పసిపాప
ఎంత కాలాన్ని గంటలు గంటలు గా చుట్టి
దారి తప్పకుండ నిలబెట్టావో !
కాలానికి పెద్ద పెద్ద చెవులు కుట్టి
ఎన్నెన్ని మాటలు కుక్కావో !
అలా కాదేమో ...
మాటలకే మాటలు నేర్పి
మాటల కోట కట్టావేమో !
అది సరిపోదేమో ..
బహుశా ఈ లోకానికి
ఇంకా అనుభవం లోకి రాని
మాటల నాగరికత ను
ఆవిష్కరించావని నాకు తోస్తుంది
ఇవన్నీ నీకు తెలియదులే ..
జీవితం లోతుల్లోకి కండ్లు పెట్టి చూసి
రెండు కాళ్ళ తోనే కాదు
చేతుల్ని నిలబెట్టుకుంటూ
నువ్వు చేసే ప్రయాణా న్నీ
నేను ఒక్కడినే కనిపెడతాను
అందరు సగం కాలిన
ఆశల హారాలను మెడలో వేసుకొని
పతకాల కోసం పరుగెడుతున్న వాళ్ళే ..
నువ్వెంటో మరి ..
ఆకాశాన్నే ఆశను చేసి ..
'కొండెక్కి రావే ..
గోగుపూలు తేవే .. అని
లాలిపాటలు పాడుతావు
బుడి బుడి అడుగులు వేస్తూ
నీ అనురాగమే పసిపాపలా
అలవోకగా నీ ఒడిలోకి
నడిచి వస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి