సలికాలం ..
లే లేత ఆకు పచ్చ అందాల్ని
అరచేతుల్లో మోసుకు వస్తున్నట్టు
ఎండ .. ఎంత అద్భుతం గా వుందో !
ఇన్నాళ్లు ఇంత అందాన్ని
ఎక్కడ దాచావే .. అని ముద్దుగా
ఎండ చెవి మెలిపెడదామంటే
అప్పటికే ఎండ చురుక్కుమంటుంది
పోనీ .. నీడలో సేద తీరుదామంటే
చల్లగాలి అణుకువగా ఎండ లోకి తోస్తుంది
చలికాలం మొదట్లో ఇంతేనట ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి