జైలు గది ఆత్మ
రెండు ఇనుప చువ్వల్ని
రెండు చేతులా బిగించి పట్టుకొని
తల ఒక్కటి ని
బయట పడేయాలని అనుకుంటాను
అప్పటికే మూడు ముక్కలుగా
విడగొట్టబడిన నా తల
రెండు ఇనుప చువ్వల మధ్య
ఇరుక్కుపోయిన ముఖ చిత్రమవుతుంది
రెండు కళ్ళను కలుపుకుంటూ
కంటిచూపు ఒక్కటే
బందిఖానాను బద్దలు కొడుతూ
కనుచూపు దూరాన్ని అధిగమిస్తుంది
నిలువెత్తు గోడల్ని దూకలేని
రెండు పాదాల నిస్సత్తువ మీద
నా కంటి చూపుకి ఎప్పుడూ
ఈసడింపే ..
నిప్పులగుండం అంత కోపం కూడా
నా స్వేచ్ఛా పరిధి
నీ ముక్కు కొస వరకేనని
ము ళ్ళ కంచెలు లేస్తాయి
జైళ్లు నోరు తెరుచుకుంటాయి
మనిషి గొంతు చుట్టూ
చచ్చిన శవం చేతులు
రెండు బిగుసుకుంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి