7, నవంబర్ 2022, సోమవారం

 నన్ను వెంటాడిన హీరో .. మునీర్ 


ఒక మిత్రుడి నాన్న గారి జీవితకథ పుస్తకం పూర్తయ్యేసరికి నాలో నన్ను చూసుకొనే నా ఊరు మందమర్రి,నేను ఎరిగిన మనిషి మునీర్ గురుంచి కూడా రాయగలననే నమ్మకం కుదురుకుంది . అప్పుడే మనుసులో బుక్ పేరు కూడా పెట్టేసు కున్నాను . ఆ తర్వాత అతడికి ఆ విషయం కూడా చెప్పేసేనను దాచుకునే ఓపిక లేక .. అతను నవ్వేసి ఊరుకున్నాడు . 

"మనదమర్రి ముఖ చిత్రం -మునీర్ "పుస్తకం పేరు . మిత్రుడు రామ్మూర్తి ఎప్పటిలాగే ముందు పడ్డాడు . అది ఒక ముందడుగు . అంతకు ముందు చాలా వెనకడుగులు పడ్డాయి . అందుకే దీన్ని ప్రస్తావించడం .. 

ఇక మునీర్ విషయం లోకి వద్దాం . 

ఇంతకీ నువ్వెవరి వయ్య ఇంత లావు మాట్లాడుతున్నావు ?

నా పేరు వెంకట్రావు . మా నాన్న పేరు సాహెబ్ .. మాది మందమర్రే . నేను ఇక్కడే చదువు కున్నాను. ప్రస్తుతం ఉద్యోగం హైదరాబాద్ లోనే . ఇక మిగిలిన విషయాలు మాటల మధ్యలో చెప్పుకొందాము . 

మునీర్ .. నన్నెప్పుడు అబ్బురపరుస్తూనే ఉండే వాడు . నేను అతన్ని ప్రైమరీ స్కూల్(కార్మెల్ స్కూల్) నుంచి ఎరుగుదును . నేను అతనికి తెలియదు . నాకు మూడు ఏండ్లు సీనియర్ . మునీర్ తమ్ముడు మొయినుద్దీన్ నా క్లాస్ మెట్ . 

మందమర్రి కాలరీస్ ప్రాంతం లో అప్పటికి రెండే పెద్ద స్కూల్స్ . ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ .. దీన్నీ ఒర్రెగడ్డ బడి అనేవారు . ఒర్రె అంటే చిన్న కాలువ .. దాన్ని దాటి వెళ్ళాలి బడికి . వర్షాకాలం వరదొస్తే బడికి సెలవే . 

ఊరిచివర దొరగారి  శ్రీకృష్ణ టాకీస్ .. 

ఇంకోటి .. కార్మెల్ స్కూల్ .. క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళది . కేరళ సిస్టర్స్ (Nuns ),లోకల్ టీచర్స్ కలిసి చదువు చెప్పేవారు . 7 వ తరగతి వరకే ఉండేది . 

సింగరేణి కంపెనీ వారిస్థలంలోనే ఉండేది ఈ స్కూల్ . వెనకే అరకి లో మీటర్ దూరంలో బొగ్గుగని ఉండేది . కల్యాణి ఖని 5 అని పిలిచేవారు .,బొగ్గురవాణాకి రైల్వే లైన్ కూడా ఉండేది . బొగ్గు కుప్పలా మధ్య ఈ స్కూల్ ఉండేది . స్కూల్ ముందు బొగ్గు లారీలు వెళ్లేందుకు తారు రోడ్డు ఉండేది 

మునీర్ ఏడవ  తరగతి లో ఉన్నప్పుడే అనుకుంట .. స్కూల్ ముందు ఉండే  ఆ తార్రో డ్డు మీద ఎవరితోనో గొడవ పడ్డాడు . కంపాస్ బాక్స్ లో ఉండే స్టీల్ డివైడర్ తో పొడుచుకున్నారు . అది నాకు మునీర్ తొలి జ్యాపకం . 

మనిషి బలిష్టంగా ఉండేవాడు .. మరీ అంత పొడుగు గాక పోయినా పొట్టి కూడా కాదు . ఆ గొడవల్లో రక్తాలు కారాయి .. కల బడ్డారు. గాయపడ్డారు . అలా గొడవల ద్వారా గుర్తుండిపోయిన మనిషి జీవితమంతా ఆయన మీద దాడులు , ఆయనకి దగ్గరగా తెలిసిన కార్మికనాయకుల హత్యలు ,చివరకు ఆయనే మందమర్రి భూస్వామి హత్యా కేసు లో ఇరుక్కొని జైలు జీవితం .. ఇలా ఒక ఆంగ్రీ హీరో సినిమా కథ లాంటి మలుపులు .. 

ఇంత జరిగాక ఎవరైనా సరే శేష జీవితం ప్రశాంతంగా గడిపేస్తారని అనుకుంటుంటారు .కానీ అలా ఏమి జరగక పోగా కంపెనీలో తన ఉద్యోగం చేసుకుంటూనే ,జర్నలిస్ట్ గా కొనసాగాడు .. ఆ తర్వాత తెలాంగాణ ఉదయమం లోను పెద్ద పాత్రే నిర్వహించాడు . 

తనను తాను ఎప్పుడు ఎదిగించుకుంటూ , సమకాలీన విషయాల పట్ల క్కూడా తెలివిడిగా ఉంటూ జీవితం లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్లే మునీర్ మన తరానికి, ముందుతరాలకు కూడా   ఒక రోల్ మోడల్ అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు..  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి