ఏది నిట్టనిలువుగా చీలదు
ఏది నిట్ట నిలువుగా చీలదు
నువ్వో వైపు..
నేనో వైపు ..
నిరంతరం చలనంలో వుంటాం..
తిరిగి తిరిగి కలుస్తుంటాం..
సునామిలు చెలరేగినా సముద్రము
చీలిపోదు..
భూకంపాలు వచ్చినా భూగోళం
ముక్కలవదు
అవిశ్రాంత పోరాటం నిలబెట్టిన
అపురూప జీవాలం... మనుషులం
మన ఐక్యత లో సమాజాలు నిలిచాయి
నాగరికతలు రూపు దిద్దుకున్నాయి
ఘర్షణతో ముందుకే నడిచాయి
అంతే కాని. .
మనిషెప్పడు భయంతో చెదరిపోలేదు
స్వార్థ చింతన తో చీలిపోలేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి