గుండె తలుపు
కిటికీ .. చిట్టివి రెండు రెక్కలు దానికి
ఎప్పటికప్పుడు మడిచి
జేబులో పెట్టుకుని పోయే బుల్లి పిట్ట నాకు
కిటికే .. లోకం గా బతికిన రోజులు
ఇప్పుడు గురొస్తే ఇది చావు కన్నా హీనం
కిటికీ రెక్కలు పూర్తిగా విరిచి కట్టి
గాలికి గుండె లో గుడి కట్టేవాణ్ణి
గడప దాటి వెళ్లే స్వేచ్ఛ లేని బాల్యం
కిటికీని కంటికి రెప్పలా కుట్టేసుకున్నాను
సగం కోసిన కిటికీ రెక్కలు లు తెలుసు
పై రెక్కలు మాత్రమే తెరిచి బురఖా తో లోకాన్ని చూడాలి
ఆమె .. అలా చీకట్లో మగ్గిపోవాలి
ఎంతో నయం నా జీవితం
మగ పుట్టుక పుట్టినందుకు
అవునూ .. అప్పట్లో కిటికే
నిలువెత్తు నా గుండె తలుపు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి