28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

 కొత్త గా ఇవ్వగలిగేది ఏముంటుంది నీలో   .. 

నన్ను, నేను కోల్పోయు 

నీలో వెదుక్కోవటం తప్ప .. 

విరహోన్మాదం

 విరహోన్మాదం 
వాన చినుకులా రాలి 
నీరులా జారిపోతాము 

ఆమాత్రం తడి 
గిలిగింతలకే 
గుండె చెరువవుతుంది 

పాడు జీవితమంతా 
ఆక్షణమే మునకేసి
వరదలా కొట్టుకుపోతునట్టు .. 

ఇసుకలో కట్టుకున్న పిచ్చుక గూళ్ళు 
భూకంపము లో  కూలిపోతునట్టు ..
అహో!   విరహోన్మాదం



ప్రేమా


 ప్రేమా ..  


ఎండుటాకులా ఎగిరిపోతూ 
రాలిపోతాము 
ఆమాత్రం స్వేచ్చ కే 
చలించి పోయి 
గుండె తేలికైపోతుంది 

జీవిత పరమార్థమేదో 
అప్పుడే రూపు కట్టినట్టు.. 
మనసుని ముద్దాడి 
మమతలకోట కట్టినట్టు .. 
హమ్మో !ప్రేమ .. ప్రేమా . 

22, ఫిబ్రవరి 2014, శనివారం

మనసు గాయం 

తీరని బాదే 
మనసుకి పెద్ద  గాయం 
 ఏవో ఓదార్పు మందులు.. 
పుండు పూడుకుపోయేoతవరకు 
 సలపరింతల సాధింపు లే 
 ఈ మధ్య లో .. 
మందులు వికటించినా 
మనసే విరిగిపోయినా 
 మళ్ళీ మొదటికే 
మానని 
మనసు  గాయం 
గాంగ్రీన్ (రాకాసి పుండు ).. 



నిర్మాత 

భూ కంపం లా 
ఎదలోతుల్లో బాధకి ఎపిసెంటర్ 

కనిపెట్టలేని మనసు 
మరింతగా బీటలు వారుతుంది 

శిధిలాలు పదిలంగా 
 తొలిగిoచుకొని 
మళ్ళీ .. 
ఒక  పునర్ నిర్మాణమే 
ఎప్పుడూ .. 
తరగని జీవితానికి..  

 అలజడి 

సముద్రంలో పుట్టిన  చక్ర వాకంలా 
భూమి వేపు వేగంగా కదిలి వస్తాం 
అడ్డంగా ఉన్నవాటినన్నిటిని 
సమానం చేసేస్తాం .. 

సముద్రం శాంతిస్తుంది 
ఎవరికి వాళ్ళం హాయిగా 
ఎంచక్కా ,ఎవ్వరి పనుల్లో  వాళ్ళం 
మునిగిపోతాం 
కాని .. 
జ్ఞాపకాల సునామీలే 
అలజడి ,అలజడి .. 

 ప్రేమ 
త్రిశంకు స్వర్గం 
నుండి 
స్వర్గారోహణే 
ప్రేమ .. 

 దూరం 
సముద్రం లో ఆటుపోటులను ఎలా  కొలుస్తాం .. 
మామూలే ,
తీరంలో అలల వేపు ఆసక్తిగా చూస్తాం 
మరీ .. 
ప్రేమ దేవతని ఎలా కొలుస్తాం ?
కవితల తోరణాలు కట్టి 
స్వాగతం పలుకుతాం 
కాని.. 
అనాదిగా ఆమె 
ఆ ద్వారం దగ్గరే తచ్చాడుతుంది .. 
తీరంలో అలలకి మల్లె..  

అగ్ని గుండె ..




 అగ్ని గుండె ..
ఆకు రాలినంత సహజంగా 
టపుక్కున 
వెనక్కి తిరిగి చూడకుండా 
ఎలా వెల్లిపోతావో ... 
నిజమే .. 
అది ఎండి పోయిన పత్రహరితం 
నీది .. 
నిలువెల్లా మండిపోయే అగ్ని గుండె .. 
అభివృద్దికి కీలకం అంతర్గత కారణాలు ఒక పక్కనయుతే ,ఒక కొత్త నాయకత్వం రావడం ఇంకొకవైపు . ఈ కొత్త నాయకత్వం వనరుల దుర్వినియోగం ,వినియోగించులేకపోవడం ,వనరులను కొత్త తరహాలో ,కొత్త ఉపయోగాలకు వాడుకోవటం ,ఇప్పటివరకు వనరులుగా కనిపించనివాటిని వనరులుగా గుర్తించి ఉపయోగించుకోవడం,ఇత్యాది కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం ద్వారా ఒక కొత్త వ్యవస్థకు పునాదులు వేయాలి . అదేఅభివృద్ది క్రమం...  తెలంగానకైనా ... సీమాంద్ర కై నా ..   

8, ఫిబ్రవరి 2014, శనివారం

రాతిరి రాతిరి

 రాతిరి రాతిరి 

చీకటి మూసిన ఏకాంతమే 
పిడికెడు గుండెకు ఓదార్పు .. 
మరి ఆ చీకటి తలుపే " కిర్రు " మని తెరిచి 
భయపెడితే .. 
ఆ ఏకాంతంలో  చీకటి నీవే ,
 అ'భయం' లాంటి భయం  నీవే .. 

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

magazine boxes throwing out fromthe truck at Diapipar,Shahdol(M.P)  

MEN AT WORK...WITH ONE ONE ONLY  D.GOPAL REDDY
 magazine boxes throwing out fromthe truck at Diapipar,Shahdol(M.P)
 Setting the boxes...

 make-shift shelter for watch-men at our site
 loading of portable explosives magazines boxes at Hyderabad..
 Diapipar site
chai paani...

materials..

a creature found in the grounds of Diapipar..