మకిలి

మకిలి 
మౌనంగానే వుంటాను
మనసు లో లావా మరుగుతూనే వుంటుంది

నువ్వు రాలేనప్పటి కంటే
రాకుండా మొహం చాటేసినప్పటి భాద
అగ్నిపర్వతం లా   బద్దలవుతుంది

ఏదో , అన్నిటికి అతీతంగా
బ్రతికేయేచ్చు అనుకుంటాం బింకంగా
కాని సచ్చి బ్రతకలేము కదా !

నీ కోపానికి ఒక అర్థం వుంది
నీ పోరాటము న్యాయమే ,
నా కది ఎప్పటికి అర్థమయ్యేనో కదా !

నన్ను మలిచిన ఎంతటి
పిత్రుస్వామ్యపు మకిలిని
వదిలించుకోవాలో కదా!