ఆకు పచ్చ అద్భుతం
అందం ..ఆకు అయితే
అది ఖచ్చితంగా కొబ్బరి చెట్టే..
నాచుట్టూ ఆకు పచ్చని అందాలు
భక్తి పారవశ్యం తో
గుడి లాగా ముసురుకున్నాయి
ఆకాశానికి నాకు మధ్య
ఇక ఏమీ లేదు
దట్టమైన పచ్చని పొగమంచు
కొప్పున పూల దండ ముడిచినట్టు
చేతుల్లాంటి ఆకులు తొడుక్కుని
కంటి చూపు తో మాటలు కలిపే యాస
ఎవరైనా సరే ..ఏదైనా సరే
ఆకాశాన్ని కమ్మేసే తన నీడ నుంచి
తప్పుకు పోవడం కష్టం
చెట్లలో జిరాఫీ
కోనసీమ కొబ్బరి చెట్టు
ఒక్క గుత్తి లోంచే విచ్చుకునే
చిక్కనై విశాల ప్రపంచం
కొబ్బరి తోట వర్షం లో
మనమంతా ఆకుపచ్చని గొడుగులం
నిండైన వరద మట్టిలోంచి
తోడిపెట్టిన తడియారని అందం
తనివితీరని గుండె తన్లాటకి
కోనసీమ కొబ్బరాకు చందనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి