116 వ ఎక్కం
అయితే గియితే
జీవితమొక లెక్కల పుస్తకం మాత్రమే
ఎక్కాల పేజీ మొట్టమొదటిది
అందులో 116 వ ఎక్కం ముఖ్యం
చదివింపులు ,పెట్టిపోతలు
అన్నీ నూట పదహార్లే గా
ఎంత చదివిస్తామో
అంతకు మించి రాబట్టుకోవాలి
అదీ చదువుల సారం
బ్రతుక్కి అర్థం పరమార్థం
ఇటుది అటైనా
అటుది ఇటైనా
లెక్కలు సరిపోవాలి
116 వ ఎక్కం
వెయ్యు నూట పదహార్లుగా
ఎదిగిపోవాలి ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి