nippu

నిప్పు

పదే పదే ఒకే విషయాన్ని 
అదే పనిగా చెబుతుంటే 
 
అగ్గిపెట్టెను
ఎన్నిసార్లు కనిపెట్టాలని

విసుక్కునే వాడిని

ఎందుకంత అనవసర శ్రమ

అని వాపోయే వాడిని

కాని, నిప్పుదేవుడు
పూజలు అందుకుంటున్నంత  కాలం 

అగ్గిపెట్టె
కనిపెట్ట బడినదిగా గుర్తించ బడదు

ఆ గుర్తింపు కోసమే మళ్ళీ మళ్ళీ

అగ్గిపెట్టెను 
కనిపెట్టవలసి వుంది .