గతం గతః
గుండె చెరువైనప్పుడు
చప్పుడు చేయ కుండా
ఒక నదీ మార్గాన్నివెతికి పట్టుకోవాలి
సముద్రాన్ని చేరుకోవటానికి
అంత కంటే
దగ్గర దారి లేదు మరి ..
సముద్రం నిండా చెరువుల్లాంటి అలలే
అల్లకల్లోల పడుతుంటాయి
తీరం వేపే వస్తాయి కానీ
కార్యం నెరవేరదు
కట్ట తెగిన చెరువు కి
తన పుట్టిల్లు మాయం అయినట్టు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి