14, మార్చి 2022, సోమవారం

నువ్వే

 నువ్వే


ఈ కంటి చూపు ను మింగేస్తూ 

ఎన్ని చిత్ర విచిత్ర చిత్రాలో కళ్లెదుటే 

నిన్ను కన్నుల నిండుగా చూడనీయకుండా


చివరికి -

నీ జాడ కోసం చీకటిని

వేడుకొంటాను

దాని కరుణా కటాక్ష మెమో

అప్పుడప్పుడు వెన్నెలవై

వస్తుంటావ్ నీవే..


ఇన్ని అఖండ భావనలు

నిన్ను పోల్చుకోలేనప్పుడు

నువ్వు ఇక్కడే ఎక్కడో

ఉన్నావనుకోవడం ఒక భ్రమ

ఎక్కడా ఉండే అవకాశమే లేదనుకోవడం

నువ్వు నేర్పని నిరాసక్తత 


నిన్నలా ఆకాశం వెంబడి

చుక్కల దారిలో 

వెతుక్కుంటూ వెళ్లడమే

నువ్వు నేర్పిన ఆట


అడవి సిగలో వెన్నెల పువ్వులా

నీ నవ్వేదో నన్ను

దాటి వెళ్లదు గా ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి