9, జూన్ 2021, బుధవారం

కవిత్వం ఒక కల

కవిత్వం ఒక కల

ప్రియా . 

నీ ఒడిలో తల వాల్చే 

కల ఒక్కటి దయ సేయవా . . 


వయసు మీద పడి 

మనసు  విరిగి పడి 

కళ్లూ ..  మూతలు పడి పడీ 

నీ జ్యాపకాలే  కవితలు  గా 

ఈ గాలి  నిండుగా తేలుతుంటే .

ఆ కల ఒక్కటి దయ సేయవా .. . 


ఏదైనా ప్రవాహామే 

జారిపడే  జలపాతమే 

కాలం వాలున 

కనురెప్పల తడిలోంచి 

ఒక్క  కల విసిరేయవా 


అవునూ .. నువ్వు 

కలల మహారాణివి 

కళామ తల్లివి 

నీ సుదూర లక్ష్యాలు 

సమగ్ర పథకాలు 

బహుశా ..నిన్నూ 

సుఖంగా నిదురోనీయవు 

నీది నిత్యం పరుగే .. 

అలిసి సొలిసిపోయినప్పుడు 

మాత్రం నువ్వు 

తప్పక నా కల కంటావు 

ఆ కమ్మటి  కల ఒక్కటి దయ సేయవా 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి