14, జూన్ 2021, సోమవారం

మాట రాని ఆకులకి ఒక కాలం

మాట రాని ఆకులకి ఒక కాలం 

 నువ్వు పక్కనుంటే 

ఈ కవిత్వమింత మక్కువగా 

నన్ను అంటుకుని ఉండేది కాదేమో !


బహుశా .. 

ఇలా - అన్నీ అతిశయోక్తులతోనే 

కాలం నడిచి పోయేదేమో ! 


ఇప్పుడు - నాకు- అది 

దానికి -ఇక- నేనే .. 

అన్నట్టుగా  వుంది వ్యవహారం 

ఇదంతా - ఆ మూలన  కుండీ లో పెరుగుతున్న  మొక్క ఒకటీ 

ఆకులు చాచి కనిపెడుతూనే ఉంది 

దానితో ఎలా మరి సంభాషణ ?

ఆ  మూల నుంచి లాక్కొచ్చి 

దాన్ని గది  మధ్యలో నిలబెట్టాను

నిన్ను నా మదిలో సిలువ వేసినట్టు ..  


పదాలను వెతుక్కుంటూ నేను చేసే పచార్లను 

అదీ లెక్కిస్తూ ఉండేది ఆకుల్ని కదిలిస్తూ .. 

ఆ మాత్రం దానికే -ఆకులో ఆకునై .. 

అని  పాట పాడుకునేవాడిని 


పచ్చనాకు సాక్షిగా  నేనూ 

అచ్ఛంగా  వానా కాలం  కవినే ..

అందులోకి  .అల్ప సంతోషిని .. 


  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి