గాయాల సమస్య
మనుషులం కదా !
అందులో మరీ అల్ప జీవులం
అనేక సమస్యలతోనే పుడతాము
మనతో పాటే అవీ పెరిగి పెద్దవవుతాయి
మనకు తెలీకుండానే కొన్ని సమస్యల్లో
కూరుకుపోతాం
సమస్యలన్నిటితో పోరాడుతున్నట్టే ఉంటుంది
కానీ, నీడలతోనే యుద్ధం చేస్తుంటాము
చివరికి , మనకు మనమే
ఒక సమస్యగా మిగిలిపోతాం
అప్పుడు -అలవాటుగా మన నీడతోను
యుద్ధం లోకి వెళ్ళి పోతాం
అది తీరని తగవు
తెల్లారని చీకటి ..
మనమూ అలిసిపోతాము
ఎప్పటిలాగే
మన కలలు ఒక్కటే
గాయాల పాలు అవుతాయి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి