15, డిసెంబర్ 2021, బుధవారం

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు , డిసెంబర్ 13న పర్సా బొగ్గు బ్లాక్ కోసం భూసేకరణను సవాలు చేస్తూ హస్డియో అరణ్య నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ, ప్రక్రియపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

సుర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లో పడే పర్సా బొగ్గు బ్లాకుల భూసేకరణ ప్రక్రియపై యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్‌కే చంద్రవంశీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


భూసేకరణను సవాలు చేసిన ఐదుగురు పిటిషనర్లు హరిహర్‌పూర్, సాల్హి మరియు ఫతేపూర్ గ్రామాల నివాసితులు. ప్రతిపాదిత పర్సా బొగ్గు బ్లాక్ కోసం దాదాపు 1,250 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది, ఇందులో మూడింట ఒక వంతు భూమి గిరిజనులు మరియు మిగిలిన భాగం మధ్య భారతదేశంలోని అతిపెద్ద విడదీయని అడవులలో ఒకటైన హస్డియో అరణ్య అడవుల పరిధిలోకి వస్తుంది.

హస్డియో అరణ్య ప్రాంతం సుసంపన్నమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది మరియు ఏనుగులు మరియు పులులకు ప్రధాన నివాస మరియు వలస కారిడార్.


మంగళ్ సాయి, ఠాకూర్ రామ్ మరియు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ కోల్ బేరింగ్ యాక్ట్ 1957 (CBA)ని అమలు చేయడం ద్వారా పర్సా బొగ్గు బ్లాక్ కోసం భూసేకరణ ప్రక్రియను సవాలు చేసింది.

గడువులోగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో భూసేకరణపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 27న జరిగిన తుది విచారణలో ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు గతంలో ఆదేశించింది.


పిటిషనర్ల లాయర్లు ఏమి చెప్పారు?

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన SECL మరియు కంపెనీల ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించేందుకు మాత్రమే CBA ఉపయోగించబడింది. అయితే, ఈసారి RRVUNL కోసం భూమిని సేకరించేందుకు ఉపయోగించబడుతోంది, ఇది ఇప్పటికే అదానీతో ఒప్పందం కుదుర్చుకుంది, ఇది పర్సా కోల్ బ్లాక్ యొక్క మైన్ డెవలపర్ మరియు ఆపరేటర్‌గా మారింది. ఈ భూసేకరణ ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తోంది కాబట్టి CBAని ఉపయోగించలేరు.

“సముపార్జన నుండి ఆపరేషన్ వరకు గని 30 సంవత్సరాల జీవితకాలం తర్వాత మూసివేయడం వరకు ఇది PKCL/RCL AEL యాజమాన్యంలోని మరియు నియంత్రణలో ఉన్న ప్రైవేట్ కంపెనీ, ఇది భూమిని ఉపయోగిస్తుంది మరియు అటువంటి భూ సేకరణ యొక్క ప్రయోజనాలను పొందుతుంది. CB చట్టం 1957 యొక్క పథకం ప్రకారం ఇటువంటి ఏర్పాటు అనుమతించబడదు, ప్రతివాదులు భూములను సేకరించేందుకు దీనిని ఉపయోగించారు.

పిటిషన్

భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస చట్టం (RECTLARR చట్టం 2013)లో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కును అమలు చేయకపోవటం అనేది క్రూరమైనది మరియు షెడ్యూల్ చేయబడిన ప్రాంతంలోని భూ నిర్వాసితులకు అనేక హక్కులను కోల్పోతుంది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ముఖ్యంగా, వందలాది మంది ఆదివాసీలు అక్టోబర్ 13న రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు కవాతు నిర్వహించారు మరియు నకిలీ గ్రామసభల ఉదంతాలతో సహా కొనసాగుతున్న భూసేకరణ మరియు అక్రమాలకు వ్యతిరేకంగా ఉపశమనం కోరుతూ గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత అటువంటి ఫిర్యాదుల సంకలనాన్ని గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపారు. 


10, అక్టోబర్ 2021, ఆదివారం

కన్నీటి కాలం

 కన్నీటి కాలం 


కాలాన్ని ఎంత పిండుకున్నానో 

నా కన్నీటి ధారనడుగు .. 


జారిపడ్డ ప్రతి కన్నీటి బొట్టు 

కాలం ఒడిలోకే  చేరిందని చెప్పలేను 


తొక్కిపెట్టిన కన్నీరే 

మాటిమాటికి తన్నుకుంటూ వస్తుంది 


కన్నీటి ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోలేదు 

అందుకేనేమో అది అప్పుడప్పుడు 

కాలం తో  కలిసి దొంగదెబ్బ తీస్తుంది 


నేలచూపుల కన్నీటికి ఎదురుచూపులే 

నేర్పానని అనుకున్నాను 

కానీ అది అప్పుడప్పుడు చాటుగా తల తిప్పి 

పక్క చూపులు చూస్తుంది 

కాలం వేపు ఆర్తిగా .. 





బందీ



 బందీ 



కాలం నీడ  నా మీద 

గద్ద లా  కదలాడుతుంది 

నన్నుతన కాళ్ళ గోళ్ళ  మధ్య  

ఇరికించుకుని..  


నా ప్రయాణం మొత్తం 

తనే పూర్తి  చేస్తుంది 

విహంగ వీక్షణంలా .. 


లోకమంతా ఒక్క తీరుగా 

పచ్చ పచ్చ గా ఉంది 

అంతా పకడ్ బందీగాను తోస్తుంది 

కాలానికి చిక్కిన బందీకి .. 

9, అక్టోబర్ 2021, శనివారం

ఇట్లు ఒక కల

 

ఇట్లు ఒక కల 


ఏ కల చెదిరి 

నిదుర లేచినా 

కనుకొనల్లో చెమ్మ తగిలి 

రెండు చేతి వేళ్ళు 

తల్లడిల్లిపోతాయి 

నా తనువును నువ్వేదో నిమిరినట్లు .. 

యాది ..

యాది .. 


 సముద్రం నీ నవ్వు 

తీరం నువ్వు కట్టుకున్న చీర 

తిరగబడ్డ గాలి నీ కొంగు 

మొత్తంగా నువ్వలా నిలబడి పోతే 

చివరికి నీలోనూ  నేనే కనిపించాను 


నీకు గుర్తుందో లేదో కానీ 

సిగ్గుపడటం నీకే కాదు 

నాకూ  వచ్చని తెలిసిన రోజు 

మనం కలిసాం 

సిగ్గులు ముగ్గులుగానే సమయం 

తెల్లారిపోవటమూ నీకూ అనుభవమే 


సముద్రాన్ని కవిత్వ కౌగిలి లోకి లాక్కోవడం 

నిన్ను నిద్రలోనే పక్క మీద నుంచి తోసేయటం 

అలవోకగా జరిగిపోయిందని చెప్పలేను 

అలలు అలలుగా నీ కలలు చెలరేగినప్పుడు 

నీకంటే కవిత్వమే ముద్దొచ్చోదేమో కన్నుగీటి .. 

27, సెప్టెంబర్ 2021, సోమవారం

 అపవిత్ర  ఆపద్ధర్మమ్


రిపబ్లిక్ అఫ్ హిందుత్వ .. ఇంగ్లీష్ పుస్తకమే ..రచయిత బద్రి నారాయణ . పెంగ్విన్ ప్రచురణ . ప్రధమ ముద్రణ 2021 . 

మొత్తంగా బీజేపీ ని ఇప్పుడు నడిపిస్తున్న RSS  గురుంచి లోతైన అవగాహన  కల్పించే  రచన ఇది 

అయితే రచయిత ముగింపులో ఒక చివరిమాట రాశాడు . అది కరోనా సమయంలో లొక్డౌన్ వల్ల వలస కార్మికులు గురుంచి . కంపెనీలు మూసివేయటం వల్ల కాలినడకన వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్కచేయకుండా పుట్టిన గడ్డకు చేరుకోవాలనే ఎన్నో విషాద యాత్రలు జరిగాయి 

అప్పటివరకు వెర్రితలలు వేసిన హిందుత్వం మౌన ముద్రలోకి జారిపోయింది . సర్వ సత్తాక రాజ్యం చేతులు ఎత్తివేసింది . 

కష్టజీవులు అందరూ  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులేని చావుకి బలి కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్య కు చేరుకోవాలని విశ్వప్రయత్నమే చేశారు . 

మరి భారతదేశ సమాజానికి వెన్నెముక లాంటి కులం .. బ్రతికి బట్ట కట్టడమే ప్రధాన మైన కరోనా కాలంలో ఎలాంటి పాత్ర నిర్వహించింది -అనే విషయం పై రచయిత కొంత పరిశోధన చేసాడు . 

కులమతాలకు అతీతంగా ప్రజలు మానవత్వానికి పెద్ద పీట  వెయ్యడం గురుంచి మనం అందరం మీడియాలో చూసాం . 

కానీ కులం అంత ఈజీ గా రూపు మాసిపోయే వ్యవహారం కాదని మనకందరికీ తెలిసిన వ్యవహారమే కదా !

ఆపద్ధర్మమ్ గా వచ్చే మార్పులు మామూలు పరిస్థితులు నెలకొన్నాక కొనసాగవు .  

దాని గురుంచి ఉపనిషత్ ల్లోంచి ఒక కథ ని పట్టుకొస్తాడు రచయిత . 

 ఛాందోగ్య ఉపనిషత్తు లో చక్రాయన ఉసష్టి అనే వ్యక్తి .. ఈయన ఉండే ఊరిలో కరువు విలయ తాండవం చేస్తుంటుంది . వరుసగా రెండురోజులు అతడు ఆకలితో అలమటిస్తూ  ఉంటాడు  . దాంతో ఇంకో  ఊరికి వెళదామని నిర్ణయిచుకుంటాడు . అయితే ఆ ఊరిలో కూడా అదే పరిస్థితి  ఉంటుంది . అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు . దారిలో ఒక చెట్టు కింద ఒక మనిషిని చూస్తాడు . ఆ మనిషి  దేన్నో నాకుతూ తింటూ ఉంటాడు . 

ఉసష్టి అతని దగ్గరికి వెళ్లి ఏమి తింటున్నావని అడుగుతాడు . 

నేను పప్పు తింటున్నాను --అని   సమాధానం చెబుతాడు 

గత రెండు రోజులుగా ఆకలి తో అల్లాడిపోతున్న ఉసష్టి  తనకు కొంచెం పెట్టమని అడుగుతాడు . 

అయ్యో !నీకు తప్పక ఇచ్చే వాడినే  . కాని ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది . 

అపవిత్రం అయితే అయ్యిందిలే .. నాక్కొంచెం ఇమ్మని  పాపం ఉసష్టి  ప్రాధేయ పడతాడు . 

అతడు  ఉసష్టి కి తను తింటున్న పప్పులోంచి కొంచెం తీసి పెడతాడు.   

అతడి దగ్గర మట్టి కుండ నిండా మంచినీళ్లు కూడా ఉంటాయి . 

అతడు కుండకి మూతి పెట్టి కొన్ని నీళ్లు తాగి ,ఉసష్టి  కోసం కొన్ని మిగుల్చుతాడు . 

పప్పు తినేసి ఉసష్టి వెళ్లి పోవటానికి  సిద్దమవుతాడు . 

కొన్ని నీళ్లు తాగి వెళ్ళు  ! అంటాడు అతను .

దానికి సమాధానంగా -

నేను అపవిత్రమైన నీళ్లు తాగను -  అంటాడు  ఉసష్టి . 

నువ్వు  అపవిత్రమైన పప్పు తినగలిగావు .  అపవిత్రమైన నీళ్లు ఎందుకు తాగలేవు ? అని అడుగుతాడు  అతను . 

ఉసష్టి భలే సమాధానం ఇస్తాడు 

నేను  ఆ అపవిత్రమైన పప్పు తిని ఉండక పోతే  ఈ  పాటికి చచ్చి ఉండేవాడిని. 

ఇప్పుడు నాకు కొంచెం శక్తి వచ్చింది . నడవగలుగుతాను . దగ్గర్లోని ఏదైనా జలపాతం వద్ద నీళ్లు తాగుతాను  *


25, సెప్టెంబర్ 2021, శనివారం

 జర్నలిస్టుల మిత్రులకు ,


నా పేరు కాసవేన  సరోజ . వయస్సు 33. మందమర్రి నివాసం . నా జీవిత సమస్య ను మీ అందరితో పంచుకోవటానికి ఈ వివరణ ఇస్తున్నాను . 

నేను మరియు పుట్టపాక మల్లికార్జున (వయస్సు 38) గత రెండు సంవత్సరాలుగా ప్రేమ సంబధం లో ఉన్నాము . అతను మందమర్రి సింగరేణి స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. అతనికి తల్లి తండ్రి లేరు . ఒక్కడే కంపెనీ క్వార్టర్ లో నివాసం ఉంటాడు  . ఎక్కువ  కాలం మా ఇంటి దగ్గరే ఉండేవాడు . మా కుటుంబం లో ఒక సభ్యునిగా కలిసిపోయాడు . మా నాన్న గారితో  ,మా తమ్ముడితో కూడా ఎంతో స్నేహంగా మెలిగే వాడు . మల్లికార్జున్ ఒంటరి వాడు కావడం వల్ల  అతని మంచి చెడ్డలు ,భోజనవసతి  అన్నీ  మేమే  దగ్గరుండి చూసుకునేవాళ్ళం . అందరం ఒక కుటుంబం లా కలిసిమెలసి ఉండేవాళ్ళం . పండగలు ,పబ్బాలు ,జాతరలు అన్నీ  మాతోనే కలిసి జరుపు కునేవాడు.

నా గత జీవితం లో అప్పటికే నేను ఒక పెళ్లి ఐన వ్యక్తి  మోసానికి గురై  ఉన్నాను  ఒక బాబుకి తల్లిని కూడా . ఇదంతా ఎనిమిది ఏండ్ల కిందటి మాట .  నా కొడుకు భవిష్యత్తు కోసం ఆ మోసగాడిపై అన్నివిధాలా పోరాడాను .కాని , ఎక్కడా  న్యాయం జరగలేదు . అప్పుడు నా కుటుంబమే నన్ను ఆదుకుంది . ఇక అన్నీ మరిచి పోయి నా కొడుకు కోసం నా కుటుంబం  తో కలిసి బ్రతకాలని నిర్ణయుంచుకున్నాను . 

నేను అప్పటికే బికాం చదువు కొని వున్నాను .నా కుంటుంబానికి భారం కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడడానికి పెళ్ళిసంబంధాలు కుదురుస్తూ వున్నాను . మల్లికార్జున్ కూడా ఈ విషయం లో నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు .. ఈ క్రమము లో  నవంబర్ 14  ,2020 న  రెబ్బెన దగ్గ ర గంగాపూర్ వెంకటేశ్వరా స్వామి  గుడి లో దేవుని సాక్షిగా మల్లికార్జున్ నా మెడలో తాళి కట్టాడు. నా కొడుకు కు, నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసాడు  . 

ఇంత కాలం బాగానే ఉన్నాడు . ఇటీవల ఎవరి మాటలో విని వరకట్నంకు  ఆశ పడి ఇంకో పెళ్ళికి సిద్దమయ్యాడు . నేను వ్యతిరేకించడం తో నాపై కోపం పెంచుకొని  విపరీతంగా ,విచిత్రంగా ప్రవర్తించ సాగాడు . 

తర్వాత ఇంటి నుంచి కూడా  వెళ్ళిపోయాడు . ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నాడు . అతని సమాచారం లేక నేను చాలా కంగారు పడ్డాను . గత అనుభవాల దృష్ట్యా నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు . ఏ క్కడ న్యాయం  దొరుకుతుందో తెలియలేదు . 

మల్లికార్జున మంచితనం తెలిసిన నేను నా కుటుంబం అతనిపై పోలీస్ కేసు పెట్టడానికి ఇష్టపడ లేదు . ఏదైనా మహిళా సంఘం ద్వారా  ఈ  సమస్యను  పరిష్కరించుకోవాలని అనుకున్నాం .అప్పుడు స్త్రీల సమస్యలను పట్టించుకొనే భూమిక హెల్ప్లైన్ నెంబర్ 1800 425 2908 తెలిసింది. 

వెంటనే వారికి ఫోన్ చేసాను . ఆ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుంది .  నా కంప్లైంట్ భూమిక సంస్థ ద్వారా డిప్యూటీ కమీషనీర్ అఫ్ పోలీస్ (డిసిపి )వద్ద రిజిస్టర్ అయింది . నా కంప్లైంట్  రిజిస్టర్ నెంబర్  ID  20210004083691 . 

ఆ తర్వాత హైదరాబాద్ డీసీపీ కార్యాలయం నుండి నా కంప్లైంట్ మందమర్రి పోలీస్ స్టేషన్ కి చేరింది . అప్పుడు నన్ను పోలీసులు స్టేషన్  కి పిలిపించారు . నా నుంచి  ఒక  వ్రాత పూర్వక ఫిర్యాదును తీసుకున్నారు . నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు 

ఈ మధ్యలో విషయం  తెలుసుకొన్న మల్లికార్జున్  ఎవరెవరితోనో  ఫోన్లు చేయిస్తూ  బెదిరిస్తున్నాడు .  డబ్బులు  ఇచ్చి వదిలించుకుంటానని దుర్మార్గం గా  ప్రవర్తిస్తున్నాడు . 

ఇలాంటి దుర్మార్గులకు తగిన బుద్ధి  చెప్పాలని , నాకు న్యాయం జరగాలని .. దానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను 

 ఇట్లు 

కసవేన సరోజ 

కాంటాక్టు నెంబర్ . 8142368069

మందమర్రి ,మంచిర్యాల జిల్లా 

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

  ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ కి మరణం లేదని ప్రకటిద్దాం !


 రాజ్యం గెలిచింది .. లేదు .. సామ్రాజ్యవాద రాజ్యం గెలిచే సమస్య లేదు . అది మరణ శయ్య పైన వుంది ..

 తన బిడ్డల్ని తనే తినేసే రాజ్యం . .. జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి వెలిగిపోయే  ప్రజాసామ్య దేశాలు

 తన  మేధావులను తానే దుర్మార్గంగా చంపేసే అభివృద్ధిని ఎలా అర్థం చేసుకుందాం ?

నూరు ప్రశ్నలు ,వేయు  సమాధానాలు కావాలి . 

పెరూ  దేశం గొప్ప పేరున్న దేశం . దక్షిణ అమెరికా లో  వుంది .  

1988 సంవత్సరం లోనే వార్తా పత్రికల్లో షైనింగ్ పాత్  గెరిల్లాల గురుంచి ,వారి నాయకుడు 

అభిముల్ గుంజమాన్ గురుంచి చదివినప్పుడు మన కలలు నిజమయ్యే రోజు  దగ్గర లోనే

 ఉందనే  ఉత్సాహం పెరిగేది .

 షైనింగ్ పాత్  ..అనే పేరు అయితే నన్ను వెంటాడేది . 

సముద్రుడి తో నిరంతరం సంభాషణలో ఉండిన రోజులు అవి .. అతడి కవిత్వాన్ని వన్ బై టు

 చాయి

 లా ఆస్వాదిస్తున్న కవి సమయాలు .. మరో వైపు రాజ్యం విప్లవ కారుల తలలకు వెలలు 

 ప్రకటిస్తున్న పిదప కాలం .. 

ఆ కాలానికి సమాధానం గా సముద్రుడి కవిత్వాన్ని ప్రచురించాలని అనుకున్నాం 

ఆ బాధ్యత మొత్తంగా నేనే తల కెత్తుకున్నాను . 

చిన్న పుస్తకం  పేరు  'భూమి నా తల .. వెల నిర్ణయుంచు . .. అయితే అసలు విషయం

 ఏమిటంటే దానిని  "షైనింగ్ పాత్ ప్రచురణలు"  పేర  ప్రచురించాము .అదొక ఉద్విగ్న

 సమయం .. అలా తెలుగు నేల  మీద షైనింగ్ పాత్ వెలుగులు చూసి మురిసిపోయాం . 

అప్పటినుండి  పెరూ  దేశపు పోరాటాల్ని చదవడం అలవాటు అయింది 

నల్లని చారల డ్రెస్ తో ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ అరెస్ట్ చిత్రాల్ని చూసినప్పుడు 

బాధేసేది . మేధావుల్నిఇలా  గౌరవించడం  చూసి రాజ్యం వికృత రూపాల పట్ల అప్పటినుండి

 అసహ్యం వేసేది 

పేరూ  దేశపు సన్నివేశం  ఇక్కడ మన దేశం లోను పునరావృతం అయినప్పుడు అంతే

 భయపడ్డాను ..

సరిగ్గా నడవను  కూడా నడవ లేని  ప్రొఫెసర్ సాయిబాబాను జైలు లోనే బందీ గా ఉంచిన

 అమానుషం  ఒక వైపు నడుస్తుండగానే భీమాకో రేగావ్  కేసు లో ఓ 16 మంది మేధావుల్ని 

జైలు లో బంధించడం చూస్తూనే వున్నాం . 

ఇటీవల ఫాదర్ స్టాన్ స్వామి మరణం  మన న్యాయ వ్యవస్థను కూడా కదిలించిన విషయం 

మనకు తెలుసు . 

ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోననే ఊపిరి బిగపట్టుకునే బతుకుతున్నాం . 

సుదీర్ఘ కాలం అంటే దాదాపు 29 ఏండ్లు అభిముల్ గుంజమాన్  జైలులోనే వుండి ,జైలు లోనే

 మరణించడం గురుంచి మానవ హక్కుల సంస్థలైనా గొంతు విప్పడం ఒక అవసరం నేడు . 

సమసమాజం  కోసం కలలు కన్న ఒక నూతన మానవుడిని రాజ్య నిర్బంధం లో కోల్పోవడం 

మనందరికి తీరని లోటు . 


5, సెప్టెంబర్ 2021, ఆదివారం

భలే వాన ..


భలే వాన .. 


పగ బట్టినట్టే దబ్బున  కురిసి వెళ్ళింది వాన 

పడగ విప్పినట్టు వరద నడక సాగింది 

అంత వానకి కొసరులా తుంపర్ల వెంపర్లాట 

అయినా కురిసి కురిసీ  వెలిసిన వాన అందం 

 అబ్బో ! వేరేనబ్బా !


అంతా శుభ్రంగా కడిగి బోర్లేసినట్టు 

వరద కాలువ బోసినవ్వులు మెలికలు తిరిగి పోతుంటాయి 

#

అప్పటిదాకా నేలను అంటిపెట్టుకున్న రోడ్డు 

జల వాహనం గా  మారి పోతుంది 

అసలు ఉందొ లేదో తెలియని గాలి 

వాన చినుకుల చెవి రంగులతో 

కాసేపు హడావిడి చేస్తుంది 

#

చిన్న వాన కైనా 

గొడుగు పెద్దగుండాలి 

సొల్లువాన కి దొరక్కుండా .. 


#


తమాషాకి నేను

 గొడుగు ను తిరగేసి పట్టుకుంటా 

రాజా వారి కిరీట మల్లే .. 

అప్పుడు నా నడక మారిపోతుంది 

నా పాదాలు నీళ్ళల్లో చేప పిల్లల్లా 

ఈదుకుంటూ వెళతాయి 

నీల్లేమో  నా కాళ్ళ చుట్టూ చేరి 

మహా ప్రభో ! అని మొరపెట్టుకుంటాయి 

#

వానలో పూర్తిగా తడిచి చూస్తే తెలుస్తుంది 

అది  ప్రత్యేకముగా చిన్నపిల్లల పండగ  అని .. 


యధావిధిగా ఈ పెద్దలు ఉన్నారు చూసారూ !

వాళ్ళు హాయిగా ఆడుకోరు 

మమ్మల్ని  వదిలి  పెట్టరు 

ఈ వానా గొడుగు ఆటలో 

ఎప్పటిలాగే నేనే ఓడిపోతాను 

కాసేపటికి ఏమీ ఎరగనట్టు 

నీళ్లూ  జారుకుంటాయి .. 



 



 





 మనువాద బాహువులు 


ఏడవకు బిడ్డా !

కులం నిన్ను కాపాడుతుంది 

రాజ్యం నిన్ను భయపెడుతుంది 


ఏ ఉద్యమానికైనా  ఒక నినాదం అవసరమే మరి 

అది వెన్నెముకని నిలబెట్టేదిగా ఉండడం తప్పనిసరి 


కులం నాకు ఎప్పుడూ కిరీటం కాదు 

పైగా  రిజర్వేషన్ గాళ్లు  అనే  వెటకారం 


కులం నా అస్థిత్వమూ  కాదు 

వాడి  అణిచివేత కరవాలం 


కులం తోకలు  నా పేరు చివర 

ఎప్పుడూ లేవు 

అరే ,ఒరే .. అనే ముందు పేర్లు తప్ప ! 


మంత్రాలకు చింతకాయలు రాలనట్లే 

నా కులం పేరుకు ఏ ఆకాశం వంగి 

నమస్కారం చేయదు 

అలాగని పరాయికరణ 

నా అభిమతమూ  కాదు 

అయినా అది నన్ను కొండచిలువలా 

నమిలి మింగేసేది 

నాకో మతం రంగు పులిమేది 

ఎందుకో , ఏ మతమైనా నన్నొక తీవ్రవాదినే   చేసేది 

అప్పుడు నిజంగానే రాజ్యం 

నన్ను భయపెట్టేది 

పాపం శమించు  గాక !

కులం ఒక్కటే నన్ను కాపాడేది 

తన మనువాద బాహువుల్లో ఇరికించుకుని .. 





1, సెప్టెంబర్ 2021, బుధవారం

 కన్నతల్లి లాంటి ప్రకృతి కి ఎన్నో భావనలు.. 

కొన్ని అర్థమయ్యేవి.. 

కొన్ని భయపెట్టేవి.. 

అర్థమయి నంత మేరా ఏ గొడవా లేదు.. 

భయం దగ్గరే పెద్ద తగవు.. 

తను నోరు విప్పదు.. 

నాదేమో మట్టి బుర్ర..

 అంతా నువ్వే చేశావు.. 

అని అనుకున్నప్పుడల్లా ఎంతో దిగులు వేసేది.. 

కాదూ ..అంతా నా వల్లే అని గుండె రాయి చేసుకున్నప్పుడు 

 నీ గుండె చప్పుడు తెలిసేది..

 మౌనం లోనూ నీ మాటల ప్రవాహ సవ్వడి వినిపించేది..

 నువ్వు నా కన్న తల్లి వి కాదు.. 

నేను కని పెంచిన కన్నబిడ్డవని తెలిసి ఎంత మురిసిపోతానో!

15, ఆగస్టు 2021, ఆదివారం

స్వఛ్ఛ భారత్

 


స్వఛ్ఛ భారత్ 



గదిలో పేరుకుపోయిన చెత్తనంతా 

ఒంటి చేత్తో తొలగించినట్టే.. 

 

ప్రతి రోజూ   మనలో 

పోగయ్యే ఉన్మత్తను 

ఒక మూలకు 

నెట్టివేయక పోతే 

బతుకు చెత్త కుండే !


ఇది మావో సూక్తి .. 

తనని గుర్తు చేసుకోకుండా 

రోజు గడవని స్థితి 


ఎంత ప్రపంచీకరణ 

యూస్ అండ్ త్రో చెత్తో !

ఏరి పారవేసే సత్తా లేక 

మనిషన్నవాడే 

మాయం అయిపోతున్నాడు 


అన్నిటికీ ఎక్కడికక్కడ 

అంతుకులు బొతుకులు 

ఇదన్యాయమని అరిస్తే 

వాతలు ..కవాతులు ..  





ఒయాసిస్

 ఒయాసిస్ 


దేన్నీ వెదుక్కుంటూ 

వస్తామో .. 

దేన్నీ వదిలి 

పెడతామో ,, 

ఒంటి కాలు మీద కాలం 

ఎంత దూరం 

పరుగెడుతుందో .. 


ఎండ మావి లో  నీటిని 

ఒంటె -ఎడారి ఓడ 

నింపుకుంటుందా ?


అయినా  ఆశ  ఒక్కటే 

కన్నీటితో ప్రాణం పోసి 

ఒయాసిస్ ను 

నిలుపు  కుంటుంది  

 













నైట్ డ్యూటీ

 

నైట్ డ్యూటీ 

నైట్ డ్యూటీ 



పండు  కోవడానికి 


కండ్లు కాయలు కాయాలా  ?


నీ స్మరణ లో 


రేయి పగలు కావాలా  ?


కాలాన్ని కదిలిస్తే 


కళ్ళు మూత పడతాయి 


ఒంటరిది ఈ చీకటి 


వెలుగును కావలించుకుంటుంది 


నిదుర మబ్బు కన్నులలో 


నిన్ను నిలుపుకుంటుంది  


గది నిండా నీ మాయ 


గుండె  నిండిపోతుంది 


మాటల్ని పేర్చుకుంటూ 


కొత్త గోడలు మురిసిపోతుంటాయి 







29, జులై 2021, గురువారం

వాన నుయ్యి

  నేల బావి 

      ~ 

అబ్బో .. 

నా కిటికీలను , తలుపుల్ని 

దబా దబా బాదుతూ

ఒక్కటే గాలి..


నురగలు కక్కుతూ 

ఉరుముల మేఘాల దండు..


నిజంగానే 

కుంభవృష్టికి  ఒక్క అడుగు దూరం - అనే 

అల్లకల్లోలాన్ని

తట్టుకొని నిలబడటం 

కష్టమే !

ఈ  హడావిడి అందాలకే

మనసు కరిగి కవితయ్యేది

నీటి చుక్క కోసం 

నింగి నిండు మనసు నిట్టూర్చేది 


గాలివాటు  గమనం మేఘానిది 



మబ్బుల్ల వాన కంటే 

నా కాళ్ళ కింద భూమి లోంచి

ఉబికి వచ్చే నీటితోనే 

కాళ్లు కడుక్కోవడం 

 ఒక ఒబ్బిడి అలవాటు 


నా గొయ్యి నేనే  తవ్వుకున్నట్టే

ఉండేది    ఒకోసారి

ఒక నుయ్యి తవ్వుకోవడం

చెంబెడు నీళ్లకోసం 


పోనీ , భళ్ళున కురిసినా 

వరదలయ్యే వాన కన్నా 


 తరిగినా ,పెరిగినా 

 నేల బావి   నీటి మట్టం

నన్ను ఊరించే 

నిండు చందమామ  ... 

28, జులై 2021, బుధవారం

 ఆత్మీయ ప్రయాణం 


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

ప్రకృతి తో ప్రణయం - అది

కదలిక ఏదైనా ప్రారంభమే !

రెప్పపాటు చలనమే కదా

చీకటి వెలుగుల ప్రయాణం 


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

ప్రణయం లో పరవశం -అది


నీలో ఒంటరితనం
 
గూడు కట్టుకోవడం

  - వేరు


నిన్ను ఏకాకివనే ఫత్వాలకు

అస్సహయంగా తల వంచండం 

 - వేరు


ఒక్కడివే సాగి పొమ్మనే తత్వాలకు

నిస్సహాయంగా ఫిదా కావడం 

- వేరు


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

పరవశంతో ప్రవహించటమే  - అది


ఒక భావన జత కడితే

ఆ ప్రయాణం అద్బుతం


మనిషి నీడైనా తోడుంటేనే

అది మమతలెరిగిన జీవితం..


మనసు ఖాళీలను పూరించేదే 

ఆత్మీయ ప్రయాణం..





19, జులై 2021, సోమవారం

ముద్దు నిద్ర

 ముద్దు నిద్ర 

ఎప్పుడూ  నిద్రే 

నిద్ర బోతు ! 

అస్సలు చెప్పను వాళ్లకు 

ఇది కలత నిద్ర కాదు 

 కమ్మటి కలల నిద్ర అని .. 

కవితా

 కవితా .. 

తెలిసీ తెలిసి 

దాని మాయలోనే 

పడతావ్ !

అది నిన్ను వదలదు 

దాన్ని  నువ్వూ .. 

అవునూ ..నువ్వూ

 అవునూ ..నువ్వూ  


అవునూ. 

ఎలా వంట బట్టిందో ఈ మాట  ?

అవును 

ఏంటో మరి ఈ పద బంధ  వ్యామోహం !

అంతా  కాలమహిమ  

కాలం మీద  పెద్ద పట్టింపు ఉండేది కాదు 

 దాని వెనకే ఎప్పుడూ   పరిగెత్తింది లేదు 

కాని - 

ఎక్కడో దాని 'కొస' దొరకపుచ్చుకొని 

ఉయ్యాలలూగినట్టు గుర్తు

అవునూ .. 

అప్పుడెప్పుడో నువ్వు ఎదురైనప్పుడే 

ఆ కాస్త తోక కూడా  తెగిపోయింది 

అవునూ .. 

చివరికి మిగిలింది అదేనేమో  నాకు 

దాన్నే  ఒక కానుకగా  

నీకే ఇచ్చేశా తెలియక ..  

అది  మొదలు  కాలంతో 

పెద్దగా అవసరం  పడిందీ  లేదు 

అవునూ .. 

నడుస్తున్న తీరం దారి ఒక్కటే తెలిసేది  

మహాసముద్రం ఎప్పుడూ భయపెట్టేది

అందుకే నాకు తెలియని విషయాలే  నీకు 

పెద్దగా తెలిసినట్టు చెప్పేవాడిని  


నాకు ఎప్పటికీ తీరని దా హం - ప్రయాణం 

దాన్నే నీ కాళ్ళ కింద తివాచీలా  పరిచాను 

అవునూ .. 

నాకు తెలుసుగా నీ భూభ్రమణ కాంక్ష 


అవునూ .. నీకు గుర్తుందా ?

నువ్వు ప్రశ్నల వర్షం కురిపించేదానివి  

ఊరికే వూ  కొట్టకుండా 

అన్ని తెలిసినట్టు అవు.. నూ .. అనేవాడిని 

దీర్ఘం ఒక  ప్రేమరూపం  నాకు 


అయినా నాకు జవాబు తెలిసిన 

ఒకే ఒక ప్రశ్న నువ్వే గా !

అందుకే నాకు ప్రశ్న ,జవాబుల సమస్య లేదు 

అప్పటి నుండే అవునూ .. 

నాకు ఒక అలవాటుగా మారిపోయింది 

దానితో కొత్గగా ఏ సమస్యా రాలేదు 

పేరుకుపోయిన వేమీ  పారిపోలేదు 

అవునూ ..  మరి 

అది ఒక  'ఆక్ట్ అఫ్ బాలన్స్ 'నీ మాదిరి 

అయినా ప్రశ్నలు అనేకం 

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి  

అఖండాలుగా విస్తరించేవి

ఎదో ఒక అర్థం  మాట తో  

సమాధానపడనీ మనసు 

అవునూ .. పాపం అంటుంది 

అవునూ .. 

ఈ పదమొక్కటే 

మన ఇద్దరి చేతులు పట్టుకుని 

ఆడుకుంటుంది 

తనకి తోచినట్టూ .. 



 










14, జులై 2021, బుధవారం

 తడిసిన కవితలు రెండు .. 

1

కుండపోత కాదోయ్ 

నేనిక్కడే వుండి  పోతా  నంటూ 

కురుస్తోంది వాన 


అందరూ  ముసుగు తన్ని పడుకున్నారు 

నేను ఒక్కడ్నే 

గొడుగు విప్పుకొని 

బయలు దేరాను 

చినుకుల్ల డప్పులతో .. 

దారిపొడుగునా ఒక్కటే 

వాన ఊరేగింపు .. 

2


నేలకేసి చినుకులతో 

వాన దబ  దబా బాదుతుంది 

మన్ను తిన్న పాము అది 

తడిసి తడిసి 

మరింత ముద్ద ఐపోతుందే  కానీ 

లేచి చావదే 1

నేను వాన బాధ ని గమనిస్తుంటాను 

దాన్ని అక్షరాల్లోకి దింపుతుంటాను 


దానికి  ఎలా తెలిసి పోతుందో !

కిటికీ పక్కన కూర్చున్న 

నా ఒడిలోకి  చల్లగాలిలా 

దూరిపోతుంది 

దాన్ని ముద్దు చెయ్యకుండా 

ఎలా ఉంటాను 

ఆ ముచ్చట 

నీకు  చెప్పకుండా 

ఎలా ఉండగలను 


 కాలం కన్నతల్లి లా .. 


పొద్దుటి నుంచే నా మీద పెట్టబోయే రాజద్రోహ కేసుల గురుంచి చర్చ జరిగింది . గత రాత్రి ఒక ప్రయత్నం జరిగింది . నాలో మొండి తనమో ,ఒక అమాయక ఆదర్శవాదమో కానీ వాళ్ళని భలే ఇబ్బంది పెట్టింది . ఏ కారణం చేతో కానీ వాళ్ళు నన్ను మరీ బలవంత పెట్టలేదు .  

కానీ ఉదయం నుంచి చాలా తెలివిగా నన్ను అంటిపెట్టుకొని ,నా నుంచి ఎదో రాబట్టాలని ట్రై చేసి ,ట్రై చేసి  అయినా అలిసిపోని NIA పోలీస్ 

(DSP  రాంక్ అని చెప్పుకొన్నాడు)నేను ప్రెస్ ముందుకు వెళ్లే ముందు చాలా సేపు మాట్లాడాడు . 

అంతా ఢిల్లీ నుంచి వాళ్ళ బాస్ చెబుతున్నట్టే జరుగుతుంది . నా మీద పెట్ట బోయే కాసేలా గురుంచి చెప్పాడు .  అతని నోటి నుంచే మొదట విన్నాను .. అర్బన్ నక్సల్ నేషనల్ కోఆర్డినేటర్ ..నన్ను వేటాడటానికి భారత్ ప్రభుత్వం నాకు తగిలించిన పేరు .. ఆ హోదా కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మొదట .. ఆ తర్వాత ఎప్పటి లాగే నవ్వే వచ్చింది .. దాంతో పాటు మహానుభావుడు  మహా కవి శ్రీశ్రీ మాట ఒకటి గుర్తొచ్చింది . విరసం అధ్యక్షపదవి రాష్ట్ర పతి పదవి కంటే గొప్పదని .. 

అతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు .. ఏవో మెసేజెస్  వస్తున్నాయి . కాసేపాగి నాతో మాట్లాడాడు . 

ఇంకా మీకు అవకాశం ఉంది .. మా బాస్ ఒక ఆఫర్ ఇస్తున్నారు .. మీ మీద ఈ కేసులన్నీ ఎత్తేస్తారు .. మీ ఉద్యోగం మీకు ఉంటుంది .. మీరు మాకోసం పని చెయ్యండి .. 

అయితే నేను ఒక్కటే మాట  అన్నాను .. మీ కోసం పని చెయ్యగలిగే .. అంత  పెద్ద మనిషిని కాను ..

 

అతను విడిచి పెట్టలేదు . కూల్ గ ఆలోచించమని చెప్పాడు .. 

ఆలోచించడానికి నాదగ్గర అలాంటి మనుసు లేదు .. అలా నేను బహుశా ఎప్పటికి చెయ్యలేను .. అంత తెలివి తేటలు నాదగ్గర లేవు .. 

అన్నిటికి మనం సమాధానం చెప్పి తీరాలని లేదు .. 

కాలం .. కష్టాల పాలు చేసినట్టే కన్నతల్లి లా కాపాడుతుంది . 

కాలం ఎవ్వరి కోసం ఆగదు  గా .. 

ప్రెస్ ముందుకు , ఆ తర్వాత పోలీస్ కస్టడీ కి వెళ్ళిపోయాను 






9, జులై 2021, శుక్రవారం

హలో ! కల్లోలం

హలో ! కల్లోలం 


 చెప్పినట్టు చెయ్యవు ..అని 

నువ్వు మనుసు కష్ట పెట్టుకుంటావు 

నీ కష్టాన్ని నేనూ  చూడలేను .. 

మరి, పరిష్కారం ?


చేతబడి మాదిరి 

నీ మాటకి కట్టుబడి పోవడమే .. 


బుర్రలోంచి నానా చెత్తనంతా తీసేసి 

నీ మాట  ఒక్కటే ఎంచక్కా ఆచరణ లో పెట్టేసి 

 చూసా ఈ రోజు ..


ఆశ్చర్యం ! మరి    మాములుగా లేదు 

నేను మాయం అయిపోయి 

అచ్చంగా నువ్వే మిగిలావంటే 

నీకే నమ్మకం కలగదు 


మరి..  ఇన్నాళ్లు -

దీనికింత గుంజాటన ఎందుకు ? అంటే 

నేను ,నేనుగా మిగలనప్పటి  

కాల మహిమ -అది కాబోలు! 


ఒక గుంపు లోంచి ,

గొర్రెల  మంద లోంచి 

ఒక చివరి లోకి 

ఏదైనా ముగింపు లోకి

చేరుకుంటే  అది .. అదే  నువ్వేమో ! 


నువ్వంటూ మిగిలితే నే కదా 

ఎవరైనా నిన్ను గుర్తు పట్టేది 

నీకొక ముద్దు..  పేరు పెట్టేది 

హలో ! కల్లోలం .. 




 అచ్చంగా 

నాకేమిటి కావాలో 

వెదుకుకుంటూ పోవడమే 

జీవితం కాబోలు !


కాలికేదో  'గొప్పు' తగులుతుంది 

అయినా ఆగకుండా 

సాగడమే జీవితమేమో !


ప్రయాణ బడలిక 

విశ్రాంతి కోరుతూ 

'రాస్తా రోకో ' చేస్తుంది 

దాని పై 'లాఠీ ఛార్జ్ 'కి దిగకుండా 

'సరెండర్'  కావడమే జీవిత సూత్రమేమో !

 

పెట్టుబడి  మానవత్వం 

విరిగిపోయిన పాచి బద్ద 

ఎవడిక్కావాలి అది ?

వాడికీ  పనికి రాదనుకున్నప్పుడే 

ఆ  "అమానవత్వాన్ని" 

నా మొఖాన విసిరి కొట్టి 

కాస్త పుణ్యం మూట కట్టుకొంటాడు 


 నీ మతమూ , మానవత్వం 

84 ఏండ్ల  ఫాదర్ స్టాన్ కి 

మాత్రమే కాదు 

మంచినీళ్లు తాగే అతడి సిప్పర్కి  కూడా 

ఎంతో దయ తో - మరణాన్ని ప్రసాదించింది 

బహు పరాక్ !

గాంధీనే  కాల్చి చంపిన గాడ్సేలు 

గోముఖ వ్యాఘ్రాలు..  


 క్షణాలను పొదువు కుంటూ 

నేను పొదిగేది నీ ప్రేమ నే .. 

7, జులై 2021, బుధవారం

అది వొట్టి బొమ్మే అయితే 

ఎన్ని రంగులేసి అయినా మెప్పించ వొచ్చు 

అది ఊసు పోని కవితే  అయితే 

కొట్టివేతలతోనూ  సరిపెట్టుకోవచ్చు 

కానీ - పట్టించుకోవటం లేదు అని 

పూట పూట కి మంకు పట్టు పట్టే 

పాపం - పిచ్చిమనుసు ను 

ఎలా ఏమార్చను 

116 వ ఎక్కం 


అయితే గియితే 

జీవితమొక లెక్కల పుస్తకం మాత్రమే 

ఎక్కాల పేజీ మొట్టమొదటిది 

అందులో 116 వ  ఎక్కం ముఖ్యం 

చదివింపులు ,పెట్టిపోతలు 

అన్నీ నూట పదహార్లే గా 

ఎంత చదివిస్తామో 

అంతకు మించి రాబట్టుకోవాలి 

అదీ చదువుల సారం 

బ్రతుక్కి అర్థం  పరమార్థం 

ఇటుది అటైనా 

అటుది ఇటైనా 

లెక్కలు సరిపోవాలి 

116 వ ఎక్కం 

వెయ్యు నూట పదహార్లుగా 

ఎదిగిపోవాలి .. 

 మన కలల్ని  మనమే 

పనిగట్టుకుని 

ప్రతిరోజూ 

గానం చెయ్యక పోతే 

కలతలే రాజ్యమేలుతాయి


 నిషేధాల నడుమ 

విప్లవమూ ,ప్రేమా 

విషాదాల బరువు

 నువ్వూ ,నేనూ 

ప్రేమ కాలం

ప్రేమ కాలం 


 కాలం -

ఒక్కటే నీ సొత్తు 

దానితో 

కూసింత పొత్తు నాది 

అదేగా - నువ్వు 


గల గలా ప్రవహిస్తావు నువ్వు 

కల కంటూ- నేనూ పరుగెడతాను  నీ వెనక 

బహుశా  ప్రేమ అంటే 

అదేనేమో 

గుడ్డి వెలుతురు

గుడ్డి వెలుతురు 


 మనసు కుదురు కోని 

కంచు కోటలో -


కటిక చీకటి ఒక్కటైనా 

భయమే 


కళ్ళు మిరుమిట్లుగొలిపే 

ఎన్ని వెలుగులున్నా

ఎదో  తెలియని  బెరుకే  


అందుకే నేమో 

నా మటుకు  నేను 

కళ్ళు మూసుకుని 

చల్లని వెన్నెలని 

ఆవిష్కరిస్తాను 



తడిసిన కల నువ్వు

తడిసిన  కల  నువ్వు  


 ప్రియా !

విరహంలో దిగబడి పోయాననే  ఏమో 

ఆకాశ నావ లో  వాన పరవళ్లు 


ముక్క వాసన వేసే పదాలతో ఇక 

ఈ వాన గురుంచి రాయలేను 

కొత్త భాష ఒకటి కాలువలై 

నా కళ్లెదుట పారుతుంటే .. 


గొడుగు పుట్టినప్పుడే నా సంబంధం 

చినుకుతో   ముడిపడిపోయింది 

మేమిద్దరమే ఊరూవాడని 

ఏకం చేసే వాళ్ళం 

కాగితం పడవలు వేసుకొని 

నా కలలు చినుకుల్లో ఊరేగివి 

ఊరేగింపుగా వెళ్లి వరద 

చెరువు నిండి పోయేది 


నా కన్నుల పండుగ - వాన 

చినుకు సవ్వడి వింటూ 

కునుకు సంగతే మరిచాను 

ఎదో అలికిడి విని - చూస్తే 

తడిచి ముద్దైన   వాన వణుకు మల్లే నీవు 

అప్రయత్నంగానే 

ఒక దేవతా వస్త్రం తో  

తల తుడుచుకున్నాను 

వానా  వెలిచిపోయింది 


4, జులై 2021, ఆదివారం

జులై 2,2021. 

పుట్టిన రోజు అని ఫేస్బుక్ చేసే హడావిడి .. నా మనసు లో ఏమీ లేదా అంటే- ఏముంటుంది ?ఎలాగుంటుంది అనే ప్రశ్నలు తోసుకు వస్తాయి. 

కొంచెం లోతుల్లోకి వెళితే -నాకేమి కాని నా బాల్యం ,ప్రత్యేకం గా చెప్పుకోవటానికి  ఏమి మిగల్చని చీకటి అనుభవాలే ఎక్కువ .. 

తొందరగా ఎదిగి పోయి ,పెద్దయి ఎదో నాకు నేనే అన్నీ చేసేసుకోవాలని ఉబలాటం ఉండేది . అప్పట్లోనే రేడియో లో బాపు గారి అందాల రాముడు సినిమా లో పాట ఒకటి మరి భలే తికమక పెట్టేది . "ఎదగడానికెందుకురా తొందర .. ఎదర బతుకంతా చిందరవందర .. "అయినా సరే నా పట్టుదల లో మార్పు రాలేదు .. 

అప్పటికే చిందరవందర బాల్యం మనది .. 

అమ్మ నాన్నకి పురుడు ,పుట్టు వెంటుకలు దేవుడికి ఇయ్యటం తప్ప పుట్టిన రోజు లు జరుపుకునే 

కాన్సెప్ట్ లేదు . అయినా మా నాన్న చాలా తెలివిగా ఉండేవాడు . మా ముగ్గురి పుట్టిన తేదీలు ఎవరితోనో భద్రంగా ఒక పుస్తకం లో రాయించి పెట్టాడు . మేము ముగ్గురం మొగ మహారాజులం . 

20, జూన్ 2021, ఆదివారం

గాయాల సమస్య

 గాయాల సమస్య 

మనుషులం కదా !

అందులో మరీ అల్ప జీవులం 

అనేక సమస్యలతోనే పుడతాము 

మనతో పాటే అవీ పెరిగి పెద్దవవుతాయి 

మనకు తెలీకుండానే కొన్ని సమస్యల్లో 

కూరుకుపోతాం 

సమస్యలన్నిటితో పోరాడుతున్నట్టే ఉంటుంది 

కానీ, నీడలతోనే యుద్ధం చేస్తుంటాము 

చివరికి , మనకు మనమే 

ఒక సమస్యగా మిగిలిపోతాం 

అప్పుడు -అలవాటుగా మన నీడతోను 

యుద్ధం లోకి వెళ్ళి పోతాం 

అది తీరని తగవు 

తెల్లారని చీకటి .. 

మనమూ  అలిసిపోతాము 

ఎప్పటిలాగే 

మన కలలు ఒక్కటే 

గాయాల పాలు అవుతాయి . 



మనసు ఒక తీరం

మనసు ఒక తీరం 


అంగలు   వంటి అలలన్నిటిని

వల వేసి పట్టినట్టుగా 

అచ్చంగా ఒక సముద్రం  గా  మారిపోతాను 

నా చుట్టూ పరుచుకున్న 

తీరం మీద నడక   కోసం .. 


తీరం నా తీరని కోరిక 

తీరం -నా దొంగ మనసు 

కానీ ,దానిది దొరల దర్జా .. 

అందుకేనేమో  అల్లకల్లోలం అయి పోతాను  


అల్లంత దూరం నుంచి హోరుగా వస్తానా !

అబ్బే !దాన్ని ఎప్పుడూ పట్టుకోలేక పోతాను 




19, జూన్ 2021, శనివారం

 మనుషులం కదా!

అనేక సమస్యలతో పుడతాం మనతో మనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..మనుషులం కదా!మనుషులమే మనమనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..తో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..మనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..మనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంమనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..ది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం.. అనేమనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..మనుషులం కదా! అనేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..క సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..నేక సమస్యలతో పుడతాం మనతో సమస్యలు పెరిగీ పెద్ద వవుతాయి మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో కూరుకుపోతాం అన్నిటితో పోరాడుతున్నట్లు వుంటుంది కొన్నిసార్లు నీడ లతో యుద్దం చేస్తుంటాం ఒకోసారి మన నీడతోనే.. మరోసారి మన కలల తోను.. అవును.. నీడతో యుద్దం లో అలిసి పోతాము కలల యుద్దం లో గాయపడతం..

14, జూన్ 2021, సోమవారం

మాట రాని ఆకులకి ఒక కాలం

మాట రాని ఆకులకి ఒక కాలం 

 నువ్వు పక్కనుంటే 

ఈ కవిత్వమింత మక్కువగా 

నన్ను అంటుకుని ఉండేది కాదేమో !


బహుశా .. 

ఇలా - అన్నీ అతిశయోక్తులతోనే 

కాలం నడిచి పోయేదేమో ! 


ఇప్పుడు - నాకు- అది 

దానికి -ఇక- నేనే .. 

అన్నట్టుగా  వుంది వ్యవహారం 

ఇదంతా - ఆ మూలన  కుండీ లో పెరుగుతున్న  మొక్క ఒకటీ 

ఆకులు చాచి కనిపెడుతూనే ఉంది 

దానితో ఎలా మరి సంభాషణ ?

ఆ  మూల నుంచి లాక్కొచ్చి 

దాన్ని గది  మధ్యలో నిలబెట్టాను

నిన్ను నా మదిలో సిలువ వేసినట్టు ..  


పదాలను వెతుక్కుంటూ నేను చేసే పచార్లను 

అదీ లెక్కిస్తూ ఉండేది ఆకుల్ని కదిలిస్తూ .. 

ఆ మాత్రం దానికే -ఆకులో ఆకునై .. 

అని  పాట పాడుకునేవాడిని 


పచ్చనాకు సాక్షిగా  నేనూ 

అచ్ఛంగా  వానా కాలం  కవినే ..

అందులోకి  .అల్ప సంతోషిని .. 


  



కాసేపు మౌనంగా ఉండు

కాసేపు మౌనంగా  ఉండు

 

 ఈ ముద్దే ఇక 

చివరిది కాబోదు లే !

మరింతగా ముద్దొచ్చే మరెన్నో మురిపాలు 

నోరు కుట్టేసుకుని కాచుక్కూర్చుంటాయి 


అలాగే ఈ మాటే  ఆఖరిదై పోదు 

ముప్పిరిగొన్న భావాలు నీ ముంగురులలోనే 

చిక్కుపడి  అలాగే నక్కి నక్కి వుంటాయి 


నువ్వూ కాసేపు 

మౌనంగా ప్రవహించు . . 

అన్నీ సర్దుకుంటాయి 

సాయంకాలం వర్షం లా 

అన్నీ కుదురుకుంటాయి 

సుడులు  తిరిగే కారుమబ్బులు 

కోటానుకోట్ల నీ కంటి  మెరుపులు 

నీ కోపాన్ని నటించే   పిడుగులు .. 

అన్నీ ..  చల్లని వర్షమై 

అల్లుకుంటాయి చూడు !






9, జూన్ 2021, బుధవారం

కవిత్వం ఒక కల

కవిత్వం ఒక కల

ప్రియా . 

నీ ఒడిలో తల వాల్చే 

కల ఒక్కటి దయ సేయవా . . 


వయసు మీద పడి 

మనసు  విరిగి పడి 

కళ్లూ ..  మూతలు పడి పడీ 

నీ జ్యాపకాలే  కవితలు  గా 

ఈ గాలి  నిండుగా తేలుతుంటే .

ఆ కల ఒక్కటి దయ సేయవా .. . 


ఏదైనా ప్రవాహామే 

జారిపడే  జలపాతమే 

కాలం వాలున 

కనురెప్పల తడిలోంచి 

ఒక్క  కల విసిరేయవా 


అవునూ .. నువ్వు 

కలల మహారాణివి 

కళామ తల్లివి 

నీ సుదూర లక్ష్యాలు 

సమగ్ర పథకాలు 

బహుశా ..నిన్నూ 

సుఖంగా నిదురోనీయవు 

నీది నిత్యం పరుగే .. 

అలిసి సొలిసిపోయినప్పుడు 

మాత్రం నువ్వు 

తప్పక నా కల కంటావు 

ఆ కమ్మటి  కల ఒక్కటి దయ సేయవా 






8, జూన్ 2021, మంగళవారం

నిద్రనెలా నిందించను..

నిద్రనెలా నిందించను..  


 నేనైతే శుభ్రంగా అన్నీ  సర్దుకుని 

నా టైం ప్రకారమే ,

అదే అర్ధరాత్రే లెండి 

పక్క ఎక్కేసాను 

చీకటి కురుల్లో కుదురుగా 

మల్లెపువ్వుల్లా ముడుచుకుపోయాను 

కనురెప్పల్నీ చీకటి కాటుక తోనే 

అతికించేశాను 

కానీ ..ఏది నిద్ర ?

రమ్మంటే రాదే చెలియా 

దాని కథ ఎదో అప్పుడే మొదలయినట్టుంది 

పురుసత్ గా ఎవరెవరినో తట్టి లేపుతుంది

కలిసినప్పుడు అనలేక 

మింగేసిన మాటల్ని 

ఇప్పుడు కక్కేస్తుంది 

అద్దమ  రాతిరి  మద్దెల దరువు లా.. 

ఎలా ఆపేది దీన్ని ?

పైగా నన్నే దబాయిస్తుంది 

చాల్లే !మధ్యాహ్నం పూట ఓ కునుకేశావ్ గదా !

ఎప్పుడూ నిద్ర ముఖమేనా ? 

మడిసన్నాక కాస్త కళా పోసన వుండాలోయ్ !

అంటూ ..  నా చెయ్యి పట్టుకొని 

గాలిలో షికార్లు కొట్టిస్తుంది 


పైపైనే చూసి వదిలేసిన చాలా వాటిని 

మళ్ళీ మరింత లోతుగా చూపిస్తుంది 

తన కంటి చూపు తోనే 

కొత్త అర్థాలను వివరిస్తుంది 

అప్పటికే నాలో ముసుగు తన్ని పడుకున్న 

కవి  మిత్రుడికి నిద్రాభంగం అవుతుంది 

జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను 

దించుకున్నట్టు 

కాగితం ,కలాన్ని పొదివి పట్టుకుంటాడు 

చీకటి కురుల్ని సవరిస్తూ 

ప్రియురాలి నీలికళ్ళపై 

విరహ గీతం రాసుకుంటాడు 

ఇంతలోకే .. తన పంతం 

నెరవేరిందని కాబోలు .. నిద్ర 

 కాఫీ తాగొస్తానని చెప్పి తుర్రుమంటుంది 


అప్పటి దాకా తన మానాన తను 

ఒక మూల దాక్కున్నదోమ ఒకటి 

నా మీదకి దాడికి దిగింది 

"ఏక్ మచ్చర్ ఆద్మీ కో 

హిజడా బనా దేతా హై "


నా నిద్ర కి ఇది రోజు అలవాటు 

చెప్పలేదని నా మీద నింద  మోపేరు .. 


24, మే 2021, సోమవారం

 "నామ్ సే  నఫ్రత్ "

ఆ పేరు వింటేనే చిరాకు ..అని తెలుగు లో సర్ది చెప్పుకోవచ్చు నెమో!

ఆయుర్వేదం ఆనందయ్య కరోనా మందు నేఫథ్యం లో ప్రగతిశీల వ్యక్తుల్లోనూ డ్రైనేజీ లా పొంగిపొర్లతున్న అశాస్త్రీయత పెద్ద చర్చకి దారితీసింది . చర్చ మంచిదే కదా!

అయితే ఈ సందర్భంగా నా అనుభవం ఒకటి మీతో పంచుకుంటాను . 

సంవత్సరం  బహుశా 2016 అనుకుంటాను. బాబా రామ్ దేవ్ గారి ఆధ్యాత్మిక ,ఆయుర్వేద సామ్రాజ్యం 

యోగా పేరు మీద పతంజలి పేరుతో దేశం నాలు మూలల విస్తరిస్తున్న కాలం అది . 

ఒక మిత్రుడ్ని కలవటానికి ఛత్తీస్గఢ్ వెళ్లాను . వాళ్ళ కుటుంబం ప్రజా సంఘం లో పని చేస్తుంది . వాళ్ళ అబ్బాయి (20 ఏండ్లు ఉండొచ్చు ) పొద్దున్నే నా దగ్గరికి వచ్చి ,అంకుల్ బ్రష్ చేసుకోండి అన్నాడు . అయ్యో పేస్ట్ మర్చి పోయాను అన్నాను . ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాడే sensodyne  పేస్ట్ ని చేతిలో పట్టుకొని ,మీరు పతంజలి దంతకాంతి  వాడుతారేమో కదా .. చిన్నగా నవ్వుతూ  అన్నాడు.

ఆయుర్వేదం అనంగానే ఇక అదేదో ప్రకృతి సహజం అనుకుంటూ వేలంవెర్రిగా దాని వెనకాల పరుగెడుతున్న 'మధ్యతరగతి మందబుద్ధిని' నాలో కనిపెట్టాడేమోనని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. 

  కాస్త ఉక్రోషం తో ఒక్క మాట కక్కేసాను 

నామ్ సే  నఫ్రత్ .. 

పతంజలి .. నేను అస్సలు వాడను అని చెప్పాను 


 

22, మే 2021, శనివారం

దుఃఖం

దుఃఖం  

 కండ్లు రెండు నిండుగా ఉండగా 

ఓ కంట కన్నీటి  ఖర్చుకేల చింత  ?


నా కంటి తడే  కదా నిన్ను తాకేది 

కంగారు ఏమీ లేదు 

కోపం తాలూకు వేడి అంతా 

మళ్ళీ నాలోకే  కుదురు కుంటుంది 

 

అవును .. నా అక్షరాలు 

 వరద  కాల్వల్లో  కాగితం పడవలై 

కవిత్వం వాసన వేస్తాయి 

 



4, మే 2021, మంగళవారం

 నేను..  అనే అనాది అన్వేషణకు 

ఏదైనా సాధన మార్గం దొరికేనో ..  లేదో 

ఒక ప్రయత్నం అసంకల్పితంగా 

జర జరా జరిగిపోతూ ఉంటుంది 

అయినా సరే ,

నాకేమి తెలియకుండానే ఈ  దారి 

ఎదో నడిచిపోని 

అలిసిపోయిన వేళా 

నీ ఒడిలో నిదురపోని 

ఏమో !నాకేమీ తేటతెల్లం కాకనే 

నీ కంటి వెలుగులోకి 

తొంగి చూస్తాను 

గాఢాంధకారం లో ఓ రేఖ 

నీ చంద్రహాసం 

నాతో వెలుగు నీడల ఆటలాడుకుంటూ 

నన్నుచీకటి లా  అల్లుకుంటూ అల్లుకుంటూ

 పడిలేచే కెరటాలలా కదలాడుతూ 

ఒక సముద్రం నన్ను తట్టి లేపుతూ .. 

*

ఒక ప్రశ్నకు సమాధానం దొరకదు 

రెండో ప్రశ్న తయారు .. 

నువ్వెక్కడ కలిశావు ?

ఆ సంధ్య ఎప్పుడు అంతే !

నా కళ్ళు రెండు మూసి 

తాను ఒక్కతే  గుండెల నిండుగా 

నవ్వుకుంటుంది 

సముద్రపు అంచుల్లో 

నువ్వెక్కడ నడిచావు 

అలలే నా అడుగులయితే ..