7, నవంబర్ 2022, సోమవారం

 అభాగ్య జీవులు .. 

the wretched  of  the  earth . by frantz  fanon 


పాలక వర్గాన్ని ప్రాధమికంగా నిర్వచించేది ఫ్యాక్టరీలు ,ఎస్టేట్లు ,బ్యాంకు అకౌంట్స్ కాదు. పాలక జాతి అంటే మొట్ట మొదటిగా ,స్థానికుల కంటే భిన్నంగా ఉండే వేరే ప్రాంతం నుండి వచ్చిన బయటివాళ్ళు. ఇతరులు. 


వలస ప్రాంతాలలోని చర్చి తెల్లవాడి చర్చి . విదేశీయుల చర్చి . అక్కడి చర్చి పిలుపులు వలస ప్రజలని భగవంతుని మార్గానికి మల్లించేవి   కావు . తెల్లవాళ్ళ మార్గానికి ,యజమాని మార్గానికి ,ఆధిపత్యం చెలాయిన్చే వాళ్ళ మార్గానికి మల్లించేవి . 


మానికీయం తత్వం ... ఒక పురాతన ధార్మిక చింతన . సృష్టి లోని ప్రతీది పరస్పర విరుద్ధమైన రెండు శక్తులుగా విడిపోయి ఉంటుందని భావిస్తారు . మంచి -చేడు . తెలుపు- నలుపు . దేవుడు -దెయ్యం . ఒకటి ఉండి రెండోది లేకపోవడం అనేది ఉండదు ఇప్పుడు దీనిని డ్యూయలిజం లేదా ద్వైతం అంటున్నారు. 

వలస పాలకుడు రూపొందించిన ప్రపంచము లో వలస పాలితుడిని ఎప్పుడు నేరస్థుడిగానే పరిగణిస్తారు.  వలస పాలితుడు తన నేరాన్ని అంగీకరించడు. కానీ దాన్ని ఒక శాపం గా పరిగణిస్తాడు . 

ఏది ఆటంకంగా  ఉన్నదో అదే కొన్ని ఉద్వేగ పూరిత సమయాల్లో జరగవలిసిన కార్యాన్ని ఉధృతం  చేస్తుంది . 

మతం వల్ల  వలసపాలితుడు కూడా వలస పాలకుని ఉనికిని గమనించకుండా ఉండిపోతాడు . 

వలస ప్రపంచం లో ,వలస ప్రజల ఉద్వేగాలు ఎప్పుడు , పచ్చి పుండు సున్నానికి జంకినట్టు అతిసులభంగా గాయపడేలా ఉంటాయి 


వలస దేశాలలో కేవలం రైతాంగం మాత్రమే విప్లవాత్మకం గా ఉంటుందనేది చాలా స్పష్టం . వాళ్లకి పొందడానికె తప్ప పోగొట్టుకోవడానికి ఏమి లేదు . ఏ హక్కులు లేక దోపిడీకి గురవుతూ ,కడుపు మారుతున్న రైతు చాలా తొందరగానే హింస ద్వారానే ఫలితం ఉంటుందని గ్రహిస్తాడు . 

వలస దేశాల ఉన్నత వర్గం ,అంటే విముక్తి పొందిన బానిసలు ఒకసారి ఉద్యమ శీర్ష స్థానానికి వచ్చాక అనివార్యంగా బూటకపు ఉద్యమాలు నడుపుతారు 


వలస దేశపు వ్యక్తి భార్యకు దుస్తులు కొనే బదులు రేడియో కొనుక్కోవడం చూసి కొన్ని సార్లు కొందరు ఆశర్యపోతారు . కానీ అలా ఆశర్య పోనవసరం లేదు . వాళ్లొక ప్రళయాంతక వాతావరణం లో ఉన్నారు కాబట్టి అన్నీ అనుభవించాలని అనుకొంటారు . 


పని పరిస్థితులను చక్కదిద్దక పోతే సామ్రాజ్యవాద  శక్తులు జంతు స్థాయి కి కుదించిన ఈ ప్రపంచాన్ని మళ్ళి  మానవీకరణ చేయటం కష్టం . 

 

పేజీ నెంబర్ 99;

రాజకీయ చైతన్యం కలిగిన కార్మిక సంఘ్ నాయకుడంటే ,స్థానిక వివాదమే తనకు ,యాజమాన్యానికి మధ్య కీలకమైన ఘర్షణ కాదని గుర్తించగలిగిన వ్యక్తి .. 


పెట్టుబడి దారి దేశాలలో కార్మికులకు పోయేదేమీ లేదు . అన్నీ సాధించుకోవచ్చు .. వలస దేశాలలో మాత్రం కార్మిక వర్గం ప్రతిదానిని పోగొట్టుకోగలదు . 

పేజీ నెంబర్ 127;

కొన్ని రాయితీలు నిజానికి సంకెళ్లు అని తెలియచెప్పే చారిత్రిక సూత్రం గురుంచి ప్రజలు ,ప్రతి పొరాట  యోధుడు సచేతనంగా ఉండాలి . 

వలస ప్రజలు వలసాధికారుల నుంచి ఎక్కువలో ఎక్కువగా రాయితీలు అంగీకరించ వచ్చు  కానీ ,ఎప్పుడు రాజీకి మాత్రం అంగీకరించకూడదు .  

రైతాంగం విషయానికి వస్తే ,వాళ్ళు ఆచరణాత్మక అనుభవం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని ,ప్రజల పోరాటానికి నాయకత్వం వహించేందుకు సమర్ధులని నిరూపించుకుంటారు . 


పేజీ నెంబర్ 134;

తమకు ,దేశానికి ఎక్కువ లాభదాయకమైన ఫ్యాక్టరీస్ ను ఏర్పాటు చేయలేక ,ఈ పెట్టుబడిదారీవర్గం స్థానిక వృత్తులకు దేశభక్తి ముసుగు తొడుగుతుంది 

తన చారిత్రిక కర్తవ్యం ఒక మధ్యవర్తిగానే అని దేశీయ బూర్జువా వర్గం తెలుసుకుంటుంది . మనం గతం లోనే చూసినట్లు ,దాని పని దేశాన్ని మార్పు చేయటం కాదు నయావలస వాద ముసుగు వెనక తనను దాచిపెట్టుకోక తప్పని పరిస్థితి లో అది పెట్టుబడి దారి విధానానికి ఒక వాహక పట్టి (కన్వేయర్ బెల్ట్ ) గా మాత్రమే ఉపయోగ పడుతుంది . 

ఇప్పుడు మనం జాతీయవాదం నుండి ,జాతీయ ఉన్మాదానికి ,అంధ దేశ భక్తికి ,జాతి వివక్ష కి చేరుకున్నాం . 

పేజీ నెంబర్ 170 ;

యువత క్రీడా ప్రాంగణాలు వైపు కాక పొలాల వైపు ,పాఠశాలల వైపు చూడాలి . 

వృత్తి క్రీడాకారులను తయారు చేయడం పై కాక ఆటలు కూడా ఆడే చైతన్యమైన వ్యక్తులను తయారు చేయడం ముఖ్యం .. 

మన దేశం లో ఏమి జరుగుతుందో నని నిరంతరం అర్థం చేసుకోవడమే మన అతి పెద్ద కర్తవ్యం . 

రాజకీయ శిక్షణ అంటే మెదడుకు ద్వారాలు తెరవటం ,మెదడును జాగృతం చెయ్యడం ,దానిని ప్రపంచానికి పరిచయం చెయ్యడం .. సెజేయుర్ చెప్పినట్టు ;"మనుషుల అంతరాత్మలను కనుకొనటం .. 

ప్రజలను రాజకీయవంతం చేయటం అంటే దేశం మొత్తాన్ని పౌరులైన ప్రతి ఒక్కరికి చెందిన వాస్తవం గా మలచటమే .. దేశపు అనుభవాన్ని ప్రతి ఒక్కరి అనుభవంగా చేయటమే .. 

ఆలోచనా ప్రపంచం లో మనిషి .. ప్రపంచానికి మెదడు -సేకొటారి 

ఒక వంతెన కట్టడం లో కట్టేవారి చైతన్యం పెరగక పోతే అటువంటి వంతెన కట్టవద్దు . ప్రజలు నదిని ఈది దాటనివ్వండి లేదా పడవను ఉపయోగణించనివ్వండి . పెద్దపెద్ద యంత్రాలతో వంతెనను అక్కడ తెచ్చి పెట్టొద్దు వంతెన నిర్మాణం పౌరుల మెదడు లు ,కండరాలతో జరగాలి . 

పౌరుడు వంతెనను తప్పక తనదిగా చేసుకోవాలి అప్పుడే,అప్పుడు మాత్రమే ,అన్నిటిని సాధించగలం .. 

జాతీయవాదం ఒక రాజకీయ సిద్ధాంతమో ,ఒక కార్యక్రమమొ కాదు మనం మన దేశాన్ని నిజంగా తిరోగమనం ,నిష్క్రియా పరత్వాల నుండి లేదా కుప్పకూలిపోవడం నుండి కాపాడాలనుకుంటే వీలైనంత త్వరగా జాతీయ చైతన్యం నుండి సామాజిక రాజకీయ చైతన్యానికి  మరలాలి . 

పేజీ నెంబర్ .. 212; 

మానవాళి విముక్తి కోసం జరుగుతున్న నిజమైన పోరాటం పై ఈ రోజు సామ్రాజ్య వాదం యుద్ధం చేస్తోంది . అది అక్కడక్కడా వినాశనబీజాలు నాటుతుంది . వాటిని మన నేల నుండి ,మన మనుసుల నుండి నిర్దాక్షిణ్యంగా పీకి పారేయాలి . 

ప్రతి కూలమైన ,పాలించ వీలు కాని  .మౌలికంగా తిరగబడే "ప్రకృతి " వలస దేశాల్లోని అడవి ,దోమలు ,స్థానికులు ,రోగాలకు పర్యాయ పదమే . మచ్చిక కాని  ఈ ప్రకృతిని ఒక్క సారి నియంత్రణ లోకి తీసుకు రాగలిగితే  వలసవాదం విజయవంతం అయినట్టే ,, అడవుల గుండా రోడ్లు వేయటం ,మడ భూముల నుండి నీళ్లు తోడేయటం ,స్థానిక ప్రజల ఆర్ధిక ,రాజకీయ అస్థిత్వాన్ని గుర్తించ నిరాకరించటం - ఇవన్నీ ఒకటే . 


#############












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి