ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ కి మరణం లేదని ప్రకటిద్దాం !
రాజ్యం గెలిచింది .. లేదు .. సామ్రాజ్యవాద రాజ్యం గెలిచే సమస్య లేదు . అది మరణ శయ్య పైన వుంది ..
తన బిడ్డల్ని తనే తినేసే రాజ్యం . .. జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి వెలిగిపోయే ప్రజాసామ్య దేశాలు
తన మేధావులను తానే దుర్మార్గంగా చంపేసే అభివృద్ధిని ఎలా అర్థం చేసుకుందాం ?
నూరు ప్రశ్నలు ,వేయు సమాధానాలు కావాలి .
పెరూ దేశం గొప్ప పేరున్న దేశం . దక్షిణ అమెరికా లో వుంది .
1988 సంవత్సరం లోనే వార్తా పత్రికల్లో షైనింగ్ పాత్ గెరిల్లాల గురుంచి ,వారి నాయకుడు
అభిముల్ గుంజమాన్ గురుంచి చదివినప్పుడు మన కలలు నిజమయ్యే రోజు దగ్గర లోనే
ఉందనే ఉత్సాహం పెరిగేది .
షైనింగ్ పాత్ ..అనే పేరు అయితే నన్ను వెంటాడేది .
సముద్రుడి తో నిరంతరం సంభాషణలో ఉండిన రోజులు అవి .. అతడి కవిత్వాన్ని వన్ బై టు
చాయి
లా ఆస్వాదిస్తున్న కవి సమయాలు .. మరో వైపు రాజ్యం విప్లవ కారుల తలలకు వెలలు
ప్రకటిస్తున్న పిదప కాలం ..
ఆ కాలానికి సమాధానం గా సముద్రుడి కవిత్వాన్ని ప్రచురించాలని అనుకున్నాం
ఆ బాధ్యత మొత్తంగా నేనే తల కెత్తుకున్నాను .
చిన్న పుస్తకం పేరు 'భూమి నా తల .. వెల నిర్ణయుంచు . .. అయితే అసలు విషయం
ఏమిటంటే దానిని "షైనింగ్ పాత్ ప్రచురణలు" పేర ప్రచురించాము .అదొక ఉద్విగ్న
సమయం .. అలా తెలుగు నేల మీద షైనింగ్ పాత్ వెలుగులు చూసి మురిసిపోయాం .
అప్పటినుండి పెరూ దేశపు పోరాటాల్ని చదవడం అలవాటు అయింది
నల్లని చారల డ్రెస్ తో ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ అరెస్ట్ చిత్రాల్ని చూసినప్పుడు
బాధేసేది . మేధావుల్నిఇలా గౌరవించడం చూసి రాజ్యం వికృత రూపాల పట్ల అప్పటినుండి
అసహ్యం వేసేది
పేరూ దేశపు సన్నివేశం ఇక్కడ మన దేశం లోను పునరావృతం అయినప్పుడు అంతే
భయపడ్డాను ..
సరిగ్గా నడవను కూడా నడవ లేని ప్రొఫెసర్ సాయిబాబాను జైలు లోనే బందీ గా ఉంచిన
అమానుషం ఒక వైపు నడుస్తుండగానే భీమాకో రేగావ్ కేసు లో ఓ 16 మంది మేధావుల్ని
జైలు లో బంధించడం చూస్తూనే వున్నాం .
ఇటీవల ఫాదర్ స్టాన్ స్వామి మరణం మన న్యాయ వ్యవస్థను కూడా కదిలించిన విషయం
మనకు తెలుసు .
ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోననే ఊపిరి బిగపట్టుకునే బతుకుతున్నాం .
సుదీర్ఘ కాలం అంటే దాదాపు 29 ఏండ్లు అభిముల్ గుంజమాన్ జైలులోనే వుండి ,జైలు లోనే
మరణించడం గురుంచి మానవ హక్కుల సంస్థలైనా గొంతు విప్పడం ఒక అవసరం నేడు .
సమసమాజం కోసం కలలు కన్న ఒక నూతన మానవుడిని రాజ్య నిర్బంధం లో కోల్పోవడం
మనందరికి తీరని లోటు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి