22, నవంబర్ 2022, మంగళవారం

#muneer 4

 నదీ పరివాహక ప్రాంతం లోనే  మొదట మనిషి బ్రతికి బట్ట కట్టింది .. ఆ తర్వాత నీటి చెలిమల్ని కనిపెట్టి ఉంటారు . మెల్లిగా నీళ్లబావి తవ్వుకోవడం నేర్చుకొని ఉంటారు  .. 

పారిశ్రామిక విప్లవం బద్దలయ్యేంతవరకు మానవ నాగరికత నీళ్ల  బావి చుట్టే తిరిగింది . అంట రాని  తనం పురుడు పోసుకున్న మన దేశం లో కొన్ని కులాలకు మంచి నీళ్ల బావి నిషిద్ధమైంది 


ప్రపంచవ్యాప్తంగా ఈ నదీ తీరప్రాంతాలలోనే బొగ్గు నిల్వలు బయట పడ్డాయి . గనులు తవ్వారు. వాటిని వాడుక భాష లో బొగ్గుబావులే అనేవారు . ఆ తరవాత పెట్రోల్ బావులు వచ్చాయి .  ఎవరికి  వాళ్ళు  వారి  అవసరాన్ని బట్టి వాడుకొనేవి నీళ్లు . కాబట్టి మంచినీళ్ల బావులు ఊరు  వాడ కి లేదా  ..కొన్నిచోట్ల దొరలకి సంబంధినవి గా ఉండేవి . 

మన దేశం లో మంచి నీటి కోసం యుద్దాలు కూడా జరిగాయి . 

ఒక వైపు మంచి నీళ్ల బావుల కోసం ఇలాంటి పరిస్థితులు ఉండగా ,ఖండాలు దాటి వచ్చిన తెల్లవాడు బొగ్గు బాయలు తవ్వాడు . మంచి నీటి లాగ అది ప్రకృతి సంపదే .. కానీ దాని మీద అధికారం వాడిదయ్యింది . వాడి రాజ్యాధికారం వందల ఏండ్లు అపప్రతిహతం గా కొనసాగడానికి అది ఇంధనమైంది . ఇలా ప్రకృతి సంపదల మీద వారి ఏకఛత్రాధిపత్యం ఇవ్వాళ ప్రపంచ పర్యావరణాన్ని సంక్షోభం లో పడ  వేసింది. 

మానవాళి అభివృద్ధి పేరు చెప్పి వారి అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు విచ్చల విడిగా మిలటరీ అవసరాల కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఒక పరిశోధన లో వెల్లడైనది . 

ప్రజా అవసరాలకే అయితే ఇంత ఇబ్బడిముబ్బడిగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు తవ్వి ,మరింతగా కాలుష్యాన్ని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేదు . పెట్టుబడి దారుల లాభాపేక్షకు అంతం లేదు . ప్రపంచాన్ని మొత్తం భయం అంచున నిలబెడతారు . అభివృద్ధి యజ్ఞం లో ప్రజలను బలిపశువులను చేస్తారు .   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి