నేను.. అనే అనాది అన్వేషణకు
ఏదైనా సాధన మార్గం దొరికేనో .. లేదో
ఒక ప్రయత్నం అసంకల్పితంగా
జర జరా జరిగిపోతూ ఉంటుంది
అయినా సరే ,
నాకేమి తెలియకుండానే ఈ దారి
ఎదో నడిచిపోని
అలిసిపోయిన వేళా
నీ ఒడిలో నిదురపోని
ఏమో !నాకేమీ తేటతెల్లం కాకనే
నీ కంటి వెలుగులోకి
తొంగి చూస్తాను
గాఢాంధకారం లో ఓ రేఖ
నీ చంద్రహాసం
నాతో వెలుగు నీడల ఆటలాడుకుంటూ
నన్నుచీకటి లా అల్లుకుంటూ అల్లుకుంటూ
పడిలేచే కెరటాలలా కదలాడుతూ
ఒక సముద్రం నన్ను తట్టి లేపుతూ ..
*
ఒక ప్రశ్నకు సమాధానం దొరకదు
రెండో ప్రశ్న తయారు ..
నువ్వెక్కడ కలిశావు ?
ఆ సంధ్య ఎప్పుడు అంతే !
నా కళ్ళు రెండు మూసి
తాను ఒక్కతే గుండెల నిండుగా
నవ్వుకుంటుంది
సముద్రపు అంచుల్లో
నువ్వెక్కడ నడిచావు
అలలే నా అడుగులయితే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి