బాల్యమే నేను ..
నాకు నేనుగా ఉన్నానంటే అది ఆ వయసులోనే .. శ్రీ శ్రీ అన్నట్టు ఏదైనా నాకోసమే అనుకొనే ఆనంద అమాయకత్వం ..
సాయం కాలం వేళ నాన్న సైకిల్ మీద ఊరి అవతల కాలి బాటల మీద కొండల చాటుకు వెళ్లే సూరీడ్ని చూస్తూ , చీకటి పడే వరకు వెళ్లి ,ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడిని .
వాటి అన్నిటిని ఎలా వివరించి చెప్పాలో ఇంకా నేర్వని రోజులు అవి. . ఇప్పుడైనా వాటికి కొత్త అర్థాలు ఎం చెపుతాం కానీ అన్వేషణ తాలూకు బుడి బుడి అడుగులు గుర్తుకొస్తే అదో ఆనందం . మీ అందరితో పంచుకోగలగడం దానికి పరాకాష్ట .
ఇలా చెప్పుకుంటూ పోతే అసలు విషయం కంటే ఈ కొసరు కబుర్లే ఎక్కువవుతాయి .
అందుకే కథ లోకి వెళ్లిపోదాము
దయ్యం సాయం
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
అప్పటికింకా నిక్కర్లలోనే తిరుగుతున్నం .. అంటే అయిదో ,ఆరో క్లాస్ అనుకుంటా నేను మేము ముగ్గురం మొగ పోరగాళ్ళమే . నేనే పెద్ద .
మా నాన్నది సింగరేణి బాయ్ పని . మా అమ్మకి ఇంట్ల పనితోనే సరిపోయేది . టీవీలు ఇంకా రానికాలం . రేడియో మాత్రమే ఉండేది . కరెంటు స్తంభాలు ఇంకా కార్మిక వాడల్లోకి రాలేదు .
రైతాంగం నుండి వచ్చిన కార్మికులు నిత్యం పనిలో వున్నట్టే ఉండేవారు. ఆడవాళ్ళకు మగోళ్ల సేవలు,పిల్లల పెంపకం తోనే సరిపోయేది . ఇక చిన్నపిల్లలం .. మాకేం పని ఉంటుంది ?బడికి పోవాలే .. బడి నుంచి రాగానే ఆటకు ఉరుకాలే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి