14, జూన్ 2021, సోమవారం

కాసేపు మౌనంగా ఉండు

కాసేపు మౌనంగా  ఉండు

 

 ఈ ముద్దే ఇక 

చివరిది కాబోదు లే !

మరింతగా ముద్దొచ్చే మరెన్నో మురిపాలు 

నోరు కుట్టేసుకుని కాచుక్కూర్చుంటాయి 


అలాగే ఈ మాటే  ఆఖరిదై పోదు 

ముప్పిరిగొన్న భావాలు నీ ముంగురులలోనే 

చిక్కుపడి  అలాగే నక్కి నక్కి వుంటాయి 


నువ్వూ కాసేపు 

మౌనంగా ప్రవహించు . . 

అన్నీ సర్దుకుంటాయి 

సాయంకాలం వర్షం లా 

అన్నీ కుదురుకుంటాయి 

సుడులు  తిరిగే కారుమబ్బులు 

కోటానుకోట్ల నీ కంటి  మెరుపులు 

నీ కోపాన్ని నటించే   పిడుగులు .. 

అన్నీ ..  చల్లని వర్షమై 

అల్లుకుంటాయి చూడు !






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి