26, ఫిబ్రవరి 2013, మంగళవారం

బుద్దు

 బుద్దు 

నన్నేక్కడో కోల్పోయునట్లు 

నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను 

నీ హృదయం విశాలం 

నన్ను పసిపాప ను చేసి 

నీ చిటికన వేలుతో నడిపించావు 

నడిచినంతమేరా నీ వెలుగులే 
 
నువ్వలా వెనుదిరుగకుండా సాగి పోతూ నే వున్నావు 

నేను ఒక ఇంద్రధనస్సు చూస్తూ అలా  నిలబడిపోయాను 

ఆ తర్వాత  నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .

 అదే స్ఫూర్తి 

ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను  

అయితే నీలా    చందమామ కబుర్లు చెబుతూ 

అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?

ఎప్పటికీ  బుద్దు లానే  నీ వెంటే నడవాలనే 

ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే .... 









ఏకాంతాల గుండెకోత

ఏకాంతాల గుండెకోత 

ఇది వలపో ,నీ తలపో 

కనుపాపలు చేష్టలుడిగిపొయు 

కన్నీటి నీడల్లో సేదతీరే  వేళ 

నీ రూపమేదీ  కనిపించదు  

నీ ఆత్మీయ స్పర్శ ఏదో చిరుగాలి లా 

నా నుదుటిని  ముద్దాడిన వేళా 

ఏకాంతాల గుండెకోత . 

23, ఫిబ్రవరి 2013, శనివారం

కోనసీమ.. 
అది ఆకుపచ్చని   పైట 
దీన్ని  వలచని వాడు చవట  
అలాగని 
ఎడారి లో అందం లేదని చెప్పలేను 

అదొక అద్బుతం అంతే !

 కాని
ఈ సీమ ,

అమృతం కురిసిన రాత్రి 

ఒక కవి తలపోత. 

ఈ కోనలో  వెన్నెల అమృతమే మరి!

అనకొండల్లా మెరిసే నీటి కాలవలు 

అనంతమైన ఆకాశాన్ని కమ్మేసే 

కొబ్బరాకుల అతిశయం 

భూ గోళాన్ని పచ్చని చాపలా చుట్టేసే 


వరి పొలాల వెర్రి 

అక్కడి ప్రజల యాస 

'ఆయ్ '

అంతే ఇది గా వెటకారం  

నవ్వుల పువ్వులు పూయా ల్సిందే

పగిలిన  గుండెలు అతకాల్సిందే 

అది మరీ కోనసీమంటే !

ఎప్పుడూ  ఉతికి ఆరేసిన కొత్త చీర లాంటి మెరుపు 

ఆ ప్రకృతిలో ,ఆ పలుకుల్లో 

స్వర్గానికి ఇక ఇంకో మెట్టే లే అని మురిపించే 

కాలవ గట్లు 

కడలిని చేరుకొనే హడావిడి లో 

గోదారి చిట్ట చివరి అడుగు 

ఈ  కోనసీమ . 


























 నమ్మకం 



చీకటి అంచున నిలబడి ఎంత గాఢo గా కళ్ళుమూసుకొని 

నిడురపోతానో !

నిన్నటి మీద నమ్మకమో ,

లేదా  

దేన్నైనా సరే ఎదురుకొవాల నే 

నువ్వు నేర్పిన  ధైర్యమో  కాని 

నీ ప్రేమ నిoపుకున్న  కళ్ళు 

నీ వెతుకులాట లోనే తెల్లారిపోతాయు .