13, జనవరి 2023, శుక్రవారం

వసుదేంద్ర *తేజో తుంగభద్ర 



ఈ నవలలో కథానాయిక బెల్లా .. పోర్చుగల్ లో ని తేజో నదీ తీరం లో మనతో ప్రేమలో పడుతుంది . 

బెల్లాకి అతడ్ని ఎలా ఓదార్చాలో తోచలేదు . 

"మాటలు విఫలమైనప్పుడు మౌనమే మన శక్తి కావాలి "

మృదువుగా తన రెండు అర చేతులను రుద్ది అతని కళ్ళ మీద పెట్టింది . గేబ్రియల్ (హీరో )దీర్ఘంగా ఊపిరి పీల్చాడు . తర్వాత అతని రెండు చేతులను తానే తీసుకొని , వాటిని రుద్ది  తన కళ్ళకు ఒత్తుకుంది . అతని ఆ అరచేతుల వెచ్చదనం లో జగత్తులోని సమస్త ప్రశ్నలకు జవాబులు ఉన్నాయనిపించింది .. 

ఇవి..  పుస్తకం లోని వాక్యాలే . 

ఇదే రచయిత చేసిన మేజిక్ . 

బెల్లా తండ్రి మాట కోసం మనమూ  భారత్ కు సముద్ర ప్రయాణం  చేస్తాం .

తుంగభద్రా నదీ తీరం లో సతీ సహగమనం దాకా వెళ్లిన  హంపక్క జీవితం తో కలిసి నడుస్తాం . 

మనిషి బ్రతుకు లో అధికారం తో అంట కాగే మతం ,ఆర్థికం రేపే ' చిచ్చు' ని అద్భుతంగా చరిత్రలో భాగంగా చెప్పగలగడం ఈ నవల  ప్రత్యేకత .