నైట్ డ్యూటీ
నైట్ డ్యూటీ
పండు కోవడానికి
కండ్లు కాయలు కాయాలా ?
నీ స్మరణ లో
రేయి పగలు కావాలా ?
కాలాన్ని కదిలిస్తే
కళ్ళు మూత పడతాయి
ఒంటరిది ఈ చీకటి
వెలుగును కావలించుకుంటుంది
నిదుర మబ్బు కన్నులలో
నిన్ను నిలుపుకుంటుంది
గది నిండా నీ మాయ
గుండె నిండిపోతుంది
మాటల్ని పేర్చుకుంటూ
కొత్త గోడలు మురిసిపోతుంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి