తడిసిన కవితలు రెండు ..
1
కుండపోత కాదోయ్
నేనిక్కడే వుండి పోతా నంటూ
కురుస్తోంది వాన
అందరూ ముసుగు తన్ని పడుకున్నారు
నేను ఒక్కడ్నే
గొడుగు విప్పుకొని
బయలు దేరాను
చినుకుల్ల డప్పులతో ..
దారిపొడుగునా ఒక్కటే
వాన ఊరేగింపు ..
2
నేలకేసి చినుకులతో
వాన దబ దబా బాదుతుంది
మన్ను తిన్న పాము అది
తడిసి తడిసి
మరింత ముద్ద ఐపోతుందే కానీ
లేచి చావదే 1
నేను వాన బాధ ని గమనిస్తుంటాను
దాన్ని అక్షరాల్లోకి దింపుతుంటాను
దానికి ఎలా తెలిసి పోతుందో !
కిటికీ పక్కన కూర్చున్న
నా ఒడిలోకి చల్లగాలిలా
దూరిపోతుంది
దాన్ని ముద్దు చెయ్యకుండా
ఎలా ఉంటాను
ఆ ముచ్చట
నీకు చెప్పకుండా
ఎలా ఉండగలను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి