9, జులై 2013, మంగళవారం

కామ్రేడ్ గంటి ప్రసాదం కోసం ...

కామ్రేడ్ గంటి ప్రసాదం  కోసం ...ఎంతో ప్రేమగా 

 

 

 

"Already plenty of water flown under the bridge ",బాగా నలిగిన అంశం గురుంచి తను వాడే ఇంగ్లిష్ నుడికారం అది. ఇప్పుడు బాగా నలిగిన రాజ్యాంగంలో ప్రజల రక్తమే ఏరులై ప్రవహిస్తుంది . కొబ్రాలో ,కిరాయి హంతక ముటా లో ;అడవిలోంచి 'గ్రీన్ హంట్ 'నగర వీధుల్లోకి వచినట్టుంది . నెల్లూరు నడిరోడ్డు మీద నిరాయుధుడైన గంటి ప్రసాదాన్ని వేటకొడవలితో ,తపంచాతో ,తు పాకీ తో హత్య చెయ్యడం ఇది తుపాకీ రాజ్యమే అని ప్రభుత్వమే ప్రకటించుకున్నట్టైంది  . తన వికృత స్వరూపాన్ని తనే బయటపెట్టుకున్న రాజ్యం తీరుని మనం మరింత స్పష్టం గా అర్థమ్ చేసుకోవాల్సిన తరుణం ఇది. 'తీరు ' అనే పదాన్ని కూడా సార్  ఎక్కువగా వాడే వాడు . సీకాకులం వీరుడు కదా!
   అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగిన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచినట్టని గాంధీజీ అన్నాడని చెపుతుంటా రు . మరి హక్కుల కార్యకర్తలని పట్టపగలే నడివీదుల్లో నరికేస్తుంటే ఈ దేశంలోఇంకా  ఏమీ మిగిలి వున్నట్టు ?
ఈ విషా యలన్ని సార్  కి తెలుసు . అందుకే ఈ దుర్మార్గ వ్యవస్తని కూల్చి ,మనిషి మనిషి గా మనగలిగే సుందరప్రపంచం కోసం త పించాడు . ఆ తపనే జీవితంగా జీవించాడు .నిండైన  మనిషిగా బ్రతికాడు . 
      ప్రొఫెసర్ హరగోపాల్ గారు 'నివాళి' లో గుర్తుచేసినట్టు ,సార్  కాఫీ పెట్టటడం లో దిట్ట అని ప్రకటించు కోవడమే కాదు  కమ్మని కాఫీ లాంటి జీవితం గురుంచి కబురులెన్నో చెప్పేవాడు . నా మొదటి పరిచయం కూడా అదే ఘట్టం . నా సమస్య ద్వారా సార్  పరిచయం లోకి వెళ్ళాను .నా బలహీనతలని అర్థం చే సుకో వడమే గాక నా బలం ఏంటో విడమరచి చెప్పేవాడు . సార్ ప్రతి సమస్యను వెంటనే 'క్లించ్ ' (పరిష్కరించడం )చేయాలనీ ఆశ పడే వాడు .కాని కొన్ని సమస్యలు విప్లవం లాగే ధీర్గకాలిక పోరాటాలుగా మిగిలిపోయేవి . 
సార్ కి నశం (ముక్కుపొడి )అలవాటు .చిన్న  చిన్న డబ్బాల్లో దొరికే వి. తనకోసం ఒకటి, రెండు సార్లు తెచిపెట్టా ,ఎంతో ప్రేమగా . నశం అలవాటు మానినట్టు లేదు సార్ చివరి వరకు . 
      ఎన్నిసార్లో బండిమీద తిరిగాం .కూడళ్ళలో  కలిసాం . హోటల్ లో టీ త్రాగా o ,కబుర్లు చెప్పుకుంటూ .. అదొక జలపాత హోరు . ఆ క్షణాలన్నీ అగ్నికణాలుగానే వుండేవి ,అద్బుతంగాను తోచేవి . మనసు విప్పి మాట్లాడుకొనే సాయంకాలం నడక అది. 
     అతని హత్య తాలుకు పొటోలు పేపర్లలో చూసే వుంటారు . 'తాలుకు' అనే పదం కూడా సర్ ఎక్కువగా వాడేవారు . ఆ ఫోటోలలో రోడ్డుపై పడిపో యు న సర్ కళ్ళజోడు చూస్తే  'ఒమర్ ముక్తార్ 'సినిమా గుర్తొచ్చింది . ఒమర్ ముక్తార్ ని ఉరి తీసినప్పుడు అతని కళ్ళజోడు క్రింద పడిపోతుంది .దాన్ని ఒక సిన్నపిల్లగాడు తీసుకొని తన కళ్ళకు  పెట్టుకుంటాడు . అదే ఆ సినిమా ముగింపు .కామ్రేడ్ గంటి ప్రసాదం ఓమర్ ముక్తార్ లాగా మహోపాధ్యా యుడే కాదు మార్కిస్ట్ మేధావి కూడా !

.