విరహం

 విరహం
కాలం రెండు కొసలను

నీ జడపాయలు చేసి

అల్లుకుంటూ ,అల్లుకుంటూ

నీలోకే నడిచానో,

నాలో నేనే ఒదిగిపోయానో ,

ఏమో!

ఏదీ ఇదమిద్దంగా తెలియలేదు

కాని నల్లని ఆకాశం ,నీలానే

చుక్కల్లె నవ్వుతూ

నన్నెప్పుడు ఆటపట్టిస్తూనే వుంటుంది .