8, మార్చి 2022, మంగళవారం

పచ్చని చెట్టు

 పచ్చని చెట్టు 

పార్క్ లో చల్లగాలి అని కలవరిస్తాను

కానీ అది అసలు..  చెట్టుగాలి


చల్లదనం మత్తు లో

కనిపించని గాలి పేరు 

పలవరించానే  కానీ

పచ్చని చెట్టు ను పట్టించు   కోలేదు చూడు..


ఎక్కడ వనాలు వొళ్ళు విరుచుకుంటాయో

అక్కడ పురుడు పోసుకునే  గాలి

 అలలు అలలుగా 

ఈ చెట్టును చేరింది

దేన్ని దాచుకోవడం తెలియని చెట్టు

అన్నీ మనకోసం అర్పించి

మనిషి పూజ చేసుకుంటుంది

ఎండిన ఆకుల సాక్షిగా. ..

తన నీడన పెరిగిన మనిషి 

తనను విడిచి వెళ్లాడనే దిగులు లేదు 


తలలు   తెగనరికి 

ఎండిన మోడుల మధ్య 

మనిషి కట్టే సమాధుల్ని 

చూసి కొంచెం బాధ తప్ప .. 

అడివితల్లిని మరిచినా 

పార్క్ లో చెట్టు  తల్లి 

నీడ లో సేద తీరే 

బిడ్డకు చల్లని గాలి నిచ్చి వెళుతుంది 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి