అర్బన్ నక్సల్
1
వడివడిగా అంగలే వేసానో
ఒక వేడి సెగ లో దూరం ఎగిరిపడ్డానో
చాలా ముందుకే వెళ్ళిపోయాను
ఇప్పుడు నీకోసమే వెనక్కి రాలేను
నా వెనక వెనకే అయినా నువ్వే
కదిలి రావాలి కాని..
నీ చెయ్యు పట్టి నేను నడవలేను
వెలుగు వెంట సాగే నా నీడ దారినైనా
నువ్వే నడిచి రావాలి కాని..
ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్ప
నీ కళాత్మక లోకం కానరాదు నాకు
అవును..
నా దృష్టిలో స్పష్టమైన తేడా
కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది
దప్పిక ఎరగని ఒంటెద్దు పోకడ
ఏకాకి ఎడారి ఓడ ప్రయాణం
ఇప్పుడు నీతో సమానంగా నేను నడవలేను
2
నా కలల ప్రపంచం మీదికి రాయి వేయకుండా
వాడికి .. అవును ..వాడికే ..రోజు గడవదు
వసంతాన్ని వాగ్దానం చేసిన ప్రతి పువ్వును
తెంపకుంటే వాడికి అస్సలు నిద్ర పట్టదు
తెగిపడ్డ పువ్వుల రక్తం అత్తరు
వాడికి .. వాడి పాడుబడ్డ లోకానికి...
కుళ్ళి కంపుకొట్టే ఈ వాసన
అలవాటు లేక నాలాగే
నువ్వూ ముక్కు మూసుకుంటావ్
అప్పుడే దొరికిపోతావ్ నువ్వు..
అర్బన్ నక్సల్ ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి