహలం

చిన్నపిల్లలు గుక్క పెట్టి ఏడ్చినట్టు..


దెబ్బకి ఆకాశం సర్దుకున్నట్టుంది

తెల్లగా పాలిపోయి వుంది


ఎవరో ఇంకా తడిసిన బట్టల్ని

ఆరబెట్టుకున్నట్టే వుంది తడి ఆరని గాలిలో..


బహుశా ఇది ముసురు లో 

తెరిపి కాబోలు

ఒకటొక్కటిగా మేఘాలు మళ్ళీ కూడుకొంటున్నాయి

[9:10 am, 30/08/2022] 

31, ఆగస్టు 2022, బుధవారం

జీవిత భయం

 

జీవిత భయం 


ని న్ను భయపెట్టగలిగేది ఏది నీ అన్వేషణలో .. 

శ్రీ శ్రీ అంటాడు .. బహుళ పంచమి జోత్స్నా  భయపెట్టు నన్ను ,,అని 

కానీ అంత కంటే మిన్నగా మనల్ని గందరగోళ పరిచేది  ఇంకేముంది అంటే .. 

అది మన వెంటే నడిచివచ్చిన మన జీవితమే .. 


ఉరకలు వేసిన ఉత్సాహం 

ఊరకే అలా కూలబడిపోయినప్పుడు 

వరదలా మనల్ని ముంచెత్తుతుంది 

ఉలిక్కిపడి  కళ్ళు కన్నీటి పర్యంతం అవు తాయి

 

ఒక్క ధైర్య వచనం కోసం దిక్కులు పిక్కటిల్లేలా 

అరిచి ఘీ పెడతాం 

మన నిస్సహాయతే నిసిగ్గుగా  ప్రతిధ్వనిస్తుంది 

గుండె  దిటవు నిచ్చే నిలువెత్తు కొండ సాయం  అది 

అయినా నాలాంటి  నీ  కోసం ఎదురు చూపే కడదాకా   .. 

26, జూన్ 2022, ఆదివారం

 ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టును CDRO తీవ్రంగా ఖండిస్తోంది



ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను ఒక తప్పుడు క్రిమినల్ కేసు పెట్టి  నిర్బంధించడాన్ని ప్రజాస్వామ్య హక్కుల సంస్థల సమన్వయం (CDRO) తీవ్రంగా ఖండిస్తోంది. ఆమెతో పాటు గుజరాత్ పోలీస్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్.బి.శ్రీకుమార్, ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మరో ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌లతో పాటు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.


తీస్తా సెతల్వాద్ మరియు ఆమె సంస్థ, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులతో న్యాయం, ఉపశమనం మరియు పునరావాసం అందించడంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తీస్తా సెతల్వాద్ న్యాయ పోరాటంలో ముందంజలో ఉన్నారు మరియు గోద్రా సంఘటన తర్వాత గుజరాత్‌లో ముస్లింల మానవ హననం  వెనుక ఉన్న రాజకీయ శక్తులను బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా ఆమె అలుపెరగని ప్రయత్నాల వల్ల అల్లర్ల సూత్రధారులైన మాయా కొద్నానీ, బాబు బజరంగీ మొదలైన వారు బయటపడ్డారు.


సిట్ అంచనా మరియు దాని ఆధారంగా కోర్టు తీర్పు ఉన్నప్పటికీ, గోద్రా ఘటనపై ఇంత పెద్ద ఎత్తున మానవ హననం  జరగడం ఆకస్మిక ప్రతిచర్య కాదనేది సాధారణ అభిప్రాయం మరియు అనుభవం మరియు ఇది మతతత్వ అంశాలతో జతకట్టిన  సంఘ్ పరివార్  ప్రణాళిక .


గుజరాత్ మానవహననం  బాధితులకు న్యాయం జరగకుండా ఆమెను నిరోధించే ఉద్దేశ్యంతో, గుజరాత్ పోలీసులు మరియు ఇతరులు ఆమెపై గతంలో తీసుకున్న శిక్షా చర్యలకు కొనసాగింపుగా తీస్తా సెతల్వాద్‌పై ప్రస్తుత కేసు కొనసాగుతుందని CDRO దృఢంగా అభిప్రాయపడుతుంది .

 గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆమెను అరెస్ట్ చేసిన అత్యు త్సాహంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ATS ఎందుకు పంపబడింది మరియు వారు ముంబైలోని  సెతల్వాద్ ఇంటిలోకి ఎందుకు మరియు  ఎలా  ప్రవేశించారు?   ఆమెను  తన లాయర్‌తో మాట్లాడనివ్వడానికి మొదట ఎందుకు నిరాకరించారు?  సెతల్వాద్‌ను తీవ్రంగా గాయపరిచే విధంగా ఎందుకు ప్రవర్తించారు? 

బాధితుల హక్కులను పరిరక్షించడం నేరంగా పరిగణించబడదని మరియు ఏ కల్పనతోనూ, ప్రకృతిలో కుట్రపూరితంగా లేదా ఉగ్రవాదంగా పేర్కొనబడదని CDRO గట్టిగా విశ్వసిస్తుంది.

13, ఏప్రిల్ 2022, బుధవారం

అర్బన్ నక్సల్

 అర్బన్ నక్సల్


1

వడివడిగా అంగలే వేసానో

ఒక వేడి సెగ లో  దూరం ఎగిరిపడ్డానో

చాలా ముందుకే వెళ్ళిపోయాను

ఇప్పుడు నీకోసమే వెనక్కి రాలేను



నా వెనక వెనకే అయినా నువ్వే

కదిలి రావాలి కాని..

నీ చెయ్యు పట్టి  నేను నడవలేను

వెలుగు వెంట సాగే నా నీడ దారినైనా

నువ్వే నడిచి రావాలి కాని..


ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్ప

నీ కళాత్మక లోకం కానరాదు నాకు

అవును..

నా దృష్టిలో స్పష్టమైన తేడా

కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది


దప్పిక ఎరగని ఒంటెద్దు  పోకడ 

ఏకాకి ఎడారి ఓడ ప్రయాణం


ఇప్పుడు నీతో సమానంగా నేను నడవలేను


2


నా కలల ప్రపంచం మీదికి రాయి వేయకుండా

వాడికి .. అవును ..వాడికే ..రోజు గడవదు

వసంతాన్ని వాగ్దానం చేసిన ప్రతి పువ్వును

తెంపకుంటే వాడికి  అస్సలు నిద్ర పట్టదు 


తెగిపడ్డ పువ్వుల రక్తం  అత్తరు 

వాడికి .. వాడి  పాడుబడ్డ లోకానికి...


కుళ్ళి కంపుకొట్టే ఈ  వాసన 

అలవాటు లేక నాలాగే 

నువ్వూ ముక్కు మూసుకుంటావ్

అప్పుడే  దొరికిపోతావ్ నువ్వు..

అర్బన్ నక్సల్ .. 





7, ఏప్రిల్ 2022, గురువారం

కవి బాధ


కవి బాధ 


 ఒక బాధ లో నుంచి 

 కాలు కదప లేని  మరో   బరువు లోకి 

కూరుకు పోతాను నిరంతరాయంగా 


పాపం  బరువు ! సిగ్గు విడిచి 

సాయం కోసం దిక్కులు చూస్తుంది 

అయితే దిక్కుమాలిన  ఆ దిక్కుల 

చూపుల్ని భరించడం కష్టమై పోతుంది 


ఎప్పటిలాగే కాలం .. గట్టు మీద కూర్చుండి తమాషా చూస్తుంది 


 గట్టిగా కళ్ళు మూసుకొని బాధ 

 అంతటి  బరువు తోనే  కవిత్వం లోకి దూకేస్తోంది

కవిత్వం ఒక సముద్రం 

అది మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది  

అందుకే ఇప్పటికీ ఏ  కవి బాధా  తీరినట్టు  దాఖలా లేదు  




వాన విల్లు

వాన విల్లు 


అంతా కన్నీటి పర్యంతమే .. 

అయినప్పటికీ 

గాలిలో ఒక్క  నీటి బిందువై 

నేను ఒక్కడినే వేలాడుతుంటాను 

నువ్వేగా ఒక వెలుగు రేఖ లా వచ్చి 

నన్ను రంగు  రంగుల ఆకాశం చేస్తావు 


రాజా రాణి

 రాజా రాణి 


కాలు మీద కాలు వేసుకొని 

నేను రాజా లా కూలబడిపోతాను 

కాలుగాలిన పిల్లిలా తిరిగే కాలం 

నన్ను చూసి కుళ్ళుకుంటుంది 


గట్టిగా కళ్ళు మూసుకొని కాలం 

గమ్మున వచ్చి నా ఎద  మీద  వాలిపోతుంది 

రాణిలా .. 

నిద్రానిద్రల మధ్య


నిద్రానిద్రల మధ్య 

1

 అప్పటి దాకా నిద్ర పట్టకే 

కవిత్వాన్ని పక్కలో వేసుకుంటాను 


కొంచెం సేపు విరామం .. అని 

కాలం చెవిలో చెప్తాను 

కాలం తల ఆడిస్తుంది 

హమ్మయ్య .. అని కళ్ళు మూసుకుంటాను 

అప్పుడే  కుట్ర జరిగిపోతుంది 


నేను నిద్రలోకి జారిపోకుండా .. 

మొదట  కొన్ని బుజ్జగింపులు 

మెల్ల మెల్లగా చీవాట్లు లోకి 

దిగుతుంది వ్యవహారం

అప్పటికే ..  

నా చేతి వేళ్ళు అప్రయత్నంగా 

చేయు తిరిగిన కవిలా మారిపోతాయి 


2

నిద్రకి కవిత్వానికి పోటీయేమో ! 

కనురెప్పలు మూతపడుతున్నప్పుడల్లా 

కాలు అడ్డం పెట్టి 

కవితా పాదాలు ముందుకు  తోసుకు వస్తాయి 


బ్రెయిలీ లిపిలా చేతి చివర్లతోనే  

భావ చిత్రాలు  రూపు  దిద్దుకుంటాయి 

మధ్యమధ్యలో నా మనసింకా 

జోగుతూ కునికిపాట్ల తో  కుస్తీ  పడ్తూనే ఉంటుంది 


4, ఏప్రిల్ 2022, సోమవారం

ఆశయమే దారి

  ఆశయమే దారి 


1


మనిషి రోడ్డున పడ్డాడు..

 తన కాళ్ళ మధ్య  మనిషిని కోడిపిల్లలా ఇరికించుకుని

 గద్దలా  రోడ్డు ఎగిరిపోతుంది

కసుక్కున దిగిపోయే

 కాలి గోర్ల మధ్య ప్రయాణం

బలి పశువు అలంకారం


2


ఏ దారి  ఎక్కడ ముగిసి పోతుందో

ఎప్పటికి తెలిసే అవకాశం లేదు

వలయాలు వలయాలుగా

విస్తరించే మార్గాలు

ఎక్కడా కలిసిపోవు

ఎన్నడూ ఆగిపోవు

జీవితమొక ప్రయాణము.. అంతే!


3


అయినా  ఈ రోడ్డు కెంత భయమో!

దారి పొడుగునా నన్ను

వెంటాడుతూనే ఉంటుంది

నా ముందు వెనకా ఎక్కడా తరగని

అనంతమైన రహదారి

మనిషి ప్రయాణం ఒక దారి

కానీ,

జీవితమే రోడ్డు కావడం విషాదం


4


ఎప్పటికప్పుడు 

అల్లంత దూరాన ఆకాశం లో కి

ఎగబాకే  కలల దారి కొసని

ఎవరు కనిపెట్టారు చెప్పు?


5


తిరగలిలా మన జీవితం

బండ బారక పోతే చాలు..

కొండంత ఆశయం ఎప్పుడూ

దారి చూపుతూనే ఉంటుంది


6


జీవిత చక్రం లో పడి కొట్టుకుపోయే

ప్రతి మనిషి  ఏదో విధంగా

రోడ్డున పడిపోతాడు

జీవన గమ్యాన్ని  గుర్తెరిగిన మానవుడే

తన మార్గాన్ని సుగమమం చేసుకుంటాడు.

[6:40 pm, 04/04/2022] Venkatrao Nakka: నల్లముఖం నగరానిది..

1

నగరం మీద ప్రేమగీతం

అది నవయవ్వన మోహం


నగరం మీద గరంగరం

"నీ రోడ్ల మీద మన్ను బొయ్య

బతుకు తెరువు  తెర్లాయే


2

కాంక్రీట్ జంగల్ లో

 కాసే ఎండల్ని మోసుకుంటూ

వాలే నీడల్ని వెతుక్కుంటూ

గుక్కెడు మంచి నీళ్ళనూ  కొనుక్కుంటూ

 నగరారణ్యం నేడు

దప్పిక దారుల కూడలి


3

పొట్ట చేత పట్టుకొని

పల్లె వలస నగరానికి  

ఆకలి తీరని కడుపు చించుకొని

పేగులు మెడలో వేసుకున్నట్టు

విశాలమైన రింగు రోడ్లకు వేలాడుతూ

 ఇసుక వేస్తే రాలని ఇరుకు  గల్లీ బతుకులు


4

నగరం ఒక తెల్ల ఏనుగు

 ఖర్చులు  మరి తడిసి మోపెడు

అంతా తల్ల కిందులు వ్యవహారం

వెల్లకిల్లా పడ్డ కాళ్ళు చేతుల్లా 

గాలిలో ఎగిరే రోడ్లు ..ఫ్లయ్ ఓవర్లు


5


బాటసారి కి

నీడ నిచ్చే వట వృక్షాలు పెరికి

కుండీల్లో నిలబెట్టబడ్డ  హైబ్రిడ్ మొక్కలు

నీరెండకే  సొమ్మసిల్లిపోతాయి


కాలుష్యాలను దగ్గుకుంటూ

వెళ్లే వాహనాల ధాటికి

చచ్చిన పాములా 

రోడ్డు పారి పోతుంది


7


నల్ల ముఖం నగరానిది

వేసిన రోడ్డు మీదే రోడ్డు

ఆ చీకటి నీడల్లో

తెల్లవారే యవ్వనాలు

మోడుబారే బాల్యాలు


అబద్దాలను మోసుకుంటూ

గాలిలో మేడలు కట్టే

 హొయలు పోయే హోర్డింగులు


అన్నిటిని

అడ్డంగా నరుక్కుంటూ పోతే 

నగరం కడుపు నిండా 

 అన్నీ   అరిగిపోయిన

బక్క పలుచని పల్లె బొక్కలే!

 బాల్యమే నేను .. 

నాకు నేనుగా ఉన్నానంటే అది ఆ వయసులోనే .. శ్రీ శ్రీ అన్నట్టు ఏదైనా నాకోసమే అనుకొనే ఆనంద అమాయకత్వం .. 

సాయం కాలం వేళ  నాన్న సైకిల్ మీద ఊరి అవతల కాలి బాటల మీద కొండల చాటుకు వెళ్లే సూరీడ్ని చూస్తూ ,  చీకటి  పడే వరకు వెళ్లి ,ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడిని . 

వాటి అన్నిటిని ఎలా వివరించి చెప్పాలో ఇంకా నేర్వని రోజులు  అవి. . ఇప్పుడైనా వాటికి కొత్త అర్థాలు ఎం చెపుతాం కానీ అన్వేషణ  తాలూకు బుడి బుడి అడుగులు గుర్తుకొస్తే అదో  ఆనందం . మీ అందరితో పంచుకోగలగడం దానికి పరాకాష్ట . 

ఇలా చెప్పుకుంటూ పోతే అసలు విషయం   కంటే ఈ కొసరు కబుర్లే ఎక్కువవుతాయి . 

అందుకే కథ లోకి వెళ్లిపోదాము 



దయ్యం సాయం 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


అప్పటికింకా నిక్కర్లలోనే తిరుగుతున్నం .. అంటే అయిదో  ,ఆరో క్లాస్ అనుకుంటా నేను మేము ముగ్గురం  మొగ పోరగాళ్ళమే . నేనే పెద్ద . 

మా నాన్నది సింగరేణి బాయ్  పని . మా అమ్మకి ఇంట్ల పనితోనే సరిపోయేది . టీవీలు ఇంకా రానికాలం . రేడియో మాత్రమే  ఉండేది . కరెంటు స్తంభాలు ఇంకా  కార్మిక వాడల్లోకి రాలేదు . 

రైతాంగం నుండి వచ్చిన కార్మికులు నిత్యం పనిలో వున్నట్టే ఉండేవారు. ఆడవాళ్ళకు మగోళ్ల సేవలు,పిల్లల పెంపకం తోనే సరిపోయేది . ఇక చిన్నపిల్లలం .. మాకేం పని ఉంటుంది ?బడికి పోవాలే .. బడి నుంచి రాగానే ఆటకు ఉరుకాలే .. 











16, మార్చి 2022, బుధవారం

గుడ్ నైట్

 

గుడ్ నైట్ 


కళ్లు మూతలు పడుతుంటాయి

నేను చివరి అక్షరానికి 

వీడ్కోలు ముద్దులు పెడుతుంటాను

బహుషా.. నువ్వుంటే  నాపక్కన

అంతే ఒక మాట..

ఒక మాట లాంటి ముద్దు..

అన్నీ మర్చిపోయి

నిద్రలోకి జారిపోతాను

కాదు..

నీతో మళ్ళీ ఉదయమై వస్తాను

15, మార్చి 2022, మంగళవారం

ఈ రోజు (15 థ్ మార్చ్ ,2022) ముచ్చట్లు ..

 ఈ రోజు (15 థ్ మార్చ్ ,2022)    ముచ్చట్లు .. 


ప్రతి రోజు నాలోకి ఎన్నెన్ని భావాలో ,భావనలో .. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాను .. ఇంకా నాలో వెతుకులాట వెనకడుగు వెయ్యలేదు .. అయితే కొత్తగా దేని గురుంచి అంత ఇదిగా ప్రయ్నతించను . ఎందుకంటే ముందు తెలిసినదాన్ని మరింతగా సాన పెట్టుకోవాలి .. అది గెలుస్తుంటే చూట్టం లో అదో తృప్తి .. అయితే ఈ ప్రయత్నాలలో ఎంత ఉత్సాహం ఉరకలు వేసినా ,అదే పనిగా తీరం మీదికి దాడికి వచ్చే సముద్రం అలకు మల్లె అప్పుడప్పుడు నిరాశా నిస్పృహలు 

కమ్ముకుంటాయి . దాంట్లోంచి బయట పడేసరికి ఒక రోజు మారిపోతుంది . 

ఎందుకో మరి ఇవ్వాళ ఎక్కడలేని ఓపిక వచ్చింది . పొద్దున్నే కొత్త వంట మనిషి పనిలో చేరింది . రాగి జావ చేసింది . చాలా రోజుల తర్వాత నోటికి కాస్త రుచి తగిలినట్టయింది . దాని ఫలితమేమో .. యమా ఉషారు వచ్చింది . ఇంకేముంది .. ఇల్లంతా కడిగి ,ముగ్గు వేసినంత పని చేసాను . కిచెన్ సామాను అంతా ఎక్కడికక్కడ శుభ్రంగా సర్దేశాను . 

నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టి చావలేదు దోమల బాధ తో . అయినా మధ్యాహ్నం కాసేపు పడక వేయాలన్న అలసటే  రాలేదు . స్వచ్ఛ భారత్ లో పూర్తిగా మునిగి పోయాను . 

పరిసరాల్లో వచ్చే మార్పులు నాలోనూ కొత్త శక్తి ని నింపుతాయి .. అదే..  ఈ రోజు ఈ ముచ్చట్లకి ప్రేరణ ఇచ్చింది . 

14, మార్చి 2022, సోమవారం

నువ్వే

 నువ్వే


ఈ కంటి చూపు ను మింగేస్తూ 

ఎన్ని చిత్ర విచిత్ర చిత్రాలో కళ్లెదుటే 

నిన్ను కన్నుల నిండుగా చూడనీయకుండా


చివరికి -

నీ జాడ కోసం చీకటిని

వేడుకొంటాను

దాని కరుణా కటాక్ష మెమో

అప్పుడప్పుడు వెన్నెలవై

వస్తుంటావ్ నీవే..


ఇన్ని అఖండ భావనలు

నిన్ను పోల్చుకోలేనప్పుడు

నువ్వు ఇక్కడే ఎక్కడో

ఉన్నావనుకోవడం ఒక భ్రమ

ఎక్కడా ఉండే అవకాశమే లేదనుకోవడం

నువ్వు నేర్పని నిరాసక్తత 


నిన్నలా ఆకాశం వెంబడి

చుక్కల దారిలో 

వెతుక్కుంటూ వెళ్లడమే

నువ్వు నేర్పిన ఆట


అడవి సిగలో వెన్నెల పువ్వులా

నీ నవ్వేదో నన్ను

దాటి వెళ్లదు గా ..

12, మార్చి 2022, శనివారం

sccl

 

The Singareni management should be held responsible for the death of a VTC trainee and two officers in the accident where the coal slide and roof collapse of the Singareni Adria Long Wall project ...

 Civil liberties committee, Telangana ......


Civil liberties committee, Telangana, on  11th  March 2022 visited the area and conducted a fact-finding regarding the death of the coal miners of the Singareni Adria Long Wall Project...

#############################

Seven workers of the Singareni Colleries Company Limited (Public Sector Undertaking), Peddapelli District Rama Giri Zone, Ramagundam Division 3, under Adriyala Long Wall Project were trapped in the accident on  March 7, 2022, at 1:30 pm due to coal sliding and roof collapse. Singareni Rescue Team saved only four officers. A VTC trainee and two officers were lost their lives. 

Details were gathered by the Civil liberties committee, Telangana jointly with the Civil liberties committees of  Karimnagar and Adilabad Districts on  11 March 2022  after meeting with ALP Collieries  Manager, Brahmaji & Adria Project Area, SO to GM Medical, ALP Workers and leaders of the worker's unions.

 Adriyala Long Wall Project Mine Workers got down to perform their duties in the first shift on March 7, 2022, 1st Seam, 86 Level RA 3 and  Badili  Worker Ravinder, FBL (Front Bucket Loader) Operator Venkateshwarlu, Over man Naveen, Support men Virayya, VTC Trainee Tota Srikanth  also went there under the supervision of Area Safety  Officer Jayaraj, Assistant Manager Chaitanya Teja. At about 1:30 pm, the colliries manager noticed an unexpected noise coming from the work area and alerted the workers. In the blink of an eye he  also ran  as the coal side wall of 30mts length,3mts height and 5mts breadth collapsed with a loud noise. Virayya, Madhu, Shashi (Badili workers)who are  act as support men  escaped with minor injuries as following  of manager warnings. 

Support men Ravinder, area safety    Officer Jayarj, Assistant Manager Chaitanya Teja, FBL (Front Bucket Loader) Operator Venkateshwarlu, Over man Naveen, VTC Trainee Tota Srikanth were trapped in the collapsed coal.   Rescue team reached  the scene  at around 6 pm that evening. Operator Jadi Venkatesh  who was trapped in the FBL cabin was spotted when he horn .Overman Naveen who was trapped near FBL was brought out the same night at about twelve o'clock. Ravinder, who had been screaming on Tuesday morning while the rest were being retrieved, was taken out at around 3.30pm. 

 Rescue teams recovered the dead  bodies of Chaitanya Teja, Jayaraj and VTC trainee Srikanth on Wednesday morning, March 9, 2022.

The state of-the-art ALP mine in Asia was opened in 2008. This is the first time since then that such a big accident has happened.

The ALP mine currently employs 1400 permanent and 600 contract workers. According to the Mining Act  the management should not take  work  from  VTC trainees . In contrast,   Thota Srikanth   who was engaged as a fitter helper in the mine  on the last day of  his VTC training. Officers Jayaraj and Teja and Thota Srikanth were killed when the sidewall collapsed due to nausea and lack of protection by the private company GMMCO. Singareni company workers are engaged in work considering their safety. The incident took place as the private company in ALP neglected to prioritize the lives of the people and went on a profit hunt without proper protection. Singareni Public Sector  Ownership provides the required support for private company profits. If privatization increases, it will become a habit to devalue the lives of workers ...


The upper part of the junction collapsed 15 days before the sidewall collapse. This is a sign of great danger. Management has neglected to maintain and correct it in a scientific manner. Management failed because the defence mechanism did not detect a sidewall collapse near it. These events were due to a change in management perspective as the privatization outsourcing of Singareni coal mines accelerated. 

 Political interference has been increased in Singareni after KCR  came into power  in 2014.  CMD Sridhar has been instructing directors and area general managers with daily production targets.

 Singareni workers officials are working with serious psychological concerns increasing the workload on supervisors and workers from top management through mine management. In addition to this, the Telangana Coal Workers' Union, which is affiliated to the TRS party as a recognized union, neglected the welfare of the workers. Singareni is donating thousands of crores of Singareni workers' money to the Telangana state government for the purchase of CCTV cameras in the name of a development fund and CSR fund for Telangana MLAs and MPs. Singareni workers are working like soldiers on the border at the border. In this horrible environment like this unannounced curfew, the workers are working for coal production. Mere protection is limited to paper. This ALP sidewall accident comes against the backdrop of CMD Sridhar's attitude of increasing work stress and workload. During his seven years and two months, nearly 65 workers died due to lack of protection. The Civil Liberties Committee of Telangana strongly condemns the failure of CMD Sridhar to visit the families of the mineworkers...


# Management should be responsible for the death of ALP workers.

# Privatization in Singareni and ALP should be stopped immediately. ..

Equal to # Jayaraju and Chaitanya, Thota Srikanth's death should be considered and his family should be given Rs 1 crore compensation and a permanent job.

# Management should abandon negligent attitude and conduct safety meetings in good faith.

# Take necessary steps to protect workers in the organization.

#. The Civil liberties committee demands that Telangana Chief Minister KCR and C &MD Sridhar, ALP visit the families of the deceased ...


Those involved in the fact-finding  are....

 1. Professor Gaddam Laxman, President, Civil liberties committee, Telangana.

2. N.Narayana Rao, General Secretary, Civil liberties committee, Telangana.

3. Madana Kumaraswamy, Assistant Secretary, Civil liberties committee, Telangana.

4..GAV Prasad, Chairman, Civil liberties committee, Joint Karimnagar District Committee.

5. Sripati Rajagopal, Vice-Chairman, Joint Committee on Civil liberties committee, Karimnagar District Committee.

6. Pulla Sucharitha, Assistant Secretary, Civil liberties committee, Joint Karimnagar District Committee.

7. Nara Vinod, Treasurer, Civil liberties committee, Joint Karimnagar District Committee.

8. Yadavaneni Mountains, EC Member, Civil liberties committee, Joint Karimnagar District Committee.

9. Pogula Rajesham, EC Member, Civil liberties committee, Joint Karimnagar District Committee.

10. Kada Rajanna, EC Member, Civil liberties committee Rights Association Joint Karimnagar District Committee.

11. Boddupelli Ravi, EC Member, Civil liberties committee Rights Association Joint Karimnagar District Committee.

12..Motapalukula Venkat, EC Member, Civil liberties committee Karimnagar District Committee.

13. Gaddam Sanjeev, EC Member, Civil liberties committee, Joint Karimnagar District Committee.

14. Budde Satyam, Convener, Civil liberties committee, Joint Adilabad District Committee.

15.A. Saraiya, Co-Convener, Civil liberties committee, Adilabad District Committee.

16.J.Posham, Co-Convener, Civil liberties committee, Joint Adilabad District Committee.


11 March 2022, Friday .3:45 pm.

Adria Project, Ramagiri Zone, Peddapelli-District. Telangana-State

10, మార్చి 2022, గురువారం

పసిపాప

 

పసిపాప 

ఎంత కాలాన్ని గంటలు గంటలు గా చుట్టి 

దారి తప్పకుండ నిలబెట్టావో !

కాలానికి పెద్ద పెద్ద చెవులు కుట్టి 

ఎన్నెన్ని మాటలు కుక్కావో !

అలా కాదేమో ... 

మాటలకే మాటలు నేర్పి 

మాటల కోట కట్టావేమో !

అది సరిపోదేమో .. 

బహుశా ఈ లోకానికి 

ఇంకా అనుభవం లోకి రాని 

మాటల నాగరికత ను 

ఆవిష్కరించావని నాకు తోస్తుంది 

ఇవన్నీ నీకు తెలియదులే ..  


జీవితం లోతుల్లోకి కండ్లు పెట్టి చూసి 

రెండు కాళ్ళ తోనే కాదు 

చేతుల్ని నిలబెట్టుకుంటూ 

నువ్వు చేసే ప్రయాణా న్నీ

నేను ఒక్కడినే కనిపెడతాను 


అందరు సగం కాలిన 

ఆశల హారాలను మెడలో  వేసుకొని 

పతకాల కోసం పరుగెడుతున్న వాళ్ళే .. 

నువ్వెంటో  మరి .. 

ఆకాశాన్నే ఆశను చేసి .. 

'కొండెక్కి రావే  .. 

గోగుపూలు తేవే .. అని 

లాలిపాటలు పాడుతావు 


బుడి బుడి అడుగులు వేస్తూ

నీ అనురాగమే పసిపాపలా 

అలవోకగా నీ ఒడిలోకి 

నడిచి వస్తుంది  



 

8, మార్చి 2022, మంగళవారం

మక్కువ ఎక్కువ

 మక్కువ ఎక్కువ 


ఈ మధ్యన నీకు కొంచెం ఎక్కువైతుంది.. 


కొంచెం కంగారు పడతాను 

సరిచేసుకునే ఊపులో..

దిద్దుబాటు..

ఉద్యమం రూపు తీసుకుంటుంది

 ఆ క్రమం లో  పుట్టుకొచ్చే ఇబ్బందులు

దృష్టి లో పెట్టుకొని

మళ్ళీ మొదటి నుండి

తడుముకుంటు వస్తాను


ఎక్కువ అనేది ఇప్పటిది కాదుగా 

ఆప్పుడెప్పటినుంచో మనిషి 

అలా ఎదిగి వస్తున్న వాడే

అతి సర్వత్ర వర్జ్యతే ..కాదు

ఏదైనా కొంచెం ఎక్కువే కావాలి

అదే ఒక మక్కువ కూడా 

పచ్చని చెట్టు

 పచ్చని చెట్టు 

పార్క్ లో చల్లగాలి అని కలవరిస్తాను

కానీ అది అసలు..  చెట్టుగాలి


చల్లదనం మత్తు లో

కనిపించని గాలి పేరు 

పలవరించానే  కానీ

పచ్చని చెట్టు ను పట్టించు   కోలేదు చూడు..


ఎక్కడ వనాలు వొళ్ళు విరుచుకుంటాయో

అక్కడ పురుడు పోసుకునే  గాలి

 అలలు అలలుగా 

ఈ చెట్టును చేరింది

దేన్ని దాచుకోవడం తెలియని చెట్టు

అన్నీ మనకోసం అర్పించి

మనిషి పూజ చేసుకుంటుంది

ఎండిన ఆకుల సాక్షిగా. ..

తన నీడన పెరిగిన మనిషి 

తనను విడిచి వెళ్లాడనే దిగులు లేదు 


తలలు   తెగనరికి 

ఎండిన మోడుల మధ్య 

మనిషి కట్టే సమాధుల్ని 

చూసి కొంచెం బాధ తప్ప .. 

అడివితల్లిని మరిచినా 

పార్క్ లో చెట్టు  తల్లి 

నీడ లో సేద తీరే 

బిడ్డకు చల్లని గాలి నిచ్చి వెళుతుంది 


7, మార్చి 2022, సోమవారం

మార్చ్ 8


మార్చ్ 8

 అతడు .. ఆమె 

కాదు .. మొదటే  ఆమె !

ఇది కాదు అసలు గొడవ 


ఇద్దరిది జీవాత్మిక బంధం 


శ్రమ దోపిడీ నిర్మాణాలే 

అతడిని  ముందుకు నెట్టాయి 

ఆమె ని తొక్కి పెట్టాయి 

సమ సమాజం ఆలోచనలే తిరిగి 

ఆమెను నిలబెట్టాయి 

అదే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం 

మార్చ్ 8

ఆమె తో పాటు అతడికి ఒక రోజు 

అది మేడే 

మార్చ్ 8 .. ఆమె కి ప్రత్యేకం 

తన్ను తాను అతడితో సమానం గా 

నిలబెట్టే పోరాట దినం .. 


3, మార్చి 2022, గురువారం

శిక్ష

 


శిక్ష 

జైలు గోడల మద్య 

ఖైదీ చేసే ఆర్తనాదం 

భూగోళాన్ని కుదిపేస్తోంది 

అందుకే రోజులు అలా 

దొర్లిపోతాయు 

కాలం భయపడిపోయి 

సగం శిక్ష 

తను వేసుకుంటుంది 



జైలు గది ఆత్మ

 జైలు గది ఆత్మ 


రెండు ఇనుప చువ్వల్ని 

రెండు చేతులా బిగించి పట్టుకొని 

తల ఒక్కటి ని 

బయట పడేయాలని అనుకుంటాను 


అప్పటికే మూడు ముక్కలుగా 

విడగొట్టబడిన నా తల 

రెండు ఇనుప చువ్వల మధ్య 

ఇరుక్కుపోయిన ముఖ చిత్రమవుతుంది 


రెండు కళ్ళను కలుపుకుంటూ 

కంటిచూపు ఒక్కటే 

బందిఖానాను బద్దలు కొడుతూ 

కనుచూపు దూరాన్ని అధిగమిస్తుంది 


నిలువెత్తు గోడల్ని దూకలేని 

రెండు పాదాల నిస్సత్తువ మీద 

నా కంటి  చూపుకి  ఎప్పుడూ 

ఈసడింపే  .. 

నిప్పులగుండం  అంత కోపం కూడా 


నా  స్వేచ్ఛా  పరిధి 

నీ  ముక్కు కొస వరకేనని 

ము ళ్ళ  కంచెలు లేస్తాయి 

జైళ్లు నోరు తెరుచుకుంటాయి 

మనిషి గొంతు చుట్టూ 

చచ్చిన శవం చేతులు 

రెండు బిగుసుకుంటాయి 








 యు క్రేన్ .. యు crane 


యుక్రేన్ .. యు .. క్రేన్  తో 

ఇప్పుడు నువ్వొక 

అనవసర యుద్దాన్ని 

తలకెత్తుకున్నావు 


యుద్దాల్ని మోసుకుని తిరిగే 

'నాటో' కుట్రలకు 

బలిపశువయ్యావు 


రష్యా విషయం లో 

కన్ను నీదే ,వేలు నీదే 


ఇద్దరి మధ్య యుద్ధం కోసమే 

నాటో  వాడు 

పెద్దన్న (బిగ్ బ్రదర్ )

వేషం వేస్తాడు 


ప్రపంచ యుద్ధం 

వాడి దిష్టిబొమ్మ 

యు..   క్రేన్ 

నువ్వెందుకు  దానికి 

శవాల్ని  వేలాడదీస్తావ్ ?



26, ఫిబ్రవరి 2022, శనివారం

వెలుతురు కిటికీ

 

వెలుతురు కిటికీ 


ఈ కాస్త ఓపిక ఉన్నప్పుడే 

నా మాటలు నాలుగు రాయాలి 

ఒక్క మాటైనా నీ చెంప 

చెళ్లుమనిపించాలనేదే నా ఆశ 


గుండె గది నిండిపోయిన భావాలు 

నువ్వు మూసి ఉంచిన చీకటి  తలుపుల్లోంచి 

దూక లేక పోయినా 

నేను తెరుచుకున్న వెలుతురు కిటికీ ల నుంచి 

నా మాటల ప్రయాణం ఖాయం .. 




గతం గతః

గతం గతః  


 గుండె చెరువైనప్పుడు 

చప్పుడు చేయ కుండా 

ఒక నదీ  మార్గాన్నివెతికి  పట్టుకోవాలి 

సముద్రాన్ని చేరుకోవటానికి 

అంత కంటే  

దగ్గర  దారి   లేదు మరి .. 


సముద్రం నిండా చెరువుల్లాంటి అలలే 

అల్లకల్లోల పడుతుంటాయి 

తీరం వేపే వస్తాయి కానీ 

కార్యం నెరవేరదు 

కట్ట తెగిన చెరువు కి 

తన పుట్టిల్లు మాయం అయినట్టు .. 


24, ఫిబ్రవరి 2022, గురువారం

 ఆధార్ కారటు ఉంది..  కాని నిలువ నీడ లేకపాయె !

 

కొండ గుహలు ,చెట్టు నీడలు దాటుకుంటూ నదీ తీరాల వెంట గొప్ప  నాగరికతలు నిర్మించిన   మానవుడికి గూడు అనేది  ఒక ప్రత్యేకమైన గుర్తింపు నిచ్చింది . ఈ ఆధునిక యుగం లో వాటన్నిటిని కొల్లగొట్టి ఒక్క ఆధార్ కార్డు నెంబర్  ఇచ్చి మనల్ని రోడ్డు మీద నిలబెట్టారు . 

అభివృద్ధి జపం చేస్తున్న బంగారు తెలంగాణ లో  ఇళ్ల పట్టాల కోసం వేలాదిగా ప్రజలు ఉద్యమించడం  అంటే ఛిద్రమైన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకొనే ఒక ఆదిమ ప్రయత్నం మాత్రమే !

  రాజ్యాంగం మన హక్కుల ప్రకటన .  ఆర్టికల్ 21  జీవించే హక్కును ఇచ్చింది. ఆర్టికల్ 14,15 స్త్రీ పురుష, కుల మత భేదాలు లేని  సమానత్వాన్ని ప్రకటించింది. ఆర్టికల్ 19E దేశంలో ఎక్కడైనా సరే  నివాసముండే  హక్కును కల్పించింది. 

ఏ  గూడూ లేని కార్మికవర్గమే ఎక్కువగా  కరోనా వైరస్  కు బలి అయ్యారు . పొట్టచేత పట్టుకొని నగరాలకు  వలస వచ్చిన పల్లె జనులే  నిలువ  నీడ  లేక తిరిగి వెళ్లి పోవాల్సి వచ్చింది . అందులో కొన్ని వందల మంది గర్భిణి స్త్రీలు  , ముసలివారు మృత్యువాత పడ్డారు . సొంత ఇళ్ళు వున్నమధ్య తరగతి, ఉన్నత వర్గాలు  క్వారెంటైన్(అంటరానితనం ) లో ఉండి బతికి పోయారు  .మురికివాడల్లో   పేదలు  కరోనా నుండి తప్పించుకోలేక పోయారు . పేద ప్రజల జీవించే హక్కు ఒక  ప్రశ్నగా మిగిలింది. 

          ఇల్లు  అనేది సగటు మనిషి  కల  మాత్రమే కాదు, పెండ్లి నుంచి చావు వరకు వారి జీవితాలు ఇంటితో ముడిపడి వుంటాయి.  డెబ్భై  శాతం గా ఉన్న  దళితులు, ఒంటరి స్త్రీలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్ మెదలగు వారికి సొంత ఇండ్లు లేకుండానే  వున్నారు.

 ప్రతి  పౌరుడి కి  ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసారు  కాని వారికి  సొంతం గా ఒక ఇల్లు  కూడా వుండాలన్న కనీస స్పృహ లేకపోవడం ఫామ్ హౌస్ ల్లో , బంగ్లాల్లో  కొలువు దీరే  పాలకులకే చెల్లింది .

 ఇళ్ల పట్టాల  హక్కుల సాధనకై హైదరాబాద్ ,శామీర్ పేట మండలం లోని   దేవర యాంజల్ గ్రామం లోని సర్వే నెంబర్ 640, 641 ప్రభుత్వ భూమి 15 ఎకరాల లో   తమ గూడు ఏర్పరుచుకోవడానికి ప్రజలు సుమారు 3000 మంది ఉప్పెనగా  కదిలారు. వారు కోరింది పెద్ద పెద్ద కంపెనీల వలె వందల  ఎకరాల భూమినో,లక్షల రూపాయల   టాక్స్  ఎగవేతో లేదా అభివ్రధ్ధి పేరిట  విధ్వంసం చేయడం  కోసం కాదు. ఒకే కుటుంబంలో వున్న నలుగురికి కాసింత భూమి దానిపై ఒక పై కప్పు కావాలని,దానికి  ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని గుడిసెలను వేసుకొనుటకు రెవెన్యూ అధికారులను 2009 నుంచి కోరినప్పటికి అది  సాధ్యపడలేదు.  గుడిసెలు  వేసుకున్నప్రతిసారి  వాటిని తొలిగించటం మరల మరల ప్రభుత్వానికి విన్నవించుకోవడం , ప్రభుత్వ  అణిచివేతే సమాధానమయ్యేది .   చివరాఖరిగా కొన్ని  రోజుల క్రిందటే  3.2.2022 న సొంత గూడు లేని  సుమారు 3000 మంది   తెగింపుతో  దండుగా కదిలి  640 సర్వే నెంబర్ లోని 9 ఎకరాలలో తాత్కాలిక నీడను ఏర్పరుచుకున్నారు.ప్రభుత్వ ,పోలీస్ బెదిరింపులకు తల వంచలేదు   

ఇదే సర్వే నెంబర్ లో సేవాలాల్ సంస్థ సభ్యులు సుమారు 300 కుటుంబాలు గత నాలుగు సంవత్సరాలుగా తాత్కాలిక నీడను ఏర్పరుచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.  వారి వెంట  పోరాటంలోకి కదిలి రమ్మని ఆసరాగా నిలబడమని మనకో సందేశాన్ని ఇస్తున్నారు.

           5.2.2022 న రెవెన్యూ డెవలప్ మెంట్ ఆఫీసర్ గారు తమ సిబ్బందితో వచ్చి ప్రజలను ఇండ్ల స్థలాలను ఖాళీ చేయవలసిందిగా హెచ్చరిక జారీ చేసారు. వారి హెచ్చరికను ఖాతరు చేయని 3000 మంది ప్రజలు ఎదురు తిరగటం వల్ల  వారికి డబుల్ బెడ్ రూములు  ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారు తమకి లిఖిత పూర్వక హామి ఇవ్వవలసిందిగా కోరడంతో  మారు మాట్లాడకుండా ఆర్.డి.ఓ గారు వెను తిరిగారు. ఈనాటి వరకు ఆర్.డి.ఓ గారు తమ సమ్మతాన్ని తెలియజేయలేదు. ప్రజల కోరిక మన్నించగపోగా అదే రోజు సాయంకాలం నుండి 9 ఎకరాల భూమిలో రోడ్డు వైపు నందు ఇనుప తీగలను పెట్టి రాకపోకలను నిషేదించి వారిని నిర్భందించారు. తాత్కాలిక గుడిసెలను ఏర్పరుచుకున్న వారిని బలవంతంగా భూమి నుంచి వెళ్ళగొట్టడానికి ఆహార పానియాలు నిలిపి వేసినారు.  కొందరు  వృద్దులు , పిల్లలు, స్త్రీలు  డిహైడ్రేషన్ తో  సొమ్మసిల్లి అపస్మారక స్థితిలోకి  వెళ్ళగా మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు.   8.2.2022 వారి జీవించే హక్కును నిలబెట్టుకోవడానికి రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించినారు. మానవ హక్కుల కమీషన్ ఆర్.డి.ఓ, తాహసీల్దార్, ఏ.సి.పి గారులను పిలిపించి వారి నుంచి  రిపోర్ట్ తీసుకున్నారు . అందుకు ప్రజల పక్షాన  న్యాయవాదులు ప్రభుత్వం  రిపోర్ట్ లు అసంబధ్ధంగా వున్నాయని  ప్రజా రిపోర్ట్ ను తీసుకోవలసిందిగా  కమీషన్ న్యాయవాదులను  కోరింది . 13.2.2022 న న్యాయవాదులు సంఘ సభ్యులతో కలిసి  ఇండ్ల స్థలాల వద్దకు వెళ్లారు . ఈ క్రమంలోనే సేవాలాల్ గుడిసె వాసుల వారు వేసుకున్న గుడిసెల దగ్గర రోడ్డు నుండి వస్తూ వుండగా అడ్డుకొని అడ్వకేట్లను, సంఘం నాయకులను నానా దుర్భాషలాడుతూ తీవ్ర పదజాలంలో దూషించారు. అందుకు ప్రతి గా అడ్వకేట్  తమ రాక లోని ఆంతర్యాన్ని   వివరించారు . అవసరమనుకుంటే కొంత మంది స్త్రీలను కూడా తనతో రమ్మనమని చెప్పారు . కాని  కమీషన్ యెక్క అడ్వకేట్ ల రాకను ముందస్తుగానే తెలుసుకున్న భూ కబ్జాదారులు , వారి గూండాలు కర్రలతో, రాళ్ళతో దాడి చేయటానికి సిద్ధంగానే వున్నారని వారి చర్యలను బట్టి తెలుసుకోవటం జరిగింది. ఇందులో పూల్ సింగ్, దండోరా  అశోక్, రవి నాయక్ మెదలగువారు కర్రలను, రాళ్ళను తీసుకొని కొట్టడానికి సిద్దపడగా అడ్వకేట్లు తమపై  దాడిని నిలువరించమని కోరి ముందుకు వెళ్ళినారు. వారు 15,20 అడుగుల దూరం నడవగా సంఘ నాయకులైనటువంటి జె.బాలన్నను పట్టుకొని వీపుమీద, ఛాతి మీద, దవడ మీద పిడి గుద్దులు గుద్దారు . అందుకు సంఘం సభ్యులు కొంతమంది అడ్డుపడగా వారిని దుర్భాషలాడుతూ కింద పడేసినారు. జె.బాలన్న ను కిందకు పడేసి, మెడమీద కాలుపెట్టి మీరు గుడిసెలను ఖాళీ చేయకపోతే మీ ప్రాణాలను, మీ సంఘం నాయకుల ప్రాణాలు తీస్తామని బెదిరించారు . అక్కడే వున్నటువంటి శ్రీమతి జె.రజని కుమారి, ఎస్.రేణుక గారులను మిగతా వారిని కొట్టవద్దు అని బ్రతిమిలాడినా  వినలేదు. స్త్రీలు అయివుండి మీరు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. గనుక మీ మాన ప్రాణాలను తీస్తామని బెదిరిస్తూ వారి వెనుక నుండి వారి శరీర భాగాలను తాకడానికి ప్రయత్నం చేసారు. మరి కొంతమంది వారి వెనుక భాగములో వచ్చి కొట్టినారు. వారు బెదిరిస్తూ మీరు ఈ పోరాటం కొనసాగిస్తే మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వివిధ రూపాలలో హింసి స్తామని , మూకుమ్మడి రేపులు చేస్తామని చెప్పి భయబ్రాంతులకు గురిచేసినారు. వారి కుటుంబాలకు  ముప్పు పొంచి వుంటుందని బెదిరించారు. ఈ విషయంలో పోలీసులు  పరోక్షంగా భూ కబ్జాదారి గూండాలకు సహకరించారు. ఈ విషయాన్ని  జాజుల బాలన్న, శ్రీమతి జె.రజని కుమారి, ఎస్.రేణుక  సంఘం సభ్యులకు తెలియపర్చారు.

 ఇండ్ల స్థలాల సాధన సంఘం వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలని తీర్మాణించి, అదే రోజు 13.2.2022 న   పేట్ బషీర్ బాద్  కి వెళ్లి తమ కంప్లైంట్  తీసుకోమని ఎంత వేడుకున్నా   వినలేదు. కాని , ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలపై దాడికి పాల్పడ్డ భూ కబ్జాదారుల   కంప్లైంట్  తీసుకున్నారు .

          ప్రజల అభిష్ఠానికి విరుద్ధంగా కొంతమంది స్థానిక నాయకులు, పోలీసులు  రెవెన్యూ శాఖ ఆసరాతో 640, 641 లోని భూమిని కబ్జా చేయుటానికి ప్రయత్నిస్తున్నారు . ప్రజలతోనే వుంటూ  ఉద్యమాల పేరిట భూమిని ఆక్రమించి తమ స్వార్థానికి  భూమిని ముక్కలు ముక్కలుగా మోసపూరితంగా కొంతమందికి అమ్ముతున్నారు. ఇందులో పూల్ సింగ్, దండోరా  అశోక్, కటకం అశోక్ మెదలగువారు వున్నారు. ప్రజలని, గుడిసెలు వేసుకున్నవారిని సంఘటితం కాకుండా అడ్డుకుంటూ తమకు మద్దతునిచ్చే వారితో న్యాయస్థానాల ముందు వివిధ సంఘాల పేరుతో కేసులు వేస్తున్నారు . ప్రజల ద్వారా ఏర్పడిన ఇండ్ల స్థలాల సాధన సంఘం సభ్యులకు  అడ్డుగా నిలిచి వారిని అవమానపరిచి భయపెట్టి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడమే  గా కుండా న్యాయ స్థానాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. భూముల పేరిట, ఉద్యమం పేరిట ప్రజల వద్ద నుండి విపరీతంగా డబ్బులు  వసూలు చేస్తున్నారు. అబద్ధపు సాక్ష్యాలతో ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అయినా సరే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏర్పడిన ఇంటి స్థలాల సాధన సమితి నాయకత్వం అనేక అడ్డంకులని అధిగమిస్తూ, రాత్రనక పగలనక పేద ప్రజలను మీటింగ్ ల ద్వారా చైతన్య పరుస్తూ కలిసి కట్టుగా వారి వెంట ప్రజాస్వామిక పోరాట రూపాలతోటి హక్కుల సాధనకై ఉద్యమిస్తున్నారు. ఇండ్ల స్థలాల సాధనకై 3000 మంది జనంతో కలిసి నివసించటమే కాక సంఘ విద్రోహ చర్యలు, పోలీసుల బెదిరింపుల మధ్య మెక్కవోని ధైర్యంతోటి అవిశ్రాంతంగా గస్తీ కాస్తున్నారు. తమని తాము ప్రజా వాలంటీర్ సైన్యంగా సమాయాత్తమై వారికి కావలిసిన తక్షణ  అవసరాలు , తాత్కాలిక సదుపాయాలు కలుగజేస్తున్నారు. 

          ఇప్పటికే  ప్రభుత్వము భూమిని ఒక సరుకుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి సిద్ధమైంది. లాభాల వేటలో భాగంగా తెరపైకి వస్తున్న అనేక ప్రణాళికలపై, అభివృద్ధి పథకాలపై ప్రజలు చేస్తున్న  పోరాటాలు ఇంకా గెలవవలసే  వుంది. అయితే అప్పుడప్పుడు పాలకులు తమ ఓటుబ్యాంక్ కోసం అధికారాన్ని చేజిక్కుంచుకోవటం  కోసం ప్రజలకు కొన్ని హామీలు ఇస్తూ  వుంటారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పాలక వర్గాల కుట్రలో భాగంగా G.O:M S నెంబర్ 14 ను 14.2.2022 న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజలు ఎటువంటి ప్రభుత్వ భూములనైనా ఆక్రమించుకుని నివసిస్తున్న యెడల వారిని 21.2.2022 నుండి 31.3.2022 వరకు మీ సేవలో తమ పట్టాల రెగ్యులరైజ్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశించింది. 640 సర్వే నెంబర్ లను గుడిసె వాసులకు ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వారే ప్రతి రోజు అర్హులైన వారినే గుర్తించి తమ సంఘ నాయకులకు ఇవ్వటంతో పాటు అనర్హులైన వారిని అనగా అంతకు ముందే సొంత ఇంట్లో వున్నవారిని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు.

          ప్రజలు గత పది సంవత్సరాల  నుంచి ఇండ్ల పట్టాల కోసం పోరాడుతూనే వున్నారు. కాని  ప్రభుత్వ అధికారులు   వారికి న్యాయం చేయటంలేదు.

 మానవ హక్కుల కమీషన్లోను , హై కోర్ట్ లోను  కేస్ లు వేసాము . 

దుర్మార్గమైన విధ్వంసకరమైన అభివ్రధ్ధి పేరిట భూమిని ధనిక శక్తులకు ధారపోసి,  పేద ప్రజలకు నిలువ నీద లేకుండా చేసే కుట్రలో  వివిధ శక్తులు, ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. 

అన్ని వర్గాల  ఉద్యమ  శక్తులు కలిసి   మద్ధతు తెలియజేయవలసిందిగాను , న్యాయంగా రావలసిన నివాస హక్కు కోసం జరుగుతున్న ప్రజాపోరాటాలతో  కలిసి రావాలని  కోరుతున్నాం .

 ప్రభుత్వ భూమి అంటే రాజ్యాంగం చెప్పినట్టుగా అందరికి సమాన హక్కు వుంటుంది. కాబట్టి  పట్టణ పేదలమైన మేము  మా వంతు  హక్కుకై , మా  గూటికై పోరాడుతున్నాము.

          ఈ న్యాయ బద్ధమైన పోరాటంలో  మీ వంతుగా  స్పందిచమని  అడుగుతున్నాం 

మన  డిమాండ్స్:

1. సర్వే నెంబర్ 640, 641 లో భూమిలో అర్హులైన వారికి ఇళ్ళపట్టాలను ప్రభుత్వం ఇవ్వాలి.

2. ప్రభుత్వ ఖర్చుతో పేదలకు పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి.

3. పేదల హక్కులను హరిస్తున్న భూ కబ్జాదారులు, స్థానిక గూండాలపై చర్యలను తీసుకోవాలి.

4. రాజ్యాంగం ప్రకటించిన విధంగా నివాస హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించాలి.

5. ఇదే సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో ఆక్రమించుకొని నివసిస్తున్న సేవాలాల్ సంస్థ సభ్యులకు కూడా ఇళ్ళ పట్టాలను జారీ చేసి వారికి సైతం పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి.