నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
దుఃఖం
కండ్లు రెండు నిండుగా ఉండగా
ఓ కంట కన్నీటి ఖర్చుకేల చింత ?
నా కంటి తడే కదా నిన్ను తాకేది
కంగారు ఏమీ లేదు
కోపం తాలూకు వేడి అంతా
మళ్ళీ నాలోకే కుదురు కుంటుంది
అవును .. నా అక్షరాలు
వరద కాల్వల్లో కాగితం పడవలై
కవిత్వం వాసన వేస్తాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి