కుటుంబం x సమాజం
పురుషులందు పుణ్య పురుషులు వేరయా ..
పితృ స్వామిక సమాజం లోనూ మగవాళ్ళ మధ్య సమానత్వం లేదు ..
పాపపుణ్యాలను నమ్మని వారు .. మనిషి చైతన్యాన్ని పరిగణ లోకి తీసుకునే వారు
పైన చెప్పిన వేమన పద్య చరణాన్ని .. మనుషులందు పోరాడే మనుషులు వేరయా .. అని మార్చుకోవచ్చు ..
పోరాడే మనుషుల్లోను రూపం ,సారం అనే సమస్య ఒకటి ఉంటుంది .
పైకి కనిపించే రూపం లో మునీర్ ఒక పోస్టర్ బాయ్ .. ఉవ్వెత్తున లేచి పడే సింగరేణి కార్మిక వర్గ చైతన్యానికి ఒక ప్రతీక .
సారం లో మనలాంటి మామూలు మనిషే ..
కాని , మన చుట్టూ ఆవరించి వున్న సామాజిక చట్రం లోనే కుటుంబ బాధ్యతలను నిర్వరిస్తూ ,తన చైతన్యం తాలూకు అభిప్రాయాలను ,ఆలోచనలను వదిలిపెట్టకుండా తన మత అస్థిత్వాన్ని గౌరవిస్తూనే సామాజిక బాధ్యతల పట్ల ఒక ఎరుక కలిగి ఉండడం.. ఒక గొప్ప విషయం .. అది మనకు మునీర్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది .
చాలా మంది ఒక సామాజిక మార్పు కోసం నిలబడాల్సి వచ్చినపుడల్లా కుటుంబాన్ని ,సమాజాన్ని ఎదురెదురుగా నిలబెట్టి , కుటుంబాన్నే ఎంచుకొని ఒక రక్షణ లో ఇమిడి పోవడానికి సిద్దపడిపోతారు .
ఇక్కడ మునీర్ ఆ మూస పోసిన విధానాలను బద్దలు కొడతాడు .తనతో పాటు ఏ మేరకు వీలు అయితే ఆ మేరకు తన కుటుంబాన్ని వెంట తీసుకునే తాను పోరాటానికి సిద్ధపడతాడు . ఇది మనం అందరం మునీర్ నుండి నేర్చుకునే పాఠమే ..
నిజంగా పోరాడే భావాలే మనలో ఉంటే ,దానికి ఏవి అడ్డు నిలబడ లేవు . తమ నిజాయితీ పట్ల నమ్మకం ఉన్న వారెవరిని ,కుటుంబ సభ్యులు సైతం వారి ఆచరణ నుండి నిలువరించ లేరు .ఈ విషయాన్ని మునీర్ అతి సునాయాసంగా చేసి చూపిస్తున్నాడు . అతడు ఒక సజీవ ఉదాహరణ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి