10, అక్టోబర్ 2021, ఆదివారం

కన్నీటి కాలం

 కన్నీటి కాలం 


కాలాన్ని ఎంత పిండుకున్నానో 

నా కన్నీటి ధారనడుగు .. 


జారిపడ్డ ప్రతి కన్నీటి బొట్టు 

కాలం ఒడిలోకే  చేరిందని చెప్పలేను 


తొక్కిపెట్టిన కన్నీరే 

మాటిమాటికి తన్నుకుంటూ వస్తుంది 


కన్నీటి ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోలేదు 

అందుకేనేమో అది అప్పుడప్పుడు 

కాలం తో  కలిసి దొంగదెబ్బ తీస్తుంది 


నేలచూపుల కన్నీటికి ఎదురుచూపులే 

నేర్పానని అనుకున్నాను 

కానీ అది అప్పుడప్పుడు చాటుగా తల తిప్పి 

పక్క చూపులు చూస్తుంది 

కాలం వేపు ఆర్తిగా .. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి