యు క్రేన్ .. యు crane
యుక్రేన్ .. యు .. క్రేన్ తో
ఇప్పుడు నువ్వొక
అనవసర యుద్దాన్ని
తలకెత్తుకున్నావు
యుద్దాల్ని మోసుకుని తిరిగే
'నాటో' కుట్రలకు
బలిపశువయ్యావు
రష్యా విషయం లో
కన్ను నీదే ,వేలు నీదే
ఇద్దరి మధ్య యుద్ధం కోసమే
నాటో వాడు
పెద్దన్న (బిగ్ బ్రదర్ )
వేషం వేస్తాడు
ప్రపంచ యుద్ధం
వాడి దిష్టిబొమ్మ
యు.. క్రేన్
నువ్వెందుకు దానికి
శవాల్ని వేలాడదీస్తావ్ ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి