తెరిపి
ఇప్పుడిప్పుడే వాన ..'కొట్టి
వెళ్లినట్టుంది
అప్పుడప్పుడు నువ్వు మందలించినట్టు
గట్టిగాపక్షుల కోలాహలం
చిన్నపిల్లలు గుక్క పెట్టి ఏడ్చినట్టు..
దెబ్బకి ఆకాశం సర్దుకున్నట్టుంది
తెల్లగా పాలిపోయి వుంది
ఎవరో ఇంకా తడిసిన బట్టల్ని
ఆరబెట్టుకున్నట్టే వుంది తడి ఆరని గాలిలో..
బహుశా ఇది ముసురు లో
తెరిపి కాబోలు
ఒకటొక్కటిగా మేఘాలు మళ్ళీ కూడుకొంటున్నాయి
[9:10 am, 30/08/2022]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి