నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
అచ్చంగా
నాకేమిటి కావాలో
వెదుకుకుంటూ పోవడమే
జీవితం కాబోలు !
కాలికేదో 'గొప్పు' తగులుతుంది
అయినా ఆగకుండా
సాగడమే జీవితమేమో !
ప్రయాణ బడలిక
విశ్రాంతి కోరుతూ
'రాస్తా రోకో ' చేస్తుంది
దాని పై 'లాఠీ ఛార్జ్ 'కి దిగకుండా
'సరెండర్' కావడమే జీవిత సూత్రమేమో !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి