8, ఫిబ్రవరి 2023, బుధవారం

అసలు విషాదం


అసలు విషాదం 

*************


భూకంపం ఒక శాపం కాదు 

ప్రకృతికి మనిషి మీద కోపం లేదు 


అది నిరంతరం చలనం లో వుండే రెండు  భూ ఖండాల మధ్య ఘర్షణ 

మన కాళ్ళ కింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 

సూర్యుని  చుట్టు తిరుగుతుంది 

భూమి పొరలు పొరలుగా ఉంటుంది 

పై పొర ముక్కలై కదులుతున్న పలకల్లాగా ఉంది 

అవే  మనం నివసించే ఏడు భూఖండాలు 

ఈ పలకల మధ్య రాపిడే భూకంపాలు 


వేల కోట్ల సంవత్సరాల వయసు లో 

భూమి భూకంపాలను తట్టుకునే నిలబడింది 


భూకంపాలు పెద్ద పెద్ద నదులకు మార్గాలు అయ్యాయు 

బొగ్గు ,పెట్రోలు బావులకు నిలయాలు అయ్యాయి 

ఆకాశంలో ఉరుములకు  ,నేల మీద  భూకంపాలకు 

మనిషి మొదటి సారి భయపడ్డాడు 


పిడుగుల్ని పట్టి భూమిలో బంధించే 

విజ్ఞానం సంపాదించాడు 

భూకంపాన్ని అధ్యనం చేశాడు 

ఎక్కడ ,ఎలా వస్తుందో కనిపెట్టేసాడు  

ప్రకృతి లో మార్పుల్ని     ఆప గలగడం కష్టం 

అయినా మనిషి ప్రయత్నం ఆగదు

 

భూకంప వినాశానాన్ని నివారించ గలిగే 

విజ్ఞానం పుష్కలంగా ఉంది 

దాన్ని ప్రజల కోసం నిస్వార్ధం గా 

వాడగలిగే ప్రభుత్వాలు లేవు 

...... 

అది .. అసలు విషాదం . 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి