మార్చ్ 8
అతడు .. ఆమె
కాదు .. మొదటే ఆమె !
ఇది కాదు అసలు గొడవ
ఇద్దరిది జీవాత్మిక బంధం
శ్రమ దోపిడీ నిర్మాణాలే
అతడిని ముందుకు నెట్టాయి
ఆమె ని తొక్కి పెట్టాయి
సమ సమాజం ఆలోచనలే తిరిగి
ఆమెను నిలబెట్టాయి
అదే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం
మార్చ్ 8
ఆమె తో పాటు అతడికి ఒక రోజు
అది మేడే
మార్చ్ 8 .. ఆమె కి ప్రత్యేకం
తన్ను తాను అతడితో సమానం గా
నిలబెట్టే పోరాట దినం ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి