needa

 నువ్వూ..   నీడా..  

చెట్టు కొమ్మను  
పట్టుకొని 

చెరువు గట్టున   
నిలబడి 

నీ కోసం 
ప్రత్యేకం 
ఒక కన్ను వేసి వుంటాను  

పచ్చని చెట్టు.. 
ఒక మాటల పుట్ట 

మాటల్లో  పెట్టి 
నీ గురుంచి 

గుచ్చి గుచ్చి 
అడిగింది 
 
నీటి లో 
నా నీడ వేపు 
చేయి చాచి 
"నువ్వే గా  "  అని 
గారాలు పోతాను   

ఆకులన్నీ
నీ లాగే 
గల గలా నవ్వేసాయి  

ఎందుకో అంత  నవ్వు ? 
నేను 
కోపం  అరువు తెచ్చుకుంటాను 

ఎదురు చూట్టం ఎందుకు మరి  ?
నీ నీడే  తానైతే 
ఎంచక్కా  ఈ నీడతోనే 
కబుర్లు చెప్పుకోవోయు అంటుంది 
గడసరి చెట్టు
నీకు మల్లే సొగసరీ ..