జర్నలిస్టుల మిత్రులకు ,
నా పేరు కాసవేన సరోజ . వయస్సు 33. మందమర్రి నివాసం . నా జీవిత సమస్య ను మీ అందరితో పంచుకోవటానికి ఈ వివరణ ఇస్తున్నాను .
నేను మరియు పుట్టపాక మల్లికార్జున (వయస్సు 38) గత రెండు సంవత్సరాలుగా ప్రేమ సంబధం లో ఉన్నాము . అతను మందమర్రి సింగరేణి స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. అతనికి తల్లి తండ్రి లేరు . ఒక్కడే కంపెనీ క్వార్టర్ లో నివాసం ఉంటాడు . ఎక్కువ కాలం మా ఇంటి దగ్గరే ఉండేవాడు . మా కుటుంబం లో ఒక సభ్యునిగా కలిసిపోయాడు . మా నాన్న గారితో ,మా తమ్ముడితో కూడా ఎంతో స్నేహంగా మెలిగే వాడు . మల్లికార్జున్ ఒంటరి వాడు కావడం వల్ల అతని మంచి చెడ్డలు ,భోజనవసతి అన్నీ మేమే దగ్గరుండి చూసుకునేవాళ్ళం . అందరం ఒక కుటుంబం లా కలిసిమెలసి ఉండేవాళ్ళం . పండగలు ,పబ్బాలు ,జాతరలు అన్నీ మాతోనే కలిసి జరుపు కునేవాడు.
నా గత జీవితం లో అప్పటికే నేను ఒక పెళ్లి ఐన వ్యక్తి మోసానికి గురై ఉన్నాను ఒక బాబుకి తల్లిని కూడా . ఇదంతా ఎనిమిది ఏండ్ల కిందటి మాట . నా కొడుకు భవిష్యత్తు కోసం ఆ మోసగాడిపై అన్నివిధాలా పోరాడాను .కాని , ఎక్కడా న్యాయం జరగలేదు . అప్పుడు నా కుటుంబమే నన్ను ఆదుకుంది . ఇక అన్నీ మరిచి పోయి నా కొడుకు కోసం నా కుటుంబం తో కలిసి బ్రతకాలని నిర్ణయుంచుకున్నాను .
నేను అప్పటికే బికాం చదువు కొని వున్నాను .నా కుంటుంబానికి భారం కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడడానికి పెళ్ళిసంబంధాలు కుదురుస్తూ వున్నాను . మల్లికార్జున్ కూడా ఈ విషయం లో నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు .. ఈ క్రమము లో నవంబర్ 14 ,2020 న రెబ్బెన దగ్గ ర గంగాపూర్ వెంకటేశ్వరా స్వామి గుడి లో దేవుని సాక్షిగా మల్లికార్జున్ నా మెడలో తాళి కట్టాడు. నా కొడుకు కు, నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసాడు .
ఇంత కాలం బాగానే ఉన్నాడు . ఇటీవల ఎవరి మాటలో విని వరకట్నంకు ఆశ పడి ఇంకో పెళ్ళికి సిద్దమయ్యాడు . నేను వ్యతిరేకించడం తో నాపై కోపం పెంచుకొని విపరీతంగా ,విచిత్రంగా ప్రవర్తించ సాగాడు .
తర్వాత ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయాడు . ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నాడు . అతని సమాచారం లేక నేను చాలా కంగారు పడ్డాను . గత అనుభవాల దృష్ట్యా నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు . ఏ క్కడ న్యాయం దొరుకుతుందో తెలియలేదు .
మల్లికార్జున మంచితనం తెలిసిన నేను నా కుటుంబం అతనిపై పోలీస్ కేసు పెట్టడానికి ఇష్టపడ లేదు . ఏదైనా మహిళా సంఘం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాం .అప్పుడు స్త్రీల సమస్యలను పట్టించుకొనే భూమిక హెల్ప్లైన్ నెంబర్ 1800 425 2908 తెలిసింది.
వెంటనే వారికి ఫోన్ చేసాను . ఆ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుంది . నా కంప్లైంట్ భూమిక సంస్థ ద్వారా డిప్యూటీ కమీషనీర్ అఫ్ పోలీస్ (డిసిపి )వద్ద రిజిస్టర్ అయింది . నా కంప్లైంట్ రిజిస్టర్ నెంబర్ ID 20210004083691 .
ఆ తర్వాత హైదరాబాద్ డీసీపీ కార్యాలయం నుండి నా కంప్లైంట్ మందమర్రి పోలీస్ స్టేషన్ కి చేరింది . అప్పుడు నన్ను పోలీసులు స్టేషన్ కి పిలిపించారు . నా నుంచి ఒక వ్రాత పూర్వక ఫిర్యాదును తీసుకున్నారు . నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు
ఈ మధ్యలో విషయం తెలుసుకొన్న మల్లికార్జున్ ఎవరెవరితోనో ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తున్నాడు . డబ్బులు ఇచ్చి వదిలించుకుంటానని దుర్మార్గం గా ప్రవర్తిస్తున్నాడు .
ఇలాంటి దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని , నాకు న్యాయం జరగాలని .. దానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను
ఇట్లు
కసవేన సరోజ
కాంటాక్టు నెంబర్ . 8142368069
మందమర్రి ,మంచిర్యాల జిల్లా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి