జులై 2,2021.
పుట్టిన రోజు అని ఫేస్బుక్ చేసే హడావిడి .. నా మనసు లో ఏమీ లేదా అంటే- ఏముంటుంది ?ఎలాగుంటుంది అనే ప్రశ్నలు తోసుకు వస్తాయి.
కొంచెం లోతుల్లోకి వెళితే -నాకేమి కాని నా బాల్యం ,ప్రత్యేకం గా చెప్పుకోవటానికి ఏమి మిగల్చని చీకటి అనుభవాలే ఎక్కువ ..
తొందరగా ఎదిగి పోయి ,పెద్దయి ఎదో నాకు నేనే అన్నీ చేసేసుకోవాలని ఉబలాటం ఉండేది . అప్పట్లోనే రేడియో లో బాపు గారి అందాల రాముడు సినిమా లో పాట ఒకటి మరి భలే తికమక పెట్టేది . "ఎదగడానికెందుకురా తొందర .. ఎదర బతుకంతా చిందరవందర .. "అయినా సరే నా పట్టుదల లో మార్పు రాలేదు ..
అప్పటికే చిందరవందర బాల్యం మనది ..
అమ్మ నాన్నకి పురుడు ,పుట్టు వెంటుకలు దేవుడికి ఇయ్యటం తప్ప పుట్టిన రోజు లు జరుపుకునే
కాన్సెప్ట్ లేదు . అయినా మా నాన్న చాలా తెలివిగా ఉండేవాడు . మా ముగ్గురి పుట్టిన తేదీలు ఎవరితోనో భద్రంగా ఒక పుస్తకం లో రాయించి పెట్టాడు . మేము ముగ్గురం మొగ మహారాజులం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి