పోస్టర్ బాయ్ ..
***********
ప్రపంచీకరణ యుగం లో యువతరం అంతా ఇష్టపడే విప్లవ ముఖ చిత్రం చేగువేరా ,,
దేశభక్తి ముసుగు ని చించి ,దేశాల సరిహద్దులు చెరిపేసి విప్లవాలు నడిపిన చేగువేరా ఇంతగా అందరిని ఆకర్షించడం లో రాజకీయాలు ఏమి వున్నా మనిషి ఒక సత్యానికి దూరం గా బ్రతకలేడ నే విషయం ఇక్కడ వెల్లడవుతుంది .
భారత విప్లవ ముఖ చిత్రం .. భగత్ సింగ్
కరెన్సీ నోట్ల మీద , కోర్టు గదుల్లోను గాంథి మహాత్ముడే ఉండొచ్చు .. స్వాతంత్రం తెచ్చాడని అతనికి ప్రతి ఏడు హారతులు పడుతూ ఉండొచ్చు .. కానీ నిఖార్సయిన విప్లవ కారుడిగా భగత్ సింగ్ పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది .
తెలుగు నాట జార్జి రెడ్డి పేరు అలాగే గుర్తు చేసుకుంటాము
వాళ్ళే మొత్తంగా సమాజం లో మార్పులకు కారకులు అని కాదు కానీ వాళ్ళు మన హృదయాల్లో ప్రతీకలుగా మిగిలిపోయారు .
..
ఈ భూగోళం మీద ఒక చెమట చుక్క .. ఒక నెత్తు టి బిందువు లాంటి మనం పుట్టిన ఊర్లు ఉంటాయి . ఆ ఊరు పేరు నిలబెట్టే మనుషులు ఉంటారు ..
సింగరేణి బొగ్గు గని ప్రాంతమైన మందమర్రిలో మునీర్ అనే వ్యక్తి ఒక సమూహం .. ఒక ముఖ చిత్రం .. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే .. పోస్టర్ బాయ్ ..
మా తరానికి 1980 దశకం లో .. ఆ పేరు ఒక్కటే చాలు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి