#మునీర్
ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం .. నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం .. అంటాడు మహాకవి శ్రీ శ్రీ ..
కానీ కార్మికోద్యమ చరిత్ర దానికి మినహాయుంపు .. క్రీ .శ . 871 లో కొద్దిరోజులే నిలిచినా పారిస్ కమ్యూన్ ,ఆ తర్వాత చికాగాలో క్రీ .శ .1886 లో మేడే పోరాటం .. ఆ స్ఫూర్తి తో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కార్మిక వర్గ విప్లవాల చరిత్ర పెట్టుబడిని ఇప్పటికి భయపెడుతూనే వుంది . విశ్వవ్యాప్తం అయిన సోసిలిస్ట్ భావనలు మనిషిని బానిసత్వం నుంచి విముక్తం అయ్యేటందుకు ప్రేరేపించాయి .
వలసల తో ,సాంమ్రాజ్యవాదం తో ప్రపంచాన్ని పంచుకు తిన్న పెట్టుబడి , సంకోషభాలలో మునిగి తేలుతూ ప్రపంచీకరణ ఫాసిస్ట్ విధానాలతో ఇప్పుడు ప్రజలు శత్రువు గా నిలబడింది .
ఇవ్వాళ రెండే రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిపోయింది . రాజ్యాధికారాన్ని గుప్పిట పెట్టుకున్న
గుప్పెడు దోపిడీ వర్గాలు . ప్రపంచ మానవాళి కనీస అవసరాల కోసం ,సాధించుకొన్న హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గం .
దోపిడీ గుట్టు విప్పి చెప్పిన మార్క్సిజం వెలుగులో కార్మికోద్యమ చరిత్ర కొత్త పుంతలు తొక్కింది ..
మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులు ;లెనిన్ ,స్టాలిన్,మావో ల బాటలో అనేక విజయాలు సాధిస్తున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి