21, నవంబర్ 2022, సోమవారం

 జీవితం చిన్నదే కదా !

 -----------------------------

 చీకటి వెలుగుల్ని తోసుకుంటూ 

తన చుట్టూ తనే భ్రమించే 

భూగోళం బుగ్గపై గిల్లి చూస్తాను 

నువ్వు .. నిజమా .. కల .. అని 


ఆ మాత్రం దానికే ఎక్కడో చిల్లు పడి 

జ్ఞాపకాల ప్రవాహం జారీ పడి .. 

చలికాలం నిద్ర ముసుగు తొలిగి పోతుంది 


కొండల్లో పాతుకు  పోయిన చెట్టు మొదలు 

జారిగిల పడ్డ ప్రయాస .. 

ఇంకా కండ్లు మూసుకొనే నీ చేతి లో చేయు వేసి నడుస్తూ వుంది 

వెతుకులాట విస్తీర్ణం ఎప్పుడూ కనుచూపు మేరలు దాటుతూనే ఉంటుంది 


పువ్వు లు పూసి మొక్కలు సిగ్గు పడుతుంటాయి 

బాటసారి పాదాల పగిలిపోని బొబ్బలు చూసి .. 


గొప్పలు కాక పోతే జీవితం ఏమంత గొప్పది 

గుప్పెడు గుండె లో ఇమిడిపోయే 

పిడికెడు ప్రేమకు బానిస .. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి