మనసు ఒక తీరం
అంగలు వంటి అలలన్నిటిని
వల వేసి పట్టినట్టుగా
అచ్చంగా ఒక సముద్రం గా మారిపోతాను
నా చుట్టూ పరుచుకున్న
తీరం మీద నడక కోసం ..
తీరం నా తీరని కోరిక
తీరం -నా దొంగ మనసు
కానీ ,దానిది దొరల దర్జా ..
అందుకేనేమో అల్లకల్లోలం అయి పోతాను
అల్లంత దూరం నుంచి హోరుగా వస్తానా !
అబ్బే !దాన్ని ఎప్పుడూ పట్టుకోలేక పోతాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి