కవి బాధ
ఒక బాధ లో నుంచి
కాలు కదప లేని మరో బరువు లోకి
కూరుకు పోతాను నిరంతరాయంగా
పాపం బరువు ! సిగ్గు విడిచి
సాయం కోసం దిక్కులు చూస్తుంది
అయితే దిక్కుమాలిన ఆ దిక్కుల
చూపుల్ని భరించడం కష్టమై పోతుంది
ఎప్పటిలాగే కాలం .. గట్టు మీద కూర్చుండి తమాషా చూస్తుంది
గట్టిగా కళ్ళు మూసుకొని బాధ
అంతటి బరువు తోనే కవిత్వం లోకి దూకేస్తోంది
కవిత్వం ఒక సముద్రం
అది మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది
అందుకే ఇప్పటికీ ఏ కవి బాధా తీరినట్టు దాఖలా లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి