హలో ! కల్లోలం
చెప్పినట్టు చెయ్యవు ..అని
నువ్వు మనుసు కష్ట పెట్టుకుంటావు
నీ కష్టాన్ని నేనూ చూడలేను ..
మరి, పరిష్కారం ?
చేతబడి మాదిరి
నీ మాటకి కట్టుబడి పోవడమే ..
బుర్రలోంచి నానా చెత్తనంతా తీసేసి
నీ మాట ఒక్కటే ఎంచక్కా ఆచరణ లో పెట్టేసి
చూసా ఈ రోజు ..
ఆశ్చర్యం ! మరి మాములుగా లేదు
నేను మాయం అయిపోయి
అచ్చంగా నువ్వే మిగిలావంటే
నీకే నమ్మకం కలగదు
మరి.. ఇన్నాళ్లు -
దీనికింత గుంజాటన ఎందుకు ? అంటే
నేను ,నేనుగా మిగలనప్పటి
కాల మహిమ -అది కాబోలు!
ఒక గుంపు లోంచి ,
గొర్రెల మంద లోంచి
ఒక చివరి లోకి
ఏదైనా ముగింపు లోకి
చేరుకుంటే అది .. అదే నువ్వేమో !
నువ్వంటూ మిగిలితే నే కదా
ఎవరైనా నిన్ను గుర్తు పట్టేది
నీకొక ముద్దు.. పేరు పెట్టేది
హలో ! కల్లోలం ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి