నీటి అడుగు
***********
అలసి పోయి కొనఊపిరి నిలిచి పోయిన
రాలిపోయిన ఎండుటాకుల్ని కుప్పచేసి
ఈ చలి కాలం మంట కాగవచ్చు వెచ్చంగా ..
జ్ఞాపకాలు కొన్ని బూడిద లో చేరి
ఇక బుద్దిగా నిదురలోకి జారిపోతాయి
***********
వెలుగు రేకులు పూర్తి గా విరబూయక ముందే
సూర్య కిరణాలు తాకి కంటి వెలుగులయ్యే పచ్చని ఆకుల్ని
నా ఆనందాశ్రువులతో ఒక్క సారి తడి చేయాలని వుంటుంది
నువ్వు గాలై వీచి, వీచి కొమ్మలు ఊ యలలయ్యే వేళకి
కడిగిన ఆకుల చినుకులు నేల తాకితే ..
ఆ పదను కే ..
జ్ఞాపకాల గొడుగు పురి విప్పుకుంటుంది
ఊరేగింపులా జీవితం నీటి అడుగులు వేస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి